Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఈ సంవత్సరం మొదట లో, గుంటూర్ కు కొత్త కలెక్టర్ వచ్చారు, శ్రీ వివేక్ యాదవ్ ఐయేయస్ గారు. మార్చ్ నుంచి సోషల్ మీడియా ఉత్తేజం తో పరుగులు అందుకుంది. రాజు ని బట్టి రాజ్యం అని అందుకే అంటారు. నాయకుడు గట్టి వారు, యువకుడు ఉత్సాహవంతుడు గా ఉంటే, మిగతా అధికారులు కూడా, ఉత్సాహముగా పని చేస్తారు సహకరిస్తారు.
సోషల్ మీడియా కూడా, వారి ప్రజా పనుల ఫోటోలతో, పరుగులు తీస్తుంది. వారి పనులు, వారి హావభావాలు గమనిస్తే, ఎలా ప్రజలతో కలసిపోయారో, ఇట్లే అర్ధము అవుతుంది ప్రజలకు అలాగే మీడియా వారికి. తమ అధికారులు పని చేస్తున్నారు అన్న సంతోషము పౌరులకు ఉంటుంది. తమ అధికారుల పేర్లు మరియు రూపాలు గుర్తు పెట్టుకుంటారు, గౌరవిస్తారు.
గుంటూర్ మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ మీడియా, ఎప్పుడూ మంచి వివరాలతో ముందు ఉంటుంది, గట్టి బాధ్యత క్రుతజ్ఞతలు గల కమీషనర్ ఉంటే, అలాగే ఉంటుంది కదా. వారి సోషల్ మీడియా చూడండి, మీ జిల్లా కలెక్టర్ అలాగే కార్పొరేషన్ వారిని, ఇలాగే మీ జిల్లా ప్రజలకు సమాచారము ప్రతి రోజూ ఇవ్వమని అడగండి.
Guntur Collector Social Media -
FB,
Twitter
Guntur Municipal Corporation Social Media -
FB,
Twitter
చూడండి తాజా గుంటూర్ వార్తలు, సంతోషముగా గర్వముగా వారు చేస్తున్న పనులు, వారి ప్రజలకు ఎలా వినయముగా తెలియ చేస్తున్నారో, ఉద్యోగ భాద్యతను అలాగే సోషల్ మీడియా విలువను గుర్తించి,
*గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కృష్ణబాబు కాలనీ 77వ వార్డు సచివాలయం, నాయిబ్రాహ్మణ కాలనీ 106 వార్డు సచివాలయం వద్ద కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్.
* కరోనా వైరస్ ముందస్తు నివారణ చర్యలపై జిల్లాలోని సమావేశం నిర్వహించిన సంయుక్త కలెక్టర్ పి. ప్రశాంతి 1. మునిసిపల్ కమీషనర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో 2. సినిమా థియేటర్స్ యజమాన్యాల ప్రతినిధులతో
* గత వారం - గుంటూరు, భారత్‌పేట 140 వ వార్డు సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి దంపతులు.
కొత్త కలెక్టర్ గారు, ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి, మనము ఇతర జిల్లాల సోషల్ మీడియా కన్నా ముందంజలో ఉండాలి.
ఇప్పుడు అనంత జిల్లా వారు ఆధిక్యం లో ఉన్నారు, సోషల్ మీడియాలో. మీ సిబ్బంది, ఇతర ఉత్తమ జిల్లా సోషల్ మీడియాలు చూసి, కొత్త పద్దతులు నేర్చుకోవచ్చు. లింక్ లో చూడ వచ్చు మిగతా జిల్లాల పరిస్థితి.
link.
కొన్ని సూచనలు మార్గాలు, జగనన్న ఆదేశాల మేరకు, ప్రజల హ్రుదయాల కు మరింత చేరువ అవడానికి -
* మిగతా జిల్లాల కలెక్టర్లు ధైర్యముగా గొప్పగా, తమ యొక్క అలాగే, తమ 50 నుంచి 100 జిల్లా అధికారుల పేర్లు ఫోన్ నంబర్లు వెబ్సైట్ లో పెట్టారు. మనము కూడా పెట్ట గలిగితే, బాగుంటుంది.
* మనము వాటితో పాటుగా ప్రతి జిల్లా అధికారి ఫోటో కూడా పెడితే బాగుంటుంది, అందరికీ ఆదర్శము గా. ఎందుకంటే, తమ పన్నులతో జీతాలు తీసుకుని, తమ కోసం కష్టపడే అధికారులను, చూసే హక్కుతో, గుర్తుపట్టి, గౌరవించి గుండెల్లో పెట్టుకునే, అవకాశాన్ని ఇవ్వాలి కదా.
* ప్రతి రోజూ కనీసం ఓ 5 సోషల్ మీడియా పోస్ట్ లు ఉండాలి. ఇన్ని డిపార్ట్మెంట్ లు అధికారులు ఉన్నప్పుడు ఫోటోలకు వీడియోలకు కొదవేమీ ఉండదు, రోజూ పనుల వారీగా.
* ప్రతి డిపార్ట్మెంట్ కూడా, తమ సొంత సోషల్ మీడియా కలిగి ఉండి, రోజుకు కొన్ని పోస్ట్ లు పెట్టాలి. అధికారులు పని చేస్తున్నారు అన్న భావన ప్రజలకు కలగాలి. కరోనా జాగ్రత్తలు సూచనలు వారు పెట్టవచ్చు. రాష్ట్ర వెబ్సైట్ నుంచి కూడా, ఫోటోలు తీసుకోవచ్చు.
* గ్రామ పట్టణ అధికారుల చేత కూడా సోషల్ మీడియా పెట్టించి, ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా అలాగే జగనన్న ఆదర్శ సమాచారం ప్రజలకు అన్న ఆశయాలు ముందుకు తీసుకుని పోవలి అని పలువురూ కోరుతున్నారు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,136; 104 తత్వాలు (Tatvaalu) and views 254,453 Dt : 07-Apr-2021, Upd Dt : 07-Apr-2021, Category : General
Views : 963
( + More Social Media views ), Id : 1079 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
guntur ,
collector ,
vivek yadav ,
social media ,
update ,
tips ,
public ,
love ,
respect Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments