దేవుడుకి పూజ చేస్తే, గురువుకు పాదాలు చేతులు పట్టుకుంటే, వారి గుణాలు మనకు ఆటోమేటిక్ గా వస్తాయా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,346,486; 104 తత్వాలు (Tatvaalu) and views 254,487.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

If we worship God and hold Guru feet and hands, can we automatically get their qualities/ guna?

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

*స్పందన - ఏవండీ మొన్న మీ ఊరు వెళ్ళాను, ఇల్లు అంతా పాడుబడి ఉంది. మీరు ఇంత మందికి, ఇన్నాళ్ళుగా దాదాపుగా 2020 నుంచి, మంచి చేస్తాను, గుణవంతులను చూపించండి అని, ప్రతి నెలా మా అందరినీ బతిమాలు తున్నారు. ఇది ఒక విచిత్రం, అసలు ఎవరూ ఈ సేవలు చేస్తామని, మాట వరుసకైనా అనడం లేదు. ముఖ్యమైనది, ఇతర 60+ సాత్విక తల్లి దండ్రుల సేవ. వివరముగా ఉత్త చేతులతో రావాలని రాశారు. అసలు ఎవరికైనా, ఇలా చెప్పే ధైర్యం ఉన్నదా, సరదాకు అయినా? సొంత తల్లి దండ్రులనే చూడటం లేదు, కదా*

మీరు చేస్తున్న సామాజిక సేవలు మరియు మీ గుణ సాధనలు అందరితో పంచుకుంటున్నారు వారం వారం, మానసిక నియంత్రణ టెక్నిక్స్ చేసి చూపిస్తూ. ఇంతకన్నా ఆచరణ గురువు ఎక్కడ దొరుకుతారు, ఇంతకన్నా 79+ ఏళ్ళ అమ్మ సజీవ గురువు సేవ, త్యాగం, సహనం, ఓర్పు, కరుణ, జాలి, క్రుతజ్ఞత, విశ్వసనీయత ఉదాహరణ ఎక్కడ ఉన్నది. అరిషడ్వర్గ అష్టవ్యసనం ను మీరు వదలకపోతే, ఇవన్నీ చేయలేరు. మీ పాదాలకు నమస్కారాలు.

ఇది మీరు పంపింది - అరిషడ్వర్గ అష్ట వ్యసనం జయించిన, సాఫ్ట్ స్కిల్స్ నిరూపించిన, సాత్విక (రజో/తమో) గుణ సాధకులు కు, 7 ప్రోత్సాహకాలు/ సేవలు/ అండ, అన్ని వయసుల కు.

ఇది మమ్మల్ని ఉత్తేజ పరుస్తున్నది, మేము మాత్రం ఇలా ఎందుకు ఇతరులను బతిమాల కూడదు, సేవ చేస్తాము మంచి వారికి అని. మంచి వారు, ఎందుకు తమ గుణ కర్మలు, పబ్లిక్ గా చెప్పలేరు?

మరి మీ మాటలు చూసి అయినా, అందరూ సిగ్గు తెచ్చుకుని, చిత్తశుద్ది తో, పెంపక సంస్కారంతో, ముదుసలి తల్లి దండ్రుల సేవ చేసే వారు లేదా దేవునికి ఆత్మ పూజలు చేసేవారు, ఊళ్ళో ఒక్కరూ ముందుకు వచ్చి, అది శుభ్రం చేపించరా, ప్రతి 6 నెలలకు, డబ్బులు మీరు ఎటూ ఇస్తారు కదా. ఇంకా వీరి యాత్రలకు, పూజలకు, యాగాలకు, ప్రార్ధనలకు, దానాలకు అర్ధం ఏముంది.

వచ్చే ఏడాది అమ్మ తో వస్తే, ఎలా ఉంటారు? కరెంట్ ఉందో లేదో, పంపు వస్తుందో లేదో, ఆ దుమ్ము ధూళి, అయ్యో పాపం. అసలు 79+ ఏళ్ళ అమ్మను తీసుకుని రావడం అంటేనే, కాశీ/ రామేశ్వరం కి నడిచిన దానితో సమానం. అమ్మను హోటల్ లో ఉంచి, శుభ్రం చేస్తారా?

మానవత్వం లేని మనుషులు ఇలా ఉన్నారు కాబట్టే, అనాధాశ్రమాలు రోగాలు మోసాలు కుట్రలు ద్రోహాలు పాపాలు పెరుగుతున్నాయి, గుడులు/ ప్రార్ధనాస్థలాలు వ్యాపార కేంద్రాలు అయ్యాయి. సొంత భాగస్వామి, సొంత పిల్లలే, రోగం వచ్చినాక లేదా ఆదాయం పోయినాక లేదా ముదుసలి తనములో, సొంతవారైన వీరిని హీనంగా వదిలేస్తున్నారు. గుడిలో పట్టలేనంత జనం, మానవత్వం లేని అందరి మనసులో అదుపులేని అశాంతి అబద్రత.

పోనీ మమ్మల్ని చేపించమంటే, దయచేసి చెప్పగలరు. ఆ సజీవ గురువు సేవ చేసే భాగ్యం, మా తల్లి కి మరియు మీలాంటి వారికి సేవ చేసే, అవకాశం ఇప్పించండి దయచేసి. మీరు చెప్పినట్లుగానే, గుణవంతులకు సహాయంగా అండగా ఉంటే, మనకు మన పిల్లలకు దైవం అండగా ఉంటుంది, మనకు మనశ్శాంతి త్రుప్తి ఉంటుంది. ఇవి చేయలేనప్పుడు దేవుని నటన పూజలు దండుగ.

*జవాబు* - మీ అభిమానానికి ధన్యవాదములు. దేవుడుకి పూజ చేస్తే, గురువుకు పాదాలు చేతులు పట్టుకుంటే, వారి గుణాలు మనకు ఆటోమేటిక్ గా రావు, మనమూ ఆ గుణాలను రోజూ చిత్తశుద్దితో సాధనతో, ఆచరిస్తే, మనలోని దైవాన్ని మేల్కొలపవచ్చు.

దైవ గుణాలను మంత్రాలుగా శ్లోకాలు గా రాశారు, అవి మనకు అర్ధం అయ్యి అదే బాటలో ధర్మ అర్ధ కామ మోక్షాలతో సాగాలి అని. మీ ఆత్మకు దండం పెట్టి, మీ సాధన కొనసాగించండి, ఊళ్ళో వారితో చూద్దాము.

లేదండీ, ఎవరి కష్టము, ఎవరు పాప ఖర్మ ఫలితము, వారే పడాలి. గత జన్మములో, మనమూ ఇలాగే, ఇతరుల కష్టం చూస్తూ, గమ్ముగా ఉన్నామేమో తెలియదు గదా.

దేవుడు, మన పాత పాపాలను, పూర్వ జన్మ పాపాలను ప్రక్షాళన చెయ్యడానికి, మనకు ఇలాంటి పరీక్ష పెడుతున్నారేమో. ఒంటరిగా ఎదుర్కుంటేనే కదా, దేవునికి మన మీద ప్రేమ ఎక్కువ అయ్యేది, కోటి మంది లో ఒకరిగా మిగిలిపోయేది.

ఇతరులను మనము తప్పు పట్టకూడదు, అది వారి ఇష్టం. రేపు వారి రాబోయే రోజుల్లో అలాగే ముదుసలి తనము లేదా రోగము లో ఇబ్బందులు వారికి తెలుసు.

దేవుడు సమయానికి మనకు అండ చేకూరుస్తారు, సత్వ గుణ ప్రభావం మంచివారిపై చూపించి, చూద్దాము.

మీరంతా పుణ్యాత్ములు కాబట్టి, మీకు మేము 7 సేవలు చేస్తాము అని ఏళ్ళుగా బతిమాలుతున్నాము. కానీ మీ లెక్కలో మేము పుణ్యాత్ములము కాకపోవచ్చుకదా, 250 వారాల 108 ప్రదక్షిణలు చేసినా, 10 ఏళ్ళ సజీవ గురువు సేవ చేసినా, 20 ఏళ్ళ శాఖాహారము చాప నిద్ర యోగా, 800 పైగా ఇతరులకు వీడియోలు ఫోటోలు తీసినా, అవి ఇతరులకు చాలా చిన్నవి కావచ్చు.

కాబట్టి, ఇతరుల లేదా దైవం ద్రుష్టిలో, ఇంకా ఎక్కువ పుణ్య సాధనలు చేసి, మెప్పు పొందుదాము. అప్పుడు వారి మనసు కరుగుతుంది ఏమో చూద్దాము. అది మనకు ఆరోగ్యము మరియు మానసిక దైవ బలమే కదా. మనకన్నా, వారు వారి పిల్లల కఠిన సాధనలు మనకూ చెపితే, మనమూ చేయవచ్చును, కానీ వారు చెప్పడం లేదు కదా.

6 ఏళ్ళుగా అందరికీ చెప్పాము. మేము మీ అంత పుణ్యాత్ములము కాకపోయినా, మా మీద ఎంత కోపం ఉన్నా, కనీసం ఇతర 2 బీద కుటుంబాలకు పై జాలి చూపి, 6 నెలలకు ఓ వెయ్యి రెండు వేలు మాతో ఇప్పించే విధముగా అన్నం పెట్టండి, శుభ్రం చేయించి అని. దానికీ వారి మనసు కరగలేదు. ఏమి చెయ్యగలం.

మీకు గుర్తు ఉందా 2018 కి ముందు, అవసరము లేకపోయినా, ఇంటికి రంగులు వేయించి, స్లాబు పోయించి, పని వాళ్ళు అందరికీ మనకు చేతనైన సహాయం చేసాము. వారితో కలసి తిరుగుతు మాట్లాడుతూ, వారికి తినుబండారాలు అందిస్తూ.

అందరూ అడిగారు, అసలు ఉండనప్పుడు, ఎందుకు ఈ లక్షల ఖర్చు అని. లేదమ్మా, దేవుని దయవలన మనకు నోట్లోకి 4 వేళ్ళు వెళితే, ఇతరులకు కూడా, మనము అదే 4 వేళ్ళు వెళ్ళే విధముగా పని కల్పించి, సహాయము చెయ్యాలి, ఆ కుటుంబాలు చల్లగా ఉండాలి అని చెప్పాము.

ఆశ్చర్యపోయారు, జనం కోసం ఇంత వ్రుధా ఖర్చునా అని. అంతే ఆత్మ గౌరవముతో వారిని చూడాలి, దానముతో కించపరచకూడదు అని చెప్పాము.

స్నేహితులు మనకు అండగా వచ్చి నిలబడ్డారు అప్పుడు. లేకపోతే మనకు ఎవ్వరూ తెలీదు కదా.

కాబట్టి దేవుడిదే భారం, మనం నిమిత్త మాత్రులం, ఎవరిని అండ ఇస్తారో, ఎవరి అండ తొలగిస్తారో, ఆయన ఇష్టం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,486; 104 తత్వాలు (Tatvaalu) and views 254,487
Dt : 04-Aug-2024, Upd Dt : 04-Aug-2024, Category : General
Views : 181 ( + More Social Media views ), Id : 2159 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worship , God , hold , Guru , feet , hands , automatically , qualities , guna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content