దేవుని బిడ్డలము అయితే, పంచభూతాల ప్రక్రుతి భీభత్సవాలు ఏమిటి? తండ్రి/ తల్లి, తన బిడ్డల చెడు కోరతారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1487 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

If we are all children of God, then what/ why are the horrors of these five elements/ panchabhuta? Does a dad/mom wish evil on their children?

మనందరమూ దేవుని బిడ్డలము అయితే, మరి ఈ పంచభూతాల ప్రక్రుతి భీభత్సవాలు ఏమిటి? తండ్రి/ తల్లి, తన బిడ్డల చెడు కోరతారా?

జవాబు - బంధము గొప్పదా, ధర్మము/ సత్యము గొప్పదా అంటే, చాలా మందికి జవాబు తెలీదు. 80 శాతం అరిషడ్వర్గాల బానిసలు, నోటి మాటే కదా అని బంధము అంటారు, కానీ దానికీ కట్టుబడరు.

ప్రాణాపాయస్తితి వస్తే, ఒక్క తల్లి (అదీ కొంతమందే సుమా, ఎందుకంటే పాలు ఇవ్వడం, దైవ గుణాల ఆచరణలో పెంచడం, సంస్కారం నేర్పడం, తెలియని తల్లులు ఈ లెక్కలో రారు) తన పసి పిల్లలను తప్ప, ఇతరులు ఎవరూ ఎవరికోసము, తమ ప్రాణాలు అర్పించరు.

మొన్న కరోనాకు చూసాము బంధాల విలువ, మున్సిపాలిటీ వారు, ఇన్నాళ్ళు మనతో ఉన్న, మన ఇంటి దేహాన్ని, అనాధ శవముగా దహన సంస్కారాలు నిర్వహించారు.

మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః| అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||

తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము అని నిన్న రుణానుబంధం జాగ్రత జాగ్రత కధనములో చదివాము.

పుట్టెటప్పుడూ, పోయేటప్పుడూ ఎవరు మనతో రారు. కాబట్టి బంధాలు అశాశ్వతము. సత్యము ఒక్కటే శాశ్వతము.

మరి ఈ ఊడిపోయే బంధాల కోసం, అరిషడ్వర్గాలకు బానిసలమై, ఎంతో మందిని నాశనం చేసి, ఎన్నో జీవులను చంపుతూ, తింటూ, ప్రక్రుతిని చిన్నాభిన్నం చేసి, భూమాత గుండెల్లో గునపాలు గుచ్చుతూ లేదా మనల్ని మనం నాశనం చేసుకుని, కోట్లు సంపాదించి, పొందే ఆనందము ఉందా?

నిద్రపోయేటప్పుడు లేదా మేల్కొన్నప్పుడు, ఓ చీమ కుడితేనే, అబ్బా అంటూ వెంటనే నిర్దయగా చంపమా? ప్రక్రుతిలో ఇతర జీవులను, పాము కప్ప దోమ ఈగ చీమ వంటి వాటిని చంపమా? వాటికి బతికే హక్కు లేదా? ఆఖరికి నోటి రుచికి బానిసలమై, మేక పంది కోడి పొట్టేలు ఆవు ని చంపడం లేదా? ఫిజ్ లో పెట్టుకుని, నెలలు మేయడం లేదా?

అడవులు కొట్టేయలేదా? అపార్ట్మెంట్లు, ఇళ్ళ కోసం ఎంత లోతు పునాదులు, భూమాత గుండెల్లో గునపాలు గుచ్చి, తీస్తున్నాము? గనులు కోసం బాంబులు పెట్టి పేలుస్తున్నాము?

స్వేచ్చగా పారే నదులను అడ్డం కొట్టి ఆపడం లేదా, దోవ మరలించడం లేదా? చెరువులు ఆక్రమించడం లేదా?

ప్రశాంతముగా ఉండే ఆకాశములో, సాటిలైట్లు అంటూ చెత్త పేర్చుతూ, ఎప్పుడు వచ్చి మన నెత్తిన పడతాయో అని మూలగడం లేదా? గ్రహ యుద్దాలు, ఆకాశ యుద్దాలు, స్పేస్ స్టేషన్లు అంటూ ఆకాశం లోకి చొచ్చుకుని పోవడం లేదా?

తోటి మనుషులను కూడా, హీనము గా చూస్తూ, వారిని దోచుకుంటూ, మన ఆస్తులు పొట్టలు అధికారం పెంచుకోవడం లేదా? స్వార్ధం ఎన్ని రకాలుగా విచ్చలవిడిగా పెంచాలో, అంత దూరం వెళ్ళిపోయాము. మనము బతకడానికి, ఎంత మందిని పొట్టన బెట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

అసలు ప్రక్రుతితో పంచభూతాలతో, మనము ఎంత భీకరముగా, దానిని వాటిని గిల్లి గిచ్చి, ఏమి చేస్తావు మమ్మల్ని చూద్దాము అని, మరీ దానిని యుద్దానికి పిలవడం లేదా, కవ్వించడం లేదా?

5 ఏళ్ళ పసివాళ్ళు, తెలీక, తన తల్లి తండ్రి గుండెలమీద కాలుతో తంతే, ఆనందపడతారు. కానీ మదమెక్కి అరిషడ్వర్గాలకు బానిస అయ్యి స్వార్ధముతో, 20 ఏళ్ళ తర్వాత కూడా వారు, పెద్దల గుండెల మీద కాలితో తంతే ఏమి చెయ్యాలి? ముందు మాటలతో మంచి గా చెపుతారు, పద్దతి మార్చుకోమని. తర్వాత మా లాంటి వారు, నీతులు చెపుతారు.

తర్వాత, భూకంపాలు, త్సునామీలు, వరదలు, గాలివానలు, ఇళ్ళు ఊళ్ళు అడవులు కాలిపోవడం, ఆకాశం నుంచి పిడుగులు రాళ్ళు పడటం, వాయు భీభత్సవాలు రావడం, ఎంతో మందిని ఒకేసారి తీసుకుని వెళ్ళడం, అకాల మరణాలు, కరోనా వటి ఉత్పాతాలు ఎన్నో.

ఎందుకంటే, మనం మాటలతో మంచి వినే స్థాయి దాటిపోయాము. ఏదైనా కర్మానుసారమే. ఓ చిన్న బిడ్డ ఇందులో చిక్కుకున్నా, తన పూర్వ పుణ్యఫలమే అతనిని కాపాడుతుంది, లేదా తనలో కలిపేసుకుంటుంది. ఎందుకంటే, గతము లో తాను, ఆ కనికరం తన పెద్దలపై చూపలేదేమో.

మనము తప్పులు ఎంత లెక్కగా చేస్తూ నటిస్తున్నామో, ప్రక్రుతి కూడా అంతే లెక్క గా అన్నిటికీ బదులిస్తుంది. దోషులమైన మనము ప్రక్ర్తుని తప్పు పట్ట లేము, ఆ హక్కు మనము కోల్పొయాము. కలియుగం లో 80 శాతం అధర్మమే.

కాబట్టి దేవుడు, మనకు చెడు చేయడం లేదు. మనమే దేవుడికి, తల్లి దండ్రులకు, ఇతరులకు, పక్షులు జంతువులకు, ప్రక్రుతికి, పంచభూతాలకు, ప్రతి క్షణం ప్రతి రోజూ ప్రతి పనిలో, చెడు చేస్తున్నాము. క్రుతగ్నతలు చూపిస్తున్నాము, మన పతనము మనమే కోరుకుంటున్నాము, మన గొయ్యి మనమే తీసుకుంటూ సుమా.

దేవుడు నిర్లిప్తముగా చూస్తున్నారు, మన కోరిక కాదనలేక. తప్పు మనదే కదా? దేవుడు కరుణామూర్తి, బతకడానికి అన్ని ఇచ్చి, విచక్షణా జ్ఞానం, వేదాలు ఉపనిషత్లు పురాణాలు, కూడా ఇచ్చారు. మన వేలుతో మనమే పొడుచుకుంటున్నాము. మరి ప్రక్రుతిని, సూదులతో రోజు మనము గుచ్చుతూ ఉంటే, అది మాత్రం ఒళ్ళు విదిలించుకోదా?

అందుకే జీవితము క్షణభంగురము, ఇప్పుడే అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నం చెయ్యి, సజీవ గురువు సేవ చెయ్యి, సౌకర్యాలను మోహమును త్యజించు, మాయకు బయటకు రా, నీతి నియమాలు పాటించు, దేవునికి దగ్గర గా ఉండు, రేపు మనది కాదు, పంచభూతాలు కనికరం చూపించవు దోషులకు. రామన్న, రాజన్న లాంటి ఎన్నో జీవితాలను మన ఇళ్ళ చుట్టూ చూస్తున్నాము, జాగ్రత్తలు సుమీ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 27-Jul-2022, Upd Dt : 27-Jul-2022, Category : General
Views : 101 ( + More Social Media views ), Id : 1477 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : children , god , horrors , five , elements , panchabhuta , dad , mom , wish , evil
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content