Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
మా వడ్డీ బాబాయి వాళ్ళ అమ్మ, అంటే మా చిన్న నాయనమ్మ, చాలా మంచిది. ఇళ్ళు మధ్యలో, నులక మంచం మీద కాలుజాపి కూర్చుని, ఒళ్లో దగ్గర కూర్చో బెట్టుకుని, అమ్మాయి వీడికి పెద్ద గ్లాసు తో పాలు తీసుకురావే, వేడి నీళ్ళు పెట్టు పోసుకుంటాడు, కోడి గుడ్డు అట్టు వెయ్యి, పప్పు నెయ్యి తో తింటాడు, మా బాపనయ్య అంటుంది నవ్వుతూ.
ఇప్పుడు రైలు దిగి పట్టాలు పట్టుకుని వచ్చాడు నా మనవడు, రేపొద్దున వెళతాడు అంట ఉద్యోగం సంపాదన ఆగుతుందని, అని వెటకారం గా పెద్దగా అరుస్తుంది. కానీ చిన్న గొంతు, దూరం వినపడదు. అప్పటికి, వడ్డీ బాబాయి పెళ్ళి కాలేదు.
కనీసం 2 రోజులు లేనిదే వదలదు పంపదు. నాన్న తిడతారేమో అంటే, నేను చెబుతాలే రా అంటుంది. నాన్న కూడా, చిన నానమ్మ మాట వింటారు, పెద్దలు అంటే తలవంచుతారు. పాడి గేదెలు ఉన్నాయి, పాలు పెరుగు, నెయ్యి కి లోటుండదు.
పక్కన అద్దెకు ఉన్న వారితో, మా అక్క మనవడు వీడు. అక్క దగ్గర నుంచి వెనక్కు వెళుతూ, ఇక్కడ కు వచ్చాడు. మాటల పుట్ట, ఏది అడిగినా ఏవో మాయ మాటలు చెప్పి, నన్ను నవ్విస్తాడు. ఎందుకు రాలేదు ఇక్కడికి పోయినసారి రా అంటే, అదీ మీ పిన్ని ఇంటికి పక్కన ఊరు వెళ్ళావు కదా అంటే, ఇంక వినాలి వాడి జవాబు, వాడి మాయ మాటలు చూడు, అని నవ్వుతూ బుగ్గలు లాగి, ముద్దులు పెట్టేది.
నాయనమ్మా, నీ మాటలే వచ్చాయి లే అంటా చిలిపి గా, ఇదిగో చూడమ్మా వాడి మాటలు, ఏదో ఒక జవాబు టక్కున ఉంటుంది, అని నవ్వుతుంది నెత్తిన ఒకటి మొత్తుతుంది. అప్పుడు దగ్గర దగ్గర లో పదేళ్లు పిల్లలం.
నాకు వీడన్నా వీళ్ళ నాన్న అన్నా ఇష్టం, కలసిపోతారు మనతో అంటుంది. పాత రోజులు, పాత ప్రేమలు పిచ్చి వి. అవి తిరిగి రావు. కల్లా కపటం, కనీసం సొంత వారు దగ్గర, వారు ఎరుగరు. ఎక్కడ ఉన్నారో మన అందరి తాతలు నాయనమ్మ లు.
తాత కష్ట జీవి. పొలం మరియు ఇంకో వ్యాపారము పనులు చేస్తూ, ఎండలో చెమటలు కక్కుతూ, సడలి పోయి వస్తారు. నేను పంచ లో పడుకున్న, మంచం మీద కూర్చొని చెయ్యి వేసి, చెమట తుడుచుకుంటూ, చెంబు తో నీళ్ళు గటగట తాగుతూ, ఏరా బాగా చదువు ఫస్ట్ రావాలి, మీ నాయన ఎంత కష్టపడుతున్నాడో చూడు, తాతోళ్ళు బాగున్నారా, రెండు రోజులు ఉండిపో, అని తన పని లో తాను పడతారు. చాలా తక్కువ మాట్లాడతారు.
ఇంక ఆ రోజులు, ప్రేమలు, పాత సినిమాలో మాత్రమే చూసుకోవాలి ఇప్పుడు.
ఇప్పుడు న్యాయం ధర్మం మీరే చెప్పండి, మా నాయనమ్మ అన్నట్లు గా , నేను మాటల పుట్టనా? కాదు కదూ?
ఓరి నాయనో, అప్పుడు మాటల పుట్టేమో గానీ, ఇప్పుడు రాతల బుట్ట కూడా, అని అంటారా? కృష్ణా, పాపం శమించు గాక.
న్యూస్ పేపర్ కట్ట అని కూడా అనొచ్చా? అవ్వ అన్యాయం, అక్రమం, చిన్న పిల్లలను చేసి.
నాకు అయితే నాయనమ్మ చనిపోయినప్పుడు, నాన్న అమ్మా వెళుతున్నా కూడా, నేను కూడా వచ్చాను అనుకుంటున్నా. పిన్ని మద్రాసు నుంచి తెచ్చింది.
నానమ్మ మొఖం నిండా పసుపు పూసి ఉంది. చాలా మంది జనం వచ్చారు, పాత ఇంటి దగ్గర, ఔట్లు అంటే టపాసులు కాల్చారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,425,961; 104 తత్వాలు (Tatvaalu) and views 261,708
Dt : 26-Mar-2020, Upd Dt : 26-Mar-2020, Category : General
Views : 1148
( + More Social Media views ), Id : 446
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
babayi ,
grandma
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments