నూతన సంవత్సర శుభాకాంక్షలు - శాంత స్వరూపుడు వినయశీలి విదురుడు ఆదర్శం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1281 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1311 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం, గురువు లందరికీ నమస్కారములు.

శిష్యుల తప్పులు కాచి, వెన్నంటి ఉండి, మంచి మార్గం చూపే, వెన్నలాంటి మనసున్న గురోత్తములకు పాదాభివందనం.

నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆయురారోగ్యాలు తో మిమ్మల్ని మనందరిని, భగవంతుడు చల్లగా చూడాలి.

5 గంటలకే లెగిచి, త్రికరణ శుద్ది తో, తమ తల్లి దండ్రులు పాదాల కు లేదా మనసులో నమస్కారం చేసి, భగవంతుని పూజించిన, నారాయణ స్వరూపులందరికీ, శిరస్సు వంచి కోటి ప్రణామములు.

మంచి మనసు తో మనందరం, మన తర్వాత తరాలకు, ఆదర్శంగా నిలుద్దాం. కర్మ కు ఫలితాలు తప్పవు ఏనాటికైనా ఏ తరానికైనా, మనమెందుకు ఆ పాప చక్రంలో పడాలి, దానికి శిక్ష అనుభవించాలి. గంజి తాగి అయినా, ఉన్నదానితో, మనశ్శాంతి గా బతుకుదాం.

మనం ఉద్యోగం లో, వృత్తి లో, పదవి లో, ఇంట్లో ఉన్నా, మనకు ఆదర్శం, శాంత స్వరూపుడు వినయశీలి విదురుడు.

మోహాంధకారంలో మునిగి ఉన్న, ధర్మం అంటే పడని, కౌరవులు మధ్యలో సలహాదారుని గా ఉంటూ, జీవితం కొనసాగిస్తూ, తనకు వచ్చే అంతంతమాత్రం జీతం మాత్రమే తీసుకుంటూ, పూరిల్లు లేదా చిన్న ఇంట్లో ఉంటూ , కౌరవులు చేస్తున్న ప్రతి తప్పులు రోజూ ఎత్తి చూపిస్తూ, గౌరవం గా చివరి దాకా బ్రతికారు ఉన్న దానితో.

కౌరవులు కూడా ఆయనను వ్యక్తిగా గౌరవించారు, అవమానించలేదు ఆనాడు. కానీ కౌరవులు ఎప్పుడూ, విదురుని మాట వినలేదు, పాటించలేదు.

పొట్ట కూటి కోసం, బతుకు తెరువు కోసం, బంధువులు లైన వారి దగ్గర కొలువు చేయాల్సి వచ్చింది, కాబట్టి ఆయన అక్కడ ఉండటం తప్పు కాదు.

కొన్ని సార్లు కౌరవులు నవ్వారు. కానీ ఆయన మాత్రం తప్పులు ఎత్తి చూపడం మానలేదు, ఎందుకంటే ఆయన వృత్తి అదే కాబట్టి.

కౌరవులు పాటించకపోయినా, పెద్దరికం ను ఉద్యోగం ను వృత్తిని గౌరవించి, అతనిని తీసివేయలేదు, కడుపు మీద కొట్టలేదు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలి.

కౌరవులు పాపంలో వీసమెత్తు కూడా, భాగం కాలేదు విదురునికి. కౌరవులు అందరూ భారత యుద్ధంలో అంతం అయి పోయినారు. విదురుడు ఆయన విదురనీతి, నేటికీ గొప్ప కీర్తి తో వెలుగొందుతున్నది.

నేటి కలియుగంలో, అంత కన్నా ఘోరమైన పాలన జరుగుతుంది, కానీ మనం అందులో భాగం కారాదు. వీలయినంత దూరంగా ఉండి, నడిచే ప్రాపంచిక వ్యామోహ నాటకాన్ని, భగవంతుని పాదాలు ఆచరణ లో పట్టుకుని, గమనిస్తూ ఉండటమే. నిమిత్త మాత్రులం మనం, నడిచేది నడిపించేది ఆ పరమాత్మ నే. మనకెందుకు ఆరాటం పోరాటం పరుగులు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1311 General Articles, 47 Tatvaalu
Dt : 31-Dec-2020, Upd Dt : 31-Dec-2020, Category : General
Views : 319 ( + More Social Media views ), Id : 901 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : happy new year , humble , gentleman , moral , neeti , vidura , kourava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content