బాధ్యత పౌరులు, పిల్లల భవిష్యత్ కోరితే, వీటికి సంస్కారం తో సమాధానాలు? పల్లెలలో నలుగురికి నిజాలు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1492 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1527 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మీరు బాధ్యత గల పౌరులు అయితే, మీ పిల్లల ఉత్తమ భవిష్యత్ మీరు కోరితే, కనీసం పుట్టిన నేల పై గౌరవం ఉంటే, వీటికి మనసుతో సంస్కారం నీతి మర్యాదతో సమాధానాలు చెప్ప గలరు, పల్లెలలో నలుగురికి పంచుతూ నిజాలు తెలియ చేయగలరు, మీకు మంచి పుణ్యం రావాలి అంటే.*

ఈ ప్రశ్నలకు జవాబులు వీటిలోనే - వైకాపా (జగనన్న), జనసేన (పవనన్న), తెదేపా (చంద్రన్న), ఓటర్లు

1. ఆంధ్రాలో ఎవరి నుంచి వెన్నుపోటుతో శాపనార్ధాలు తో లాక్కోకుండా, సొంత ఇమేజ్ తో, కష్టపడి తిరిగి సొంత గా పెట్టిన స్థానిక పార్టీలు 2 మాత్రమే ఉన్నాయి, ఏమిటి అవి?

2. a. ప్రజల పన్నులతో, ప్రభుత్వ భూముల తాకట్టు అమ్మకాలు లీజు, అందిన కాడికి అప్పులతో, తమకు కావల్సినంత దోచుకుంటూ, మిగతా వాటితో నడిపించే పంచుడు పధకాలకు, అప్పనముగా సొంత కుటుంబ పేర్లు పెట్టుకునే నీచ కుసంస్కారం ఎవరికి ఉంది?

b. పధకాలకు సొంత కుటుంబ పేర్లు ను బానిసత్వం తో అంగీకరించి, సమర్ధన చేసే వంశ కుసంస్కారం ఎవరికి ఉంది? పార్టీలు నాయకులు ఓటర్లు

3. అమరావతి లో మూడు పంటల మాగాణి భూముల ని కాంక్రీట్ చేసి, భవిష్యత్ తరాలకు, తిండి లేకుండా చేస్తున్న, ఉత్తమ నాయకుడు ఎవరు? ఏ పార్టీ? తిండి పోయినా అభివ్రుద్ది అక్కడనే కావాలా? వారిని సమర్ధించే వారిని ఏమనాలి? వారికి భవిష్యత్ లో కూడు దొరుకుతుందా?

4. ఎక్కువ కేసులు, అపరిమిత స్టేలు లేని, క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవరు? అలాంటి కేసులు స్టేలు ఉండే వారిని ఎన్నుకునే ఓటర్లను ఏమనాలి, వారి మనస్తత్వాలు ఎలాంటివి?

5. కేంద్ర ప్రభుత్వ పధకాల పేర్లను మరియు వారి శాత భాగాన్ని దాచి, తమ సొంత జేబులో పధకాలు గా, తమ కుటుంబ పేర్లతో ప్రచారం చేసుకునే, మానసిక బలహీన ప్రచార పిచ్చి ఉన్న ఉత్తమ నాయకులు ఎవరు?

6. a. పదవులు ఇచ్చి, ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతో, బహిరంగము గా కాళ్ళకు దండం పెట్టించుకున్న, అలాంటి నీచపు పనులు వద్దు అని ఆపలేని అసమర్ధ, అహంకారులు ఎవరు?

b. అలాగ బహిరంగము గా వయస్సు కూడా మరచి కాళ్ళకు దండం పెట్టిన, సిగ్గు వంశ ప్రతిష్ట ఆత్మాభిమానం లేని వారిని ఏమనాలి? వారు ప్రజలకు మంచి చేస్తారా, చేయగలరా? అలాంటి వారిని ఎన్నుకున్న ఓటర్లను ఏమనాలి?

7. ఇన్నేళ్ళ పాలనతో, కనీసం ఒక గొప్ప కరోన ఆసుపత్రి కూడా లేకుండా చేసిన పాపం ఎవరిది? ఈనాటికీ, ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాబాద్ పరుగులు తీసేంత అభివ్రుద్దిని సాధించినదెవరు?

8. కరోనా ఆపద సమయములో, ప్రజలతో లేకుండా ఉన్న పార్టీ నాయకులు ఎవరు?

9. అధికారం లో ఉంటే ఆంధ్రాలో, ప్రతిపక్షములో ఉంటే హైదరాబాద్ లో ఉండే, నాయకులు ఎవరు? అలాంటి వారిపై ఆధార పడే ఓటర్లను ఏమనాలి?

10. రాష్ట్ర అభివ్రుద్ది కన్నా, పుత్రుడి అభివ్రుద్ది ముఖ్యం, అనుకునే ఉత్తమ నేత ఎవరు?

11. బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడి కి సీయెం కి, ఎన్నికోట్ల ఆస్తి ఉండాలి? 100 కోట్లు పైననా లేక కిందనా? 100 కోట్ల పైన ఉన్న నాయకుడికి, ప్రజల కష్టాలు కన్నీళ్ళు విలువ తెలుసునా? అప్పుడు నాయకులది తప్పా లేదా ఓటర్లది తప్పా?

12. సీయెం లు, తమ మంత్రులను మార్చిన విధముగా, ఓటర్లు తమ సీయెం లను 5 ఏళ్ళకు ఎందుకు మార్చకూడదు? అప్పులతో భూముల అమ్మకాలు తాకట్టులతో పంచడానికి, వంశ బానిసత్వం అనుభవం ఎందుకు?

13. రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతూ పతనం చేస్తూ, తమ సొంత కంపెనీలు హెరిటేజ్, సాక్షి లాంటి వాటిని, ఉత్తమ లాభాలతో నడిపే ఉత్తమ సీయెం లు ఎవరు?

14. మోదీ గో బాక్ అంటూ, సీబీఐ ని ఆంధ్రా లో నిషేదించిన, ఉత్తమ విలువల సీయెం ఎవరు?

15. తెదేపాను స్థాపించడమే, కాంగ్రెస్స్ కి వ్యతిరేకముగా, కానీ మరలా కాంగ్రెస్స్ తో కలిసి పోటీ చేసిన ఉత్తమ విలువల సీయెం ఎవరు?

మీరేమి అంటారు? మీ అభిప్రాయం, కన్నతల్లి భాష తెలుగు లో, మంచి మర్యాదతో మాత్రమే. తెలుగు రాయడం రాకపోతే, ఇంక మంచి మనసు, మంచి ఆలోచన రాదు కదా.

If responsible citizens, look future of kids, good answers to these share truths to village folks  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1527 General Articles, 51 Tatvaalu
Dt : 13-Apr-2022, Upd Dt : 13-Apr-2022, Category : Politics
Views : 143 ( + More Social Media views ), Id : 1342 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : responsible , citizens , kids , answers , truths , village , folks , bjp , janasena , tdp , pawan , chandranna , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content