ప్రభుత్వ స్కూలు, రవాణా, ఆసుపత్రికి గనుక, మనం ప్రవేటు వారికి ఇచ్చిన అంత ధనం ఇస్తే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,684; 104 తత్వాలు (Tatvaalu) and views 225,614.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ధనం లేదా సౌకర్యాలు ఉందని, ఇన్నాళ్లు ప్రవేటు స్కూలుకు పోయాం, ప్రవేటు వైద్యం కు పోయాం, ప్రవేటు బస్సులు ఎక్కాము. వాటన్నింటినీ, జీడిపప్పు బాదం పప్పు పెట్టి, పోషించి పెద్దగా చేశాము. వాళ్ళందరూ కోట్లు సంపాదించారు. మనము ఎన్నో పోగొట్టుకున్నాము.

మరి కరోనా సమయంలో, అన్నీ మూతబడ్డాయి. మావి కూడా ప్రాణాలు కాదా, మీ ప్రాణాలు దేవుని బాధ్యత అన్నాయి, అన్ని ప్రవేటు సంస్థలు. అవన్నీ మనకు అండగా వచ్చాయా? మన కోసం నిల బడ్డాయా?

కేవలం కొంతమంది నిజాయితీ పరులు కట్టిన పన్నులు తో, ప్రభుత్వ సంస్థలు నిలబడ్డాయి మనకు అండగా. అదే మనం దొంగ వ్యాపారం మాని, అందరమూ టాక్స్ లు కడితే, ఇంకా ఎక్కువ ప్రభుత్వ సౌకర్యాలు వస్తాయి కదా?

మనకు చేతికి రోగం వస్తే, చేయిని తీసేస్తున్నామా లేక బాగు చేస్తున్నామా? లేక ప్రవేటు చెయ్యి వాడుతున్నామా? వీలైతే బాగు చేయడం లేదా మందు వాడి, విశ్వ ప్రయత్నం చేస్తున్నాము కదా, చెయ్యి తిరిగి పని చేయడానికి.

అలాగే, మన ప్రభుత్వ వ్యవస్థ లో, ఆసుపత్రి లో సమస్యలు ఉంటే, బాగు చేయాలి. కొందరు వినరు, పై వాళ్ళ ను అడగాలి.

ఉదాహరణకు వాలంటీర్ ఫించన్ ఇవ్వలేదు, ఇంఛార్జి కి చెప్పాలి, వినలేదు, సెక్రటరీ గారు, వినలేదు, ఎంపీడీవో, ఆ పైన కలెక్టర్. ఆ దోవ కాకపోతే పంచాయతీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు.

అలాగే పోలీసులు అయినా, కానిస్టేబుల్, ఎస్సై, సీఐ, డిఎస్పీ, ఎస్పీ, డీఐజీ, ఐజీ, డీజీపీ, ముఖ్యమంత్రి.

అలాగే ఆసుపత్రిలో కూడా. అలా అన్ని ప్రయత్నాలు చేయాలి. వీటన్నింటికీ ముందు, డబ్బు తీసుకోకుండా ఓటేయాలి. విషం తెచ్చి ఇస్తే మొహమాటం కు తీసుకోము కదా. అంతే.

ప్రభుత్వ స్కూలు, రవాణా, ఆసుపత్రికి గనుక, మనం ప్రవేటు వారికి ఇచ్చిన అంత ధనం ఇస్తే, ఇవి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి.

తప్పు ఎక్కడ ఉంది మరి? మనలో, మన నిజాయితీ లో , మన అలవాట్లు లో , మన పెంపకం లో , కాదంటావా మిత్రమా ?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,684; 104 తత్వాలు (Tatvaalu) and views 225,614
Dt : 12-Apr-2020, Upd Dt : 12-Apr-2020, Category : General
Views : 830 ( + More Social Media views ), Id : 491 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : private and public , transport bus school hospital
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content