Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. నీ మనసు ఏదో బాధలో ఉంది, ఎవరి మీదో అది కుటుంబ బంధువు కావొచ్చు, కానీ వారిని ఏమీ అనలేని, చేయలేని, మార్చలేని అశక్తుడవు. ఇప్పుడు అయినా అర్ధం అయ్యిందా, ధనము తో సాధించలేనిది, చాలా ఉంది అని?
అడిగిన కరోనా ప్రశ్నలు కు తప్ప, నువ్వు ఏమేమిటో ధన సహాయం గొప్పల గురించి, నీకు తెలియని పుణ్యం గురించి, టాపిక్ కు సంబంధం లేని, విషయాలు ఇప్పుడు ఎందుకు, మనసులో ఏదో పెట్టుకుని, ఏదో చెపుతున్నావు.
అమ్మ ను తేవడం, ఉద్యోగ విరమణ కూడా అందరితో చెపుతున్నా. మిగతావి, పబ్లిక్ గా అందరితో పంచుకుంటున్నా.
మనము అన్నీ కరెక్ట్ అనుకోకుండా, అందరి చేత తప్పులు ఒప్పులు, చెప్పించుకుంటున్నా. అలా నువ్వు జీవితము లో చేయలేవు. ఎందుకంటే, ఎవరినీ లెక్క చేయవు, ధనాన్ని తప్ప.
ఈ మూడు ఏళ్ళు లో, ధనం గురించి అడిగావు, ఇప్పుడు నీ మరియు నా పరిస్థితులు బాగోలేదు, తర్వాత చూద్దాం అన్నా. తర్వాత నీ ఫోన్ ఎప్పుడూ లేదు.
నువ్వు వ్యాపారం చేస్తూ, అందరి దగ్గర ధనము వాడుకుంటూ వారికి, వడ్డి ఇస్తున్నట్లు గా, నన్నూ అడిగావు 2 వడ్డీ నెలకు ఇస్తాను అని, 100 కు తక్కువ వద్దు ఉపయోగం లేదు అని. అంటే, నీ పనికి ఉపయోగమే ముఖ్యం? 100 లేకపోతే, ఇవ్వవు. ఇంక నీ సహాయం ఏముంది?
10 వడ్డీ ఇచ్చిన కూడా, నీ మనసు నీ పనులు నీ ఆలోచనలు బాగోలేదు. కుటుంబ జీవితము, అలాగే పిల్లలకు నువ్వు చేస్తున్న ద్రోహం, కరెక్ట్ కాదు. నాకు అత్యవసరం అయినా, నేను నష్టపోయినా, నీ దగ్గర తీసుకోను అన్నాను. ఇప్పుడూ, అదే మాట, తప్పను, నీ కుటుంబము బాగు పడిందాకా.
ఇప్పుడు వడ్డీ ఇచ్చినా కూడా, మధ్యలో నీకు వ్యతిరేకముగా చెప్పినా మాట్లాడినా కూడా, మానేస్తావు, ఇప్పుడు ఫోన్ లాగే అని చెప్పినా.
అప్పుడు నిజమైన మానవత్వం ఉన్న స్నేహితుడు ఏమి చేస్తాడు? అయ్యో ఇంత ఉండి, తనకు ఉపయోగ పడలేక పోయాను అని బాధపడి, మంచి మనిషి గా మారి, మరలా అడుగుతాడు సంవత్సరం కైనా.
ఇదుగో, మా ఇంట్లో గొడవలు లేవు. కావాలంటే, ఎవరినైనా అడుగు అని. కానీ నువ్వు, కుటుంబాన్ని నాశనము చేసుకుంటూ, నన్ను అవమానించావు అంటున్నావు, మూర్ఖత్వముతో.
గత చరిత్ర విను, మొదటి వారికి నచ్చ చెప్పడానికి, నన్ను ఇంకొకరిని పంపావు. నేను చెప్పిన వాటికి, మీ వాళ్ళు జవాబు చెప్పలేక, వారు లెగిచి కోపముతో ఊగిపోతు, మనిషి మీదకు వచ్చారు.
కోటి ఖర్చు ఉంటుంది, వద్దు విడిపోవడం అన్నాను. లేదు రాక్షసులతో ఉండను భరించలేను అన్నావు.
మరలా వెనక్కి పోతావు, నీకు నిలకడ నిబద్దత లేదు అన్నా. ఛాలెంజ్ వెళ్ళను అన్నావు. తర్వాత ఏమి జరిగిందో నీ అంతరాత్మకు తెలుసు.
కోట్లు వదులుకోని అయినా, కొడుకును వారము పూర్తి గా లేదా రోజు మార్చి రోజు ఉంచుకో అన్నా, బిడ్డకు తండ్రి ప్రేమ ఇవ్వాలి అనుకుంటే అన్నా. కానీ తక్కువ ధనం కు మాట్లాడుకుని మిగిల్చుకుని, కొడుకుని, గంటకు చాలు అనుకున్నావు. నీ సంస్కారం అది, నీ ధన ప్రేమ అది.
10 ఏళ్ళు పైగా సంసారం చేసావు, కొడుకు కోసం ఒంటరిగా ఉండు, కొడుకు బాగు మాత్రమే చూడు అన్నా. లేదు 2 వ బంధం కావాలి అన్నావు.
2 కు అన్యాయం చేస్తావు, నీకు కుదరదు అన్నా. ఛాలెంజ్, మరలా తప్పు చేయను, భయపెట్టకు అన్ని అలా ఎందుకు జరుగుతాయి నీ అనుమానాలు పాడవ్వ, జనం ఊస్తారు అన్నావు.
2 కు అన్యాయం చేసి, గొడవలతో, మరలా 1 కి పోతావు అన్నా. చాలెంజ్ 1 కి చచ్చినా పోను అన్నావు, తర్వాత నీ అంత రాత్మకు తెలుసు.
తల్లి దండ్రులు లేకుండా, 2 వ బంధము తొందర వద్దు అన్నాను, అశుభం, ఆగు ఇంకా కొన్ని నెలలు అన్నాను. వినలేదు.
గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు, పక్క లోకి ఆడ మనిషి కావాలి, కానీ వారి బిడ్డలు ప్రెమతో, తండ్రి దగ్గర ఉండవద్దా, పడుకోవద్దా? ఇదేనా మానవత్వం, బాధ్యత, సంస్కారం?
సొంత పిల్లలను దగ్గర ఉంచి, పెంచలేని వాడికి, పెళ్ళి అవసరమా? కన్న తల్లి దండ్రుల బాధ్యత చూస్తాడా?
బీదవాడు 7 ఏళ్ళు గా, ధనం అలాగే ఆదాయం లేకపోయినా నష్టపోయినా, తల్లికి అత్యుత్తమ వైద్యం ఇప్పిస్తుంటే, మిల్లీయనీర్ మాత్రం, కరోనా తర్వాత పేరెంట్స్ బతికి ఉంటే, తెచ్చి ఇక్కడ పర్మనెట్ గా పెట్టి, కోడళు మనుమల తో సేవ చేపిస్తాను, అనే చాలెంజ్ కి విలువ ఉందా?
7 ఏళ్ళు గా కనీసం, స్థానికముగా ఉండే కార్డు చేయించావా? ప్రతి సంవత్సరం, దగ్గరకు తెచ్చి, ఇక్కడ ఉంచావా, ఒక్క కోడలితో వండించి పెట్టావా?
ఇలాంటి ఉత్తమ, మనసు సంస్కారం ఉన్న వ్యక్తి దగ్గర, ధనం నేను వడ్డీ గా పొందితే, నాకు శ్రేయస్కరమా? లేక నీ పాపాలకు, తందనా అనడమా?
పండగ లకు శుభాకాంక్షలు చెప్పిన కూడా, జవాబు ఉండదు. సమస్కారానికి, ప్రతి నమస్కార సంస్కారం లేదు. సరే పెద్దలు కు మాత్రమే లే, అనుకుంటాం.
ఇవన్నీ నిన్ను అడిగి, కడిగి, నీ పతనం ఆపే స్నేహితులు, నీ వెంట ఉన్న 999 మంది లో ఉన్నారా? వారు అడగరు, అడిగితే, నీ అహం దెబ్బ తింటుంది. నువ్వు వారికి, ధన సహాయం ఆపేస్తావు.
వారూ నీ పాపాలలో, భాగం ఇలా పంచుకోబట్టే, మంచి రోజులు సాగుతున్నాయి. కానీ, వారి కాపురాలు కూడా, కలతల్లో నే ఉంటాయి, ఉండబోతాయి.
మరి ఇప్పుడు కూడా స్పష్టంగా కరోనా అని చెప్పిన కూడా, ఈ అర్థం లేని మాటలు, అన్ని ఎందుకు? రేపు ఉంటామో లేదో తెలీదు కదా?
నువ్వు ఎవరికీ సహాయం చేయలేదు అంటే, నువ్వు ఇచ్చిన జవాబు లు కరెక్టు. నేను ఆ మాట అనలేదు, అనను. మనసు ను ప్రశాంతంగా ఉంచుకో.
అప్పుడు అప్పుడు చిన్న వాళ్ళ తో కూడా, కనీసం స్నేహితుడి క్షేమ పలకరింపుల వరకు మాట్లాడుకో, సొంత విషయాలు పిల్లల గురించి చెప్పడం, ఇష్టం లేకపోతే.
సరే అదీ అవసరం లేదంటే, ఇక చెప్పేదేముంది. కరోనా వి చెప్పలేదు కదా.
మనసు మార్చుకో, వాస్తవం తెలుసుకో, కుటుంబాన్ని సంతోషముగా పెడితే, మాకు కోట్లు ఇచ్చినట్టే. ఆ త్రుప్తి చాలు.
నేను తప్పో, నువ్వు తప్పో, చెప్పెందుకు దేవుడు ఉన్నాడు. మన ఇద్దరికీ తెలిసిన, మనుషులూ ఉన్నారు. వారే చెపుతారు, వారినే అడుగు.
మరలా నా మాటలకు కోపము పెంచుకోకు, ఓ చిన్న వ్యక్తి నా మంచికి చెప్పాడు, నచ్చింది అనుకుంటే మారు, నచ్చలేదు అనుకుంటే ఎప్పటిలా వదిలేయి.
అంతే గానీ, మనసులో పెట్టుకుని, మరలా 3 ఏళ్ళకు హేళన చెయకు. నష్టం నీకే, ఇప్పుడూ అప్పుడూ.
నేను నిన్ను చాటు గా, ఎన్ని అన్న కూడా నష్టం లేదు. కానీ పది మంది లో చులకన కాకు, నీ మరియు నీ కుటుంబ పరువు తీయకు అని అర్ధించా, 2 వ బంధం ముందు, ఎన్నొ సార్లు. ఇప్పుడు కూడా అంతే.
ఇంకా చాలా ఉన్నాయి రాయడానికి, కానీ ఎందుకు, అనవసరము మనకు మరియు ఇతరులకు బాధ, ఇంతటితో ఆపేద్దాము, వీటి గురించి.
తెలుగులో తప్ప, దయచేసి, ఇంగ్లీష్ లో మరలా జవాబు వద్దు, మానవత్వం, మంచి తనం ఉంటే. తెలుగు గొంతు మెస్సేజ్ పెట్టు ఇబ్బంది లేదు.
అయినా ఇంక వాదనలు వద్దు. మనసు ప్రశాంతము గా ఉంచి, ఆలోచన చెయ్యి. పిల్లలను సంస్కార వంతులు గా తీర్చి దిద్దు, అదొక్కటే విన్నపము.
మాకు దోవ లేకపోతే, ఇంటికి వెళ్ళి పచ్చడి తో తింటాము. 20 ఏళ్ళు గా నేల నిద్ర శాఖాహారం, మందు పొగ పొందు లేని వాడికి, అది పెద్ద ఇబ్బంది కాదు.
కానీ ఆ పాపము లో నీకు బాధ్యత ఉంది, సహాయము చేయగలిగి ఉండి, ఆపలేక పోయావు మంచి మనిషి గా మారి, అన్నది జీవితములో 30 ఏళ్ళ తర్వాత అయినా, దేవునికి జవాబు చెపుతావు, ఆయన అడిగితే.
నేను, నీ సంస్కారం కుటుంబ విలువ లు గురించి మాట్లాడుతూ ఉంటే, జవాబు చెప్పలేక ఉద్యోగం వ్యాపారం విలువలు అని మాట్లాడుతున్నావు, అదే అనవసర, మానసిక వ్యధ.
ఒంటరిగా ఉంటే తెలుస్తోంది అని నేను అనను, అలాగే వ్యాపారం లో నీ సంగతి అందరూ చెప్పారు అని నేను అంటే, చేతగాని వాడి కింద లెక్క.
మిగతా తర్వాత కధనము లో, మొత్తము 6
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1797 General Articles and views 1,389,595; 94 తత్వాలు (Tatvaalu) and views 184,416 Dt : 26-Apr-2021, Upd Dt : 26-Apr-2021, Category : General
Views : 606
( + More Social Media views ), Id : 1133 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
god ,
brother ,
mind ,
cares ,
wish ,
commitment ,
son ,
relation Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments