దేవుడా, మేమే ఉత్తి తోలు బొమ్మలు అయితే, మరి కొత్త తరాలు సంగతి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,392,463; 104 తత్వాలు (Tatvaalu) and views 258,588.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనకు తెలుసు, మన తాతలు చాలా బలముగా ఉన్నారు, ఎందుకంటే ఆరోజులలో కాయ కష్టము లేదా కల్తీ లేని తిండి, మంచి ఆరోగ్యము. మైళ్ళ దూరము నడిచే వారు, పొద్దున్నే లెగిచే వారు, అన్ని పనులు తామే చేసుకునే వారు. పల్లెటూళ్ళలో కమ్మని పాలు, గాలి, సంతోషము. ఇప్పుడు, అన్నీ కల్తీలే, ఊత ఒళ్ళు లే, వేటికీ తట్టుకోలేము.

నిన్న ఒక కార్యక్రమంలో, ఉచితంగా వేస్తున్నారు అని, ఫ్లూ ఇంజక్షన్ వేయించుకున్నాము ఇద్దరం. ఇక్కడ వర్షాకాలములో వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త తో అవి వేయించుకుంటాము. ఉచితము అంటే, మనకున్న హెల్త్ ప్లాన్ ప్రకారం ఉచితమే ఎటూ, కాని మన ఆసుపత్రికి మన డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి. దగ్గరలో విడిగా కావాలంటే, డబ్బులు కట్టాలి, కాని కొన్ని కార్యక్రమాలలో ఉచితము గా చేస్తారు.

తర్వాత రోజుకు, నాకు చెయ్యి నెప్పి చేసింది. సీనియర్ సిటిజెన్ అమ్మ కు ఏమీ లేదు, మామూలుగా ఉంది. నన్ను చూసి నవ్వుతుంది. తెల్ల అన్నం తిన్న ఒళ్ళు, పాత తరం వాళ్ళ ఒళ్ళుకు, ఏనాడు సమం కాదు, నిజముగా.

నిన్న యూనివర్సిటీ, మాల్ లో కార్యక్రమం కోసం ఎంత తిరిగామో. చెయ్యి పట్టుకొని అలా నడుస్తానే ఉంది.

నేను భవిష్యత్ లో, ఆ వయసు లో, అంత నడవగలను అని నమ్మకం లేదు, నిష్ట, యోగా, ఆసనములు, శాఖాహారం చేస్తూ కూడా.

దేవుడా, మరి మనమే అంటే ఈ కాలము వాళ్ళము, తోలు బొమ్మలు అయితే చిన్న ఇంజక్షన్ కే ఇంత బాధగా ఉంటే, కొత్త తరాలు సంగతి? వారి మానసిక బలం?

అని రాము, గోపీ తో చెపుతున్నాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,463; 104 తత్వాలు (Tatvaalu) and views 258,588
Dt : 23-Oct-2019, Upd Dt : 23-Oct-2019, Category : General
Views : 1256 ( + More Social Media views ), Id : 192 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : our elders strength and confidence comparison with us and future generations
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content