హైందవం విదేశీయుల ఆదరణ స్వదేశీయుల అలసత్యం, ఆలయ దాడులు ఆపే బాధ్యత ఎవరిది? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,337; 104 తత్వాలు (Tatvaalu) and views 225,829.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

చూడండి ఆ ఫోటోలో ఏ తల్లి కన్న బిడ్డలో, ఎంత బాగా హైందవ సాంప్రదాయ లక్షణాలతో ముచ్చటగా, ప్రశాంత వదనముతో ఉన్నారో. చూసిన వెంటనే, గౌరవముగా, ఒక కన్న తల్లి లేదా అక్క పాదాలకు, నమస్కారం చేయాలన్న భావన వస్తుంది. నుదుట బొట్టు, విభూతి, ఆఖరికి త్రిశూలం కూడా, ముచ్చటగా జడ వేసిన జుట్టు, ఒంటినిండా కప్పుకున్న దుస్తులు. మన ఇంటి ఆడపడుచులు, మహలక్ష్మి అంశ లా ఉన్నారు.

చదువుకున్న పాశ్చాత్యులను, ఎవరూ మభ్యపెట్టి మతం మార్చలేరు, అక్కడ ప్రభుత్వాలు ఊరుకోరు. మన ఊళ్ళోనే ఇలా సాంప్రదాయంగా ఉండమంటే, తీరిక సమయం లేదు అంటారు. మగవారైనా అంతే సుమా, లింగ బేధమేమీ లేదు. పాశ్చాత్య దేశాలలో అంతా పరుగులే పరుగులు బ్రమలో. కానీ, వారు తీరిక చేసుకుంటున్నారు, మనకు వ్యామోహం లో పడి, క్షణము తీరిక లేదు, సాంప్రదాయాన్ని పాటించడానికి. అందుకే ఎవరు మనశ్శాంతి గా సంతోషముగా లేరు, ఏదో ఒక బాధ చికాకు.

ఇప్పుడు రాష్ట్రములో దేవాలయాల మీద దాడులు వింటున్నాము వరుసగా, అది ఎవరో కావాలని చేస్తున్నారు అని మాత్రం స్పష్టం. ఎందుకంటే, హిందువులు గా ఇప్పుడు అనాసక్తత అలసత్వం నిర్లక్ష్యపు అంచులకు వెళుతున్నాం. ఆకరికి కరోనా వచ్చి నా కూడా, మన పద్దతులు మార్చుకోవడము లేదు, భవిష్యత్ గురించి ఆందోళన పడటము లేదు.

మాకు బాగుంది, బయట ఎవరు ఎలా పోతే ఎమైంది అని ప్రతి వారు. కానీ, చుట్టూ తగలబడుతుంటే, ఆ నిప్పులు మన ఇంటి మీదికి రావా? చుట్టూ అన్ని కాలి, మన ఇల్లు మన కుటుంబం మాత్రం, మిగిలి ఉంటుందా? కరోనా ఒకచోట మొదలు అయ్యి, ప్రపంచమంతా చుట్టలేదా? అందుకే, సమాజ క్షేమం చూడమని, సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. చుట్టూ నీతి గా బాగుంటే, మనము బాగుంటాం. లేకుంటే మనము పతనము అవుతాము, ఎన్ని ఆస్తులున్నా, హోదాలున్నా, అధికారాలు ఉన్నా కూడా.

హైందవ దేవలయాలపై దాడులు - చేతకాని హిందువులు అంటున్న, బ్రహ్మాశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి ఆవేదనతో కూడిన చైతన్య మాటలను లోన వీడియోలో వినండి.

ప్రస్తుతం మన దేశంలోని ఆలయల్లో జరుగుతున్న దాడులు, ఆదాయ దోపిడుల నుండి కాపాడమని, అందరం రుద్రుడిని ప్రార్థిద్దాం అని ఆయన అంటున్నారు.

ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు దీనిని ఆపాలి? అందరు జగన్, పోలీసు, నిఘా వ్యవస్థ ల దే బాధ్యత అని దుమ్మెత్తి పోస్తున్నారు. కొంత వరకు నిజం ఉండవచ్చు, అలసత్వాన్ని వీడాలి. కానీ, అధికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, దీని ఆపడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేయాలి.

అలాగే ప్రతి పక్షాలకు కూడా బాద్యత ఉంది. తెదేపా జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా, జరుగుతున్న సంఘటనలపై ఒక కన్ను వేసి, ఆ దుండగులకు పట్టుకునే ప్రయత్నాలు చేయాలి, ప్రభుత్వానికి సహకరించాలి తెలియచేయాలి.

ఇది సమాజములో బాధ్యత గలిగిన, ప్రతి ఒక్కరి పని. చేతిలో ఫోన్ కెమారాలు, బజారుల్లో సీసీ టీవీలు అన్ని ఉన్నాయి. పాత రోజుల్లో పంట నష్టం కాకుండా, రైతులందరూ కాపలా ఉండేవారు. ఊరిలో దొంగలు పడుతుంటే, జనమే వంతుల వారీగా బాధ్యత గా కాపలా ఉండేవారు. మరి ఇప్పుడు ఆ ఐకమత్యం, సామాజిక బాధ్యత ఏమైంది? అన్ని పార్టీలు సంఘాలు తమ కార్యకర్తలకు సామాజిక బాధ్యత అప్పజెప్పాలి, దోషులను పట్టుకుని చట్టానికి అప్పచెప్పి శిక్ష లు వేయించాలి.

ఈ రోజు ఒకరి మందిరాలకు నష్టం జరిగితే, తర్వాత ఇంకోకరు, దీనిని మనందరమూ కలసికట్టు గా ఆపాలి, ఏ ఒక్కరి బాధ్యతో కాదు, ప్రభుత్వం అంటే మనమే, మనదే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,337; 104 తత్వాలు (Tatvaalu) and views 225,829
Dt : 01-Jan-2021, Upd Dt : 01-Jan-2021, Category : General
Views : 757 ( + More Social Media views ), Id : 903 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hinduism , ap , jagan , bjp , foreigners , following , natives , sluggishness , responsible , stopping , temple , attacks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content