Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో దక్షిణా మూర్తయే నమః, ఓం కరోనా గురవే నమః.
రూపాలు మరియు పేర్లు అయినా, మన వేల ఆలోచనలు మనస్తత్వాల లాగా, కానీ ఆత్మలు ఒకటే, పరమాత్మ ఒకటే, నిరాకారుడు నిరంజనుడు ఒకరే.
బిడ్డల మైన మనల్ని ప్రపంచ మాయలలో నుంచి, బయటకు లాగి కాపాడాలని, పరమాత్మ మనలోనే ఉండి ప్రతి క్షణం గమనిస్తూ ఎదురు చూస్తున్నారు. పలు జన్మల దుమ్ము నిండిన, పరదా తొలగించి చూడలేకపోతున్నాము. చూస్తే, ఇక పరుగులు మోసాలు ద్రోహాలు, కోపాలు తగవులు ఉండవు.
ఏప్రిల్ నెలలో పదిమంది కి ధన సహాయం చేద్దాం అని, వారి ని గుర్తింపు మంచి లక్షణాలు గురించి లింక్ ఇచ్చాము గతంలో. దయచేసి అటువంటి వారు, మీకు తెలిసి ఉంటే లేదా ప్రయత్నం చేసి సహాయం అందే విధంగా చూడగలరు.
కేవలం హైందవ ధర్మం లోనే యజమాని రాముడు ని, మహిళా శిరోమణి సీతమ్మ తల్లి ని, సేవకుడు హనుమంతుని కూడా దైవాలుగా, సమాన విలువ గౌరవం ఇచ్చి, భక్తితో పూజించే గొప్ప సాంప్రదాయం ఉంది.
* 75 ఏళ్ల అమ్మ తో కలసి, 7 సంవత్సరాలు గా 2014 నుంచి, ప్రతి రోజూ ఉదయం 4.30 నుంచి 5 కి ముందే లేస్తూ, శని వారం ఉదయం దేవాలయం వద్ద జరుగుతున్న, ఈ దైవ నియమ యజ్ఞం లో ఫలితాలు,
భగవంతుడు, దేవాలయానికి రాలేని వృద్ధులు మరియు అరిషడ్ వర్గాలు లో మునిగి తేలుతూ కూడా, వీటిని మనస్ఫూర్తి గా అందుకుని నమస్కారం తో మంత్రం జపించే, గురువు లందరికీ, ఇందులో పుణ్య భాగం ఉంది , తప్పక ఇవ్వాలి.
* మన అందరి బదులు, అమ్మ తో కూడి, మేము శివ శని నెయ్యి దీపాలు పెడతాం, శ్రీరామకోటి రాస్తాం (డిసెంబర్ 9 2020 నాటికి 9 లక్షల 62 వేలు), 9 నవగ్రహ ప్రదక్షిణలు, అలాగే మనం శక్తి మేర 108 ప్రదక్షిణలు తిరుగుతాం, పరగడుపున ఉత్త పాదాలతో, నారాయణ స్మరణతో, కరమాల లెక్క తో, ఖాళీ కడుపు మరియు కరోనా వంటి నియమాలతో, దేవుడి ని వేడుకుంటాం.
* 79 వారాలు కష్ట నియమ దైవ 108 ప్రదక్షిణలు తిరిగినా, 20 ఏళ్ళు పరిమిత సాత్విక ఇంటి శాఖాహారం మరియు నేల చాప నిద్ర అయినా, పొగ మత్తు తాగుడు లాంటి సప్త వ్యసనాలకు దూరంగా ఉన్నా,
7 ఏళ్ల అమ్మ పాద సేవ అయినా, ఏళ్ల నియమ బ్రహ్మ చర్యమైనా, మోహం కు దూరంగా ఉన్నా, ఇతరుల సేవ అయినా కూడా,
మన అప్పటి మరియు ఇప్పటి, మహోన్నత పాపరాశి శిఖర కొన, ఇంచె కొంచెం అయినా తరుగుతుందా, రోజూ చేసే కలపబడే పాపాల పుట్టతో, దేవా?
* 10 th week, SAT 5am to 6 pm దాకా, నీళ్లు, కప్పు పసుపు పాలతో, సూర్య Fasting. ఒక ఆపిల్, అరటి, ఖర్జూరం ఓకే.
ఉదయం కాకర రసం అల్లం వెల్లుల్లి, మిరియాల కషాయం, ఆకలి ఇంకా ఎక్కువ.
కడుపు కాలి, కొవ్వు కరిగి, ఆరోగ్యం పెరగాలి. పేగులు కేకలు పెట్టినా, జీర్ణ వ్యవస్థ కు సెలవు, బుద్ధి కి నెలవు. ఉపవాసం పెద్దల దీవెన.
* ఐశ్వర్యం అధికారం తో సూక్ష్మ కరోనా జీవి రకాలు నే గెలవలేని మనం, జన్మల అనంత పాపరాశి ని, అలాగే నేటి ప్రపంచ భ్రమల మోహంను, మన మనసు నుంచి తొలగించలేము, అంత తేలిక గాదు, జన్మల సాధన లేనిదే మిత్రమా.
* 40 దాటాక బండ బారిన మనసు లేదా వయస్సు ఉడిగిన తర్వాత, వ్యక్తి గత ధ్యానం కు సాధనకు, శక్తి లేని శరీరం మనసు పరిస్థితి ఎటూ సహకరించవు. తప్పులు కూడా ఒప్పులు అనే భ్రమలలో ఉంటాము, ఎవరిని లెక్క చేయక , మన లెక్కలు తరుగుతాయి అని తెలిసీ. కాబట్టి ముందే జాగ్రత్తలు.
* ముందు జాగ్రత్తల మంచి మాటలు వినని వారికి నీతి ని పాటించని వారికి, బుద్ధి చెప్పేది మనసు క్షోభ పెట్టేది పాప ఫలితాలు ఇచ్చేది, ఇంటికి ఒకరు ఉన్న వారి సొంత కలియుగ రాక్షస సంతానమే. అధర్మం గెలిచినా విర్రవీగినా, కలియుగంలో కూడా, పాపానికి ఏనాటికైనా ఫలితాలు తప్పవు. మన చుట్టూ వంద సాక్ష్యం లు ఉన్నాయి, కానీ పట్టించుకోకుండా తప్పులు కొనసాగించి పతనం అవుతాము.
* ఆరోగ్యం, మనశ్శాంతి జాగ్రత్తలు. కర్మలు వదలవు. టీకా తీసుకున్నా కూడా, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
గురువు లైన మీరంతా చల్లగా ఉండాలి, అప్పుడే మేమూ చల్లగా ఉంటాము. జగమంత కుటుంబం మనది , . . .
ముందు అమ్మ నాన్న పాదదాసుడు, తర్వాత నే హరిహర ఆచరణ సేవా దాసుడు, ఈ అజ్ఞాన శ్రీనివాసుడు
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,447; 104 తత్వాలు (Tatvaalu) and views 253,855 Dt : 17-Apr-2021, Upd Dt : 17-Apr-2021, Category : Devotional
Views : 960
( + More Social Media views ), Id : 1107 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
god ,
within ,
us ,
save ,
children ,
world ,
illusion ,
tricks ,
protect ,
pradakshin Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments