Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ప్రతి చోట, మంచి అధికారులు మరియు నాయకులు, ఎందరో ఉన్నారు. వారి గురించి కూడా, ఏదో ఒక రోజు, మంచి గా ఆర్టికల్ రాయాలి అని ఉంటుంది.
కానీ సాక్ష్యం గా ఫోటో లేదా వీడియో లు, వరుస గా రోజూ వారి ఫేస్బుక్ లో ఉంటేనే, మనకు వాటిని బట్టి ఏమి రాయాలో, స్ఫురణకు వస్తుంది, చిన్నగా నెల తర్వాత అయినా కూడా. ఈ రోజుల లో, చెప్పనిదే బయటకు ఏమీ తెలీదు, ఎంత మంచి వారమైనా. మంచి పని దగ్గర, సిగ్గు పడకూడదు. గొప్పలు అనుకుంటారు ఏమో అని అనుకోకూడదు. ప్రజలు మనలను, పని చేయని లేదా మనసు లేని వారిగా భావించకూడదు.
కధ అయితే ఏదో ఒకటి ఊహించి రాయవచ్చు, సాక్ష్యం ఎవరూ అడగరు. కానీ వాస్తవం కు, మంచి పనికి, సాక్ష్యం ఉండాలి, అలాగే పబ్లిసిటీ కూడా ఉండాలి. మంచి విలేఖరి దగ్గర, పదేళ్ల క్రితం ఫోటోలు, వీడియో లు, కధనాలు కొంత వరకైనా భద్రంగా ఉంటాయి. అది కూడా మనకు మంచిదే, మన దగ్గర ఫోటోలు పోయినా కూడా, వారిని అడగవచ్చు, గత జ్ఞాపకాలను చూసుకోవచ్చు.
ఈరోజు సినీ హీరో చిరంజీవి గారు, ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసారు. ఎటూ అన్ని పేపర్లు రాస్తాయి అని, వారు గమ్ముగా ఉండ కూడదు. తమ అనుభవం ను లేదా సంఘటనను, వారి వారి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ట్విట్టర్ లో రాస్తారు, ఈ రోజుల్లో రాయాలి కూడా. అది ధర్మ సమ్మతమే.
ఎందుకంటే బయట వారి పొగడ్తలు వారికి అవసరం లేదు. కానీ, ఓ సంవత్సరం తర్వాత వెనక్కి చూసుకుంటే, వారి మంచి పనులు చూసి వారికే సంతోషం, సంతృప్తి కలుగుతుంది. అభిమానులు కు కూడా తమ సొంత నాయకుని మాట, హీరో మాట వినాలనీ ఆత్రముగా ఉంటారు.
ప్రకాశం మరియు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గార్లు ను చూడండి, ప్రభుత్వం తరపున ఒక ఫేస్బుక్ పేజీ, అలాగే తమ వ్యక్తి గతం గా, ఇంకో ఫేస్బుక్ పేజీ ఉంటుంది. ఇక్కడ అక్కడ, రెండు వైపులా రోజూ అప్డేట్ చేస్తున్నారు ప్రజల కోసం, తమను అభిమానించే వారి కోసం.
ఎందుకంటే, తమ మీద తమకు నమ్మకం ఉంది, తాము నిజాయితీగా పనిచేస్తాము రోజూ, మా పనులు పదిమంది కీ చేరాలని తపన ఉంటుంది. ఇప్పుడు, అదే కావాలి, సంస్కరణల కు మంచి పనులు కు. మేమూ, వారి మంచి ని పొగిడాము, ఫోటో సాక్ష్యం తో.
అలాగే మన జిల్లా, పట్టణ, గ్రామీణ, రెవెన్యూ, పంచాయతీ, ఆరోగ్య, విద్యా, మున్సిపల్, పోలీసు అధికారులు కూడా, ప్రభుత్వ పరంగా మరియు సొంతంగా, సోషల్ మీడియా లో తమ మంచి పనులు వివరిస్తూ ఉంటే, వారి మంచితనం కు ఎక్కువ గుర్తింపు వస్తుంది.
మన ఎమ్మార్వో గారు, పంచాయతీ సెక్రటరీ, సీఐ, కమీషనర్, హెల్త్ ఆఫీసర్, ఆర్డీవో, జిల్లా అధికారులు, అందరి మంచి తనం ను, మంచి మాటలలో, ప్రజలకు చేర్చడమే మంచి విలేఖరి పని.
గెలిచినా లేదా ఓడిన, రాజకీయ నాయకులు ఎటూ అప్డేట్ చేస్తున్నారు. అది వారికి తప్పనిసరి, లేకపోతే మనుగడ ఉండదు, ఆ తర్వాత. ప్రతి రోజూ ఫేస్బుక్ లేదా వాట్సాప్ లో మెసేజ్ లేకపోతే, వీరు ఇంకా ఊళ్ళో నే ఉన్నారా లేదా అసలు పని చేస్తున్నారా అని జనము అనుకునే పరిస్థితి కి వచ్చాము. కరోనా తో, భయం అనుమానం, ఇంకా ఎక్కువ అయింది.
అందుకే కొంత మంది, మంచి అధికారులు కు నాయకులు కు, మేము ఈ మెసేజ్ లు పంపుతున్నాము. వారిని ఉత్సాహ పరచి, వారి మంచిని వెలుగులో కి తేవడమే, మా మంచి ఉద్దేశ్యం. తప్పుగా భావించవద్దు, అపార్ధము చేసుకుంటే మన్నించాలి అని మనవి. మీ మిత్రులు మే మేము. మంచి ని ప్రోత్సాహం చెయ్యాలి అంతే. ధన్యవాదాలు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,608,463; 104 తత్వాలు (Tatvaalu) and views 407,286
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments