ఆంధ్రా ఐయేయస్/ కలెక్టర్ అసోసియేషన్, అన్ని జిల్లాల కలెక్టర్ లకు, ఎంపీ/ ఎమ్మెల్యే/ మంత్రులకూ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,263; 104 తత్వాలు (Tatvaalu) and views 225,903.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

*గౌరవ ఆంధ్రా ఐయేయస్/ కలెక్టర్ అసోసియేషన్ మరియు, అన్ని జిల్లాల కలెక్టర్ లకు, ఎంపీ/ ఎమ్మెల్యే/ మంత్రులకూ నమస్కరించి వ్రాయునది,*

Respected Andhra IAS/ Collector Association and all District Collectors, MPs/ MLAs/ Ministers

గత ప్రభుత్వము మిమ్మల్ని నమ్మింది, మీరు చెప్పింది నిజము అనుకున్నది, కానీ అంతా మాయ/ బ్రమ అని, ఎన్నికల తర్వాత 23 సీట్లు వచ్చాక తెలుసుకున్నది. రహస్య సమాచార సేకరణ/ ఇంటలిజెన్స్ అధికారులు ఏమి చేసారో/ చేస్తున్నారో ఆనాడు/ ఈనాడు ఎవరికీ తెలీదు. అధికారులు, నాయకులు అందరూ కలసి గత ప్రభుత్వాన్ని, అవమానముతో సాగనంపారు.

మరి ఇప్పుడు ప్రభుత్వం పరిస్తితి ఏమిటి? ఎంపీ/ ఎమ్మెల్యే/ మంత్రులూ, మీరు ఇప్పుడైనా అధికారులతో మాట్లాడి జగనన్న/ ప్రజల కు న్యాయం చెయ్యండి, అని ప్రజల తరపు ప్రార్ధన. లేదంటే రేపు మనకూ 23/ 70/ 100/ 175? అది మీరు ప్రజలకు పంచబడిన, సోషల్ మీడియా సమాచారం పై, ఆధార పడి ఉంటుంది, నిజముగా అభివ్రుద్ది పనులు జరిగి ఉంటే?

విషయము - మోదీ కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా లో భాగముగా మరియు జగనన్న రాష్ట్ర ప్రభుత్వ పధకాల అమలును నేరుగా తెలిపే విధానములో, సోషల్ మీడియా తో ప్రజలతో మమైకము గురించి, మీరు, ఇందులో వెనుకబడిన మరియు ప్రపంచము తో పాటు ముందుకు అడుగు వెయ్యలేకబోతున్న, మీ తోటి కలెక్టర్లకు/ఐయేయస్ లకు మరియు జాయింట్ కలెక్టర్ల కు మార్గ దర్శకము చేస్తారని, సోషల్ మీడియా వాడే విధానము మరియు సమాచార పౌర సంబంధాల శాఖతో సమన్వయము నేర్పుతారని విన్నపము, ఈ ప్రయత్నము.

భారత ప్రభుత్వము మీ మీద గురుతరమైన బాధ్యతను పెట్టింది. ప్రజలకు, రాష్ట్రానికి, కేంద్రానికి వారధులు మీరు. మీరు సక్రమముగా బాధ్యత గా పని చేస్తే నే, మిగతా అందరూ అధికారులు బాధ్యత గా పని చేస్తారు.

కానీ కొంత మంది జిల్లా కలెక్టర్లు/ఐయేయస్ లు అలా ఉండటము లేదు, రాష్ట్ర ప్రభుత్వ పధకాల అమలును, తమ కార్యక్రమాలను, ప్రజలకు నేరుగా తెలియజేయడము లేదు. జిల్లా ప్రధమ పౌరుడు/ మెజిస్త్రేట్ అలా ఉంటే, వారి దగ్గర పని చేసే 3 జాయింట్ కలెక్టర్ల మరియు జిల్లా శాఖల అధిపతుల పరిస్థితి ఎలావుంటుంది? రేపు వారు ప్రమోట్ అయ్యి కలెక్టర్లు/ రాష్ట్ర అధికారులు గా వస్తే, అదే నిర్లక్ష్యము ప్రదర్శిస్తారు కదా.

మన ఇల్లు/ తరగతి/ వ్యాపారము/ ఉద్యోగము లో, ఎవరన్నా వెనకపడి ఉంటే, మీరు మేము తోటి వారము అని సహాయము చేస్తాము. వారికి మార్గదర్శకము గా ఉండి, మంచి దోవ చూపిస్తాము. అలాగే మీరు మీ తోటి కలెక్టర్లకు, మార్గ దర్శకము చేస్తారని, ఈ ప్రయత్నము.

మన్నించాలి, మేము బదిలీ చేసే నాయకుల మాట వింటాము గానీ, ప్రజల మాట/ విలేఖరుల మాట వినము అంటే, అది ఆత్మ/ దైవ/ సంఘ/ ఉద్యోగ/ తల్లి దండ్రుల ద్రోహం. మీ సంఘము తరపున, వీటి వివరాలు/ రిపోర్టులు, సాక్ష్యం లింక్లు, ప్రకటించగలరా? నేటి ప్రభుత్వాధినేత ఆశలు మీరు సఫలము చేస్తున్నారు అని నిరూపించగలరా?

ఎమ్మెల్యేలు/ ఎంపీలు/ మంత్రులు, మీరు ప్రభుత్వ ప్రతినిధులుగా వీటిని ఎప్పుడైనా అడిగిన పాపాన పోయారా అని ప్రజలు అడిగితే మీ సమాధానం? మీ సోషల్ మీడియాలో, మేము కలెక్టరు శాఖాధిపతులను, పలుమార్లు అడిగాము మా జిల్లా లో, జవాబు లేదు అని, మీ పాత సోషల్ మీడియాలో పోస్ట్ ఉందా? లేకపోతే, ప్రభుత్వం పై విశ్వసనీయత, క్రుతజ్ఞత, నిబద్దత లేని మీకు మరలా టికెట్/ పదవి ఎందుకు? మరలా ఎలా గెలుస్తారు?

1. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, ప్రతి పధకానికి కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ అసలు పధకము పేరు, అలాగే కేంద్ర/ రాష్ట్ర శాతము ప్రకటించారు, సోషల్ మీడియా ప్రచారములో?

2. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, 3 జాయింట్ కలెక్టర్లు, తమ తమ సోషల్ మీడియాను రోజూ సమాచారముతో నింపుతున్నారు. అది నేరు గా తాము కానీ, తమ సిబ్బంది గానీ, సమాచార శాఖ అధికారులు కానీ. వీరికి సోషల్ మీడియా సమాచారము ప్రజలతో రాంకింగ్ తెలియచేస్తూ ఏదైనా, మీ రిపొర్ట్ ఉన్నదా?

3. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, నీతి నిబద్దతతో, జిల్లా అన్ని శాఖల అధికారుల వివరాలు, ఫోన్ నంబర్స్, కలెక్టర్ గారి వెబ్సైట్ లో పొందుపరిచారు. జిల్లా అన్ని శాఖల అధికారులు మారినప్పుడల్లా, వీడ్కోలు చెపుతూ, స్వాగతిస్తూ, తమ సోషల్ మీడియాలో, ప్రజల కోసం, అలాగే ఆ అధికారి కోసం, ప్రకటించారు?

4. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, 2020 లో అనంతపురం కలెక్టర్ గా పని చేసిన శ్రీ గంధం చంద్రుడు గారికి ధీటుగా, అన్ని జిల్లా/ మండల/ నగర కార్పొరేషన్/ పట్టణ మునిసిపాలిటీ/ గ్రామ పంచాయితీ శాఖలతో ప్రభుత్వ పధకాలను, సోషల్ మీడియాలో పెట్టించ గలిగారు? ఎవరు నేటి ఉత్తమ కలెక్టరు?

5. ఎంత మంది ఐయేయస్ లు, తమ నగర కార్పొరేషన్ పరిధి సమాచారాన్ని, వార్డులు/ డివిజన్/ యేరియాలుగా, సోషల్ మీడియాలో రోజూ పెడుతున్నారు?

6. ఎంత మంది ఐయేయస్ లు, తమ రాష్ట్ర శాఖల సమాచారాన్ని, సోషల్ మీడియాలో రోజూ పెడుతున్నారు? తమ నగర/పట్టణ/ గ్రామ అధికారులను అలా చేయమని కోరుతున్నారు? ఎవరు నేటి ఉత్తమ రాష్ట్ర/ జిల్లా శాఖ అధికారి?

7. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, పంచాయితీలలో ఆన్లైన్ పన్ను చెల్లింపు కు అవకాశాలు నేడు లేవు అని, అవి వెంటనే పెట్టమని, సీయెం కు, సంబంధిత శాఖకు తెలియపర్చారు? ఇలా 7 వ సారి కోరుతూ పైకి పంపాము అని, మీ సోషల్ మీడియాలో ఉన్నదా?

8. ఎంత మంది జిల్లా కలెక్టర్లు, మనతో పని చేసే ఎస్పీలు సోషల్ మీడియా వాడుతున్నారు, వారి స్థాయిలో అయినా మనము ఎందుకు లేము అని మెరుగుపరచుకున్నారు?

ఈ విషయమై గతములో, నేరుగా జిల్లా కలెక్టర్లకు ఈమైల్ పంపాము. ఈ లింక్ లో మీరు, 2020 నాటి అన్ని జిల్లాల లింక్ లు చూడ గలరు. Link. జవాబు గాని మార్పు గానీ లేదు. సీయెస్ కు, సీయెం కు పంపాము, చూసారో లేదో తెలీదు.

కానీ మీలో ఎవరో ఒకరు, దీనిని అసోసిఏషన్ లో చర్చకు పెట్టి, వారికి నేర్పుతారని ఆశ. ఇది 2020 మా సర్వే ప్రకారం, మరి మీరు కొత్త 2023 సర్వే పంపగలరా?

* ప్రస్తుతము అంటే 2020 ప్రకారం ఉత్తమ సోషల్ మీడియా కలెక్టరులు - 13 జిల్లాలలో 4 గురు మాత్రమే. వారు క్రిష్ణా, చిత్తూర్, కడప, అనంతపూర్.

* వారిలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారు, అన్ని డిపార్ట్మెంట్ ల తో సోషల్ మీడియా ప్రారంభించారు.

* విశాఖ కలెక్టర్ అప్పుడప్పుడు మాత్రమే సమాచారం పెడుతున్నారు.

* గుంటూర్ వారు, మే 2020 నుంచి ఆపేసారు.

* ఇక 2019 నుంచి ముందుకు కదలని వారు 7 జిల్లాలు (3 సబ్ కలెక్టర్లు) - ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూర్, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్ వారు.

దయచేసి మిగతా 9 జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు ఇచ్చి, వారిని కూడా కేంద్ర మరియు రాష్ట్ర సోషల్ మీడియా సమాచార వ్యవస్థలో, భాగము చేసే ప్రయత్నము చేస్తారని మా ఆశ.

దయ చేసి, ఆ అధికారులకు, కలెక్టర్ల సంఘమునకు దీనిని చూపించి, వారిని సోషల్ మీడియా టెక్నాలజీలో మీ లాగా ముందుకు నడిపించ ప్రార్ధన.

ఈ 7 జిల్లాల వారు, 4 జిల్లాల వారిలా, సోషల్ మీడియాలో దగ్గర అయ్యేది ఎప్పుడు? ఆ 12 జిల్లాల వారు, అనంతపురం డిపార్ట్మెంట్ స్థాయికి వచ్చేది ఎప్పుడు? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కాదా?

ఇప్పుడు 2023 కొత్త సర్వే మీరు చేయించి పంపగలరా? ప్రజలకు/ మంత్రులు/ ఎమ్మెల్యే/ ఎంపీలకు/ మాకు నివేదించ గలరా?

గమనిక : వారు కొత్త లింక్ లు కలిగి ఉన్న యేడల, మాకు పంపగలరు, సరి చేసుకుంటాము. ధన్యవాదములు.

ఆయా జిల్లాల నాయకులు కూడా, ఇప్పుడైనా నిద్ర మత్తు వదిలి కళ్ళు తెరిచి, అధికారులపై మానసిక వికాస మానవత్వ ఒత్తిడి తెచ్చి, ఉద్యోగ భాధ్యతలు గుర్తు చేసి, వారి లో స్రుజనాత్మక మార్పులు తెస్తారని, సోషల్ మీడియా ప్రభుత్వ ప్రచారములో, మోదీ గారికి జగనన్న కు మేలు చేస్తారని ఆశ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,263; 104 తత్వాలు (Tatvaalu) and views 225,903
Dt : 21-Nov-2020, Upd Dt : 27-Aug-2023, Category : Request
Views : 820 ( + More Social Media views ), Id : 789 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , ias , collector , association , collectors , all districts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content