Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. వందమంది కొంపలు కూల్చి, కన్నీళ్లు కార్పించి, వారి డబ్బులు తో మనం వ్యాపారం చేస్తూ, దానాలు ధర్మం యాగాలు చేస్తూ, సంఘం లో పెద్ద మనిషి లా నటిస్తే, సొంత ఆస్తులు పెంచుకొని, దేవుడు ఏనాటికీ మెచ్చరు.
పాపాల లెక్క లక్షలు ఉంటే, పుణ్యం లెక్క లక్షలు ఉన్నా, వేటి లెక్కలు అవే. లక్షలు కొట్టేసిన దొంగ, సాధారణంగా వందలు మాత్రమే, దాన ధర్మం ల చూపాలని నటిస్తారు.
అల్ప జీవులం మనకే అంత నటనా చాతుర్యం ఉంటే, ఆ విషయంలో దేవుడు మన కన్నా పెద్ద నటనా చక్రవర్తి, అంతకు రెట్టింపు ఫలితం మానసిక క్షోభ నష్ట ఫలితము కలిగిస్తారు.
అందుకే పశ్చాత్తాప పడి, మన తప్పు తో బాధ పడిన వారిని తొందరగా వేడుకుని, వారివి వారికిచ్చి క్షమించమని అడగాలి. అప్పుడు కొంత ఉపశమనం, కానీ పూర్తిగా చేసిన పాపం పోదు.
ధుర్యోధనుడు, రావణుడు ఎన్నో దాన ధర్మం లు చేశారు, కానీ పాపం వదలలేదు. మొన్న కూడా ఒకాయన తిరపతి వెంకన్న కు, వజ్ర కిరీటం ఇచ్చిన తర్వాత, సంవత్సరం పైగా జైలు లో ఉన్నారు.
తొందరగా పశ్చాత్తాపం పడి, పాప చక్ర వడ్డీ నుంచి, తప్పుకోవడం మంచిది. 100 కి 80 మంది అలాగే మోసం చేస్తున్నారు అని మనం నవ్వు కోవచ్చు, కానీ ఆ 80 మంది కి కూడా చివరలో లేదా మరుజన్మ లో కష్టాలు నష్టాలు తప్పవు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,444; 104 తత్వాలు (Tatvaalu) and views 258,585 Dt : 02-Feb-2020, Upd Dt : 02-Feb-2020, Category : General
Views : 928
( + More Social Media views ), Id : 298 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
sin ,
god ,
cheating people Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments