ఖరీదైన దేహ శుద్ధి లేకపోతే, మనకే వాసన, మానసిక శుద్ధి లేకపోతే? వయస్సు శక్తి ఉన్నంత మాత్రమే సాధ్యమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2075 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2110 General Articles and views 1,868,041; 104 తత్వాలు (Tatvaalu) and views 225,120.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కొత్త లేదా పాత కధనము ఎప్పుడూ కూడా, మరలా లింక్ లో చదవండి ఒకటి రెండు రోజుల తర్వాత, ఎందుకంటే, తొందరలో ఆవేశం లో రాసిన తప్పులు సరి చేసి, కొత్త పేరాలు కలిపి ఉండవచ్చు.

కృష్ణార్పణం, మీ వ్యామోహ ఆలోచనలు, అర్ధం కాని ఆచరణలు. నిరంతరం మన మనసు శుద్ది, దేహ శుద్ధి లాగా, చేసుకోవాలి. అందుకే వారము లో కనీసం కొన్ని సార్లు అయినా, మన 2 నిమిషాల సత్సంగం తప్పక ఉండాలి, ఇలాంటి సందేశాల ద్వారా అయినా. అలాగే దానిని ఆచరణలో కూడా చెయాలి.

నాకు ఇదొకటే పని కాదు మిత్రమా, మీరొకరే కాదు కదా - తల్లి సేవ, ఆయుర్వేద ఆరోగ్య సేవ, గురువార సేవ, శని వార సేవ, ఆకాశ మరియు మీలాంటి భూ గురువుల సేవ, పొట్ట సేవ, సంపాదించే మార్గం సేవ, ఇతర జీవుల సేవ, పంచభూతాల సేవ, దేవుని సేవ, ఇంటి సేవ, ఎన్నో నీతి నియమము తప్పని సేవలు బాధ్యతలు, ప్రతి రోజు సంవత్సరాలు క్రమము తప్పకుండా చేయాలి.

ఒక తూలి పడే 76 ఏళ్ళ అమ్మకు బదులు, ఇద్దరు 5 ఏళ్ళ పిల్లలను పెంచవచ్చు తేలికగా, అనుభవములో మీ పిల్లలు నేర్పుతారులే. ఇది ఎత్తి పొడుపు, తక్కువ చేయడం కాదు, రేపు అనుభవము అయ్యేటప్పుడు, ఇంత కన్నా వాస్తవాలు కళ్ళకు కన్నీళ్ళతో కనపడతాయి మిత్రమా, అని ముందు జాగ్రత్తలు చెప్పడం వరకే మన పని. వాస్తవ వాది లోక విరోధి అంది అందుకే.

శివుని చూసిన రావణుడే తప్పు చేసాడు, నేనూ చేయవచ్చు అందుకే గురువులు గా మీరూ ఆపాలి తప్పు జరగకుండానే. ఒక సారి పొరపాటున తప్పు చేసినా, మరలా మరలా చేస్తే, మనిషి కాదు, మ్రుగం.

60 ఏళ్ళు నిత్య పూజలు వ్రతాలు సమారాధనలు సంతర్పణలు చేసినా, రామాయణ భారత భాగవతాలు కంఠస్థం పట్టినా, మంత్రోచ్చరణ స్పష్టముగా ఉన్నా, కాశీ రామేశ్వరం, దేవాలయాలకు యాత్రికులు గా 100 సార్లు పోయినా, కూడా నీతి నియమాలు పాటించలేక పోతున్నారు, ఆచరణ లో ధార్మికులు కాలేక పోతున్నారు, తమ పతనమైన బలహీన ఆలోచనల మనసుతో. మనుషుల ఎదురు నటించవచ్చు, కానీ పంచ భూతాల ముందు, నటన సాగదు. అవి కనికరం చూపవు, తప్పులకు.

తప్పును తప్పు అని చెప్పలేకపోతున్నారు, తప్పు తోనే కలసి, తప్పు లో నే జీవిస్తున్నారు, ప్రాపంచిక మోహముతో. చివరలో ఆ తప్పులోనే కనుమరుగు అవుతున్నారు, కన్నీటి దౌర్భాగ్య దీనావస్థలో.

దేహ శుద్ధి లేకపోతే, మనకు మన కుటుంబం కు మాత్రమే వాసన వస్తుంది, పెద్ద నష్టం లేదు, ఇంట్లో ఉంటాము లేదా పోతాము.

అదే మనసు శుద్ధి లేకపోతే, మన బజారు, మన ఊరు, మన దేశం, మన వంశం, మన భవిష్యత్ తరాలు, అన్ని గబ్బు కొడతాయి, పతనం అవుతాయి. భవిష్యత్తు తరాలకు నష్టం, అన్నం నీరు గాలి కూడా దొరకదు.

పంచభూతాలు గుణ పాఠం చెబుతాయి. మనిషిని మనిషే, సొంత కుటుంబ సభ్యులే రాచి రంపాన పెడతారు. ఇప్పుడే పిల్లలు పేరెంట్స్ వ్యధలు గాధలు ఎన్నో చూస్తున్నాము.

మన కళ్ళెదురుగా కరోనా పరంపర, సునామి, భూకంపాలు, శ్రీ లంక వెనిజులా చైనా ఆకలి అరుపులు, ఉక్రెయిన్ యుద్దం చూస్తున్నాం, అయినా మనకు సిగ్గు ఎగ్గు రాదు, అంత బండబారి పోయాము, ఆ మనకు అలా కాదులే అంటాము, అనుకుంటాము.

ఆనాడు రాముడు, క్రుష్ణుడుకు ఓ 50 శాతం వ్యతిరేకము గా ఉన్నారు, వివిధ ప్రదేశాలలో. ఇప్పుడు, ప్రతి ఇంట్లో ఒక దైవ వ్యతి రేకి ఉన్నారు, తమ బద్దకము తో నీతి నియామలు వదలి డబ్బు పిచ్చి లో, తన పతనాన్ని తాను పెంచుకుంటూ.

కానీ మనం దేహ శుద్ధి కి (అలాగే ఇంటి శుద్ది కి) ఇచ్చిన విలువ (ఖరీదైన బిస్లరి నీళ్ళు, టాప్ వాటర్, సబ్బులు, షాంపూ, సువాసనలు, ఖనిజాలు, ప్రొటీన్లు, మందులు, మాకులు, షోకులు) మానసిక శుద్ధి కి ఇవ్వము.

ఇప్పుడు చూస్తున్నాం కదా, మనలో నీతి నియమాలు విలువలు.

* కేసులు వెన్నుపోటు లు స్టేలు ఉన్నవారు కుటుంబ బానిసత్వం ప్రోత్సాహం చేసే వారు మన ఉత్తమ నాయకులు.

* 3 పంటల మాగాణి ని కాంక్రీట్ చెయ్యడానికి కూడా, మనలో సగం మంది సిద్దమే, భవిష్యత్ తరాల, నోటి కాడ కూడు తీయడానికి. వారికి ఇంకో వైపు కనపడదు అభివ్రుద్ది అనే వ్యామోహములో.

* కొంత మంది అంటారు, మేము అందరితో బాగుంటాము అండి, తల్లి ని చూచే వారితో, తల్లి ని వదిలేసే వారితో. రామునితో, అలాగే రావణుని తో, క్రుష్ణునితో అలాగే ధుర్యోధనుడు తో. అంటే తాము 2 నాల్కల నీతి లేని మనుషులమని అవకాశ అవసర వాదులమని, అతి తెలివితో, తామే ఒప్పుకుంటున్నారు కదూ?

* తల్లిదండ్రులు ను నిర్ధాక్షిణ్యము గా వదిలేసిన వారికి సహాయం చేస్తాం, ఎందుకంటే మన పిల్లలు కూడా మనల్ని వదలాలి అని, ఖచ్చితంగా జరగబోయేది అదే. ఎందుకంటే ఆ పద్ధతి కి అండగా ఒకనాడు నిలిచాం కదా, ఫలితాలు మన దాకా రావాలి కదా, వస్తాయి.

* మన తల్లి దండ్రులు బతికి ఉన్నారా అని కనీసం 3 ఏళ్ళుగా పలకరించని, వారితో షికార్లు తిరుగుతాము, వారి ఇంట భోజనాలు విందులు నిద్ర చేస్తాము. ఎందుకంటే, మనకు లాగే వారికి తల్లి దండ్రుల విలువ తెలీదు, మనకు అవసరము కూడా లేదు.

* తాగుబోతుకు తాగుబోతు, తిరుగుబోతుకు తిరుగుబోతు, వెన్నుపోటుకు వెన్నుపోటు, క్రుతఘ్నుడి కి క్రుతఘ్నుడే, విలువ లేని వారికి మాట మీద నిలబడని వారికి వారే మంచి ప్రాణ మిత్రులు, వారే తమ మంచి కోరే వారు తమను పతనం చేసే వారు.

* ఊళ్ళోళ్ళ సొమ్ము అప్పు తాకట్టు తో లేదా మోసం తో, సొంత పేర్లు పెట్టుకునే పంచే వారికి, మనం అనుచరులం స్నేహితులం బంధువులం. ఎందుకంటే మనం వచ్చింది కూడా, అదే ఉత్తమ దోవలో లేదా మనం పెద్దలు పెంపకం నేర్పిన విలువలు అవే.

* మనం ఇంట్లో వాళ్ళ సౌభాగ్యం కోసం, తాళిబొట్టు ఉంచం, కుంకుమ సింధూరం పెట్టం, నూనె జుట్టు ముడి పెట్టం, నిండు చీర కట్టం, ఉదయం 5 కి లెగిచి ముగ్గు కళ్ళాపి స్నానం ఉండదు. పిల్లల కు రామాయణం, భారతం, భాగవతం, సంస్కారం చెప్పము. ఇంట్లో అంట్లు తోమం, గుడ్డలు ఉతకం, వంట లేదు, ఇంటి భోజనం ఉండదు. తెలుగు రాయం నేర్పం. సజీవ గురువుల పెద్దల సేవ ఉండదు. సంపాదన బండలే మన భవిష్యత్తు, మనఃపీడ అకాల మరణం కరోనా కరువు కాటకాలే మన ఉత్తమ భవిష్యత్తు. పైన వన్ని నీతి నియమముగా చేస్తున్న వారు, ధనం లేకపోయినా మనశ్శాంతి తో ఉన్నారు.

* ఆఖరికి తల్లి దండ్రులు కూడా, తమ భవిష్యత్ లో పిల్లలు ఏమి చేస్తారో చెప్పలేని దౌర్భాగ్య స్థితి లో ఉన్నారు. మా బిడ్డలు మమ్మల్ని చూస్తారు అని చెప్పే ధైర్యం నమ్మకం, తమ సంస్కారం లేని పెంపకం పై లేదు. ఏమండీ నేనే, కాషాయం/స్టే ల/కేసుల పార్టీలో ఉన్నాను, మా పిల్లలు స్టే ల పార్టీ లో లేదా కేసుల పార్టీ లో ఉండవచ్చు ముందు, తర్వాత అటు మారవచ్చు, నేను మా ఇంట్లో వారూ అంతే, నిలకడ ఉండదు. మా పిల్లలు మా ఎదురుగా, మందు సిగరెట్ తాగుతున్నా కూడా, మేము ఏమీ అనము, వారికే స్వేచ్చ ఇచ్చాము ఆస్తి ఇచ్చాము, వారి ఉన్నతం వారి పతనం వారిష్టం, మేము ఆపము, అని నిస్సిగ్గు గా చెపుతున్నారు.

* అమెరికా లో గొప్ప టెస్లా కంపెనీ యజమాని మస్క్ చెప్పారు, నాకు సొంత ఇల్లు లేదు, స్నేహితుల ఇంట్లో ఉన్నాను అని. మరి మనకు, అప్పులు చేసైనా, 4 ఇళ్ళు ఉండాలి, ఇతరులకు దొరకకూడదు సుమా, ఆఖరికి మన పిల్లలకు కూడా రేపు దొరకదు అంతే.

మనసు శుద్ధి అనేది, మనకు వయస్సు శక్తి ఉన్నంత వరకు మాత్రమే, ఇది సాధ్యం. అదీ చిన్నప్పుడు నుంచి అలవాటు కావాలి.

లేదంటే కోట్లు ఇచ్చిన లేదా పింఛన్లు ఇస్తున్న తల్లిదండ్రులు ను , ఇంటి వెనుక షెడ్ లో వేసి, ముద్ద విదిలించి, ఈ మాత్రం దయతో గౌరవం తో మేము కనీసం ముష్టి వేస్తున్నాం, ఇది కూడా చేయని వారు లక్షలమంది ఉన్నారు అని, మనం నేర్పిన తప్పుడు విలువలే విశ్వసనీయత లే, మనకు మన పిల్లలు ఇంకా వివరంగా నేర్పుతారు, నేర్పుతున్నారు.

శక్తి సన్నగిల్లిన తర్వాత, రోగాలు మరియు పిల్లల వేధింపులు తప్ప, ధ్యానం కు సమయం లేదు. మనసు వినదు.

ఊరకే ఇంట్లో ఉన్న సమస్యలు మనుషులను ఆలోచన లు తప్పించుకోవడానికి, గుడి కి యాత్రలు కు వెళితే ఫలితాలు శూన్యం. నిన్న కాశీ తిరుపతి వెళ్ళి వచ్చిన వారు, ఈ రోజు అబద్దాలు 100 చెపుతున్నారు, ప్రయోజనం ఏముంది? వారు అవమానిస్తుంది, దేవుని అని వారికే తెలీదు. ఎందుకంటే, పెద్దలు అన్నా దేవుడు అన్నా వారికి భయం భక్తి లేదు.

ఇల్లే దేవాలయం, అలాగే మనసే దేవాలయం కావాలి నిజమైన సాధకునికి, దైవ అనుగ్రహం కోసం, రూపాయి ఖర్చు వద్దు సుమా. ఉచితం గా మన మనసు మాత్రమే అర్పించాలి.

ఏ సాత్వికత గల వ్యక్తి కూడా, మన నడత ఆలోచన ఆచరణలో ఒక్క చిన్న తప్పు కూడా పట్టుకోకూడదు, వారికి ఎప్పుడూ మన దగ్గర కోపము రాని వినమ్రత జవాబు ఉండాలి. ఎందుకంటే ఆ చిన్న తప్పు కూడా దైవ ద్రోహమే.

ఎందుకంటే ఆ చిన్న తప్పు కు కూడా, భయంకరమైన శిక్ష ఉంటుంది. అది భవిష్యత్తు లో భరించలేము, ఈనాడు మనకు లెక్క లేకపోవచ్చు. అప్పుడు ఎవరూ మంచి వారు అండరారు.

కాబట్టి మానసిక శుద్ధి మొదలు పెట్టు, ఇప్పుడే ఇంట్లో నే, మన మనసు లోనే, రేపు మనది కాదు.

If body is not purified, smell only for us. if we do not purify mind? possible only if we have age and energy?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2110 General Articles and views 1,868,041; 104 తత్వాలు (Tatvaalu) and views 225,120
Dt : 19-Apr-2022, Upd Dt : 19-Apr-2022, Category : General
Views : 817 ( + More Social Media views ), Id : 1356 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : body , purified , smell , purify , mind , age , energy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content