మీ అమ్మ ను సంతోషం గా, మంచి గా, మనశ్శాంతి గా ఉంచి, ఆదరముగా చూస్తే, మాకు సేవ చేసినట్లే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,194; 104 తత్వాలు (Tatvaalu) and views 225,897.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రామారావు, తన బంధువుల పిల్లలకు 30 ఏళ్ళ వయస్సు లోపు వారికి, జాగ్రత్తలు, బాధ్యత చెపుతున్నాడు ఈ విధముగా -

ఆత్మాభిమానం చంపుకోని, మంచి గుణం వలనే, మనము పైకి ఎదుగుతాము, ఆస్తులు లేకపోయినా మనశ్శాంతి గా ఉంటాము, దేవుడు మంచివారితో తగినంత చేయూతనిచ్చి సహాయం చేస్తాడు, తోడు అందిస్తాడు.

ఈ రోజులలో నమ్మకం కలిగిన వ్యక్తులు, నిస్వార్ధముగా మనకు మంచి చేసే వారు, 100 కి 20 మంది కూడా ఉండరు. మిగతా వారు అలా కాకుండా, 80 మంది కపట నటన మోసము చేయడమో అబద్దాలు చెప్పడమో చేస్తారు. ఇలాంటి వారి సాయముతో, ప్రాపంచిక మాయలో ఎంత ఎదిగినా, ఒకనాటికి పతనం తప్పదు.

మీరు, మీ అమ్మ ను సంతోషం గా, మంచి గా, మనశ్శాంతి గా ఉంచి, ఆదరముగా చూస్తే, మాకు సేవ చేసినట్లే. వారి బాగోగులు వారం వారం కనుక్కుని, మాకు చెబితే చాలు అని, మిమ్మల్ని వారం రోజులు ఇంట్లో పెట్టుకుని 4 ఏళ్ళ క్రితం, జాగ్రత్తలు చెప్పాము. కానీ ఇంతవరకు మీ నుంచి, బాధ్యత గల పిల్లలు గా, పెద్దల మాట వినే గౌరవించే వారిగా, జవాబు లేదు. ఉందా?

మీరు 10 వ తరగతి వరకు నిద్రలేపి ఫోన్ లో చదువు చెప్పాము, అన్నిటికి అండగా నిలబడ్డాము, అప్పులు వస్తువులు ఇచ్చాము, మాతో తిప్పాము, ఏవీ మీకు గుర్తు లేవు. ఎవరితో మాట్లాడాలి అన్నా ఏమి సహాయ చెయ్యాలి అన్న, ముందు 6 సార్లు 108 ప్రదక్షిణలు 2015 నుంచి తప్పులు కు నటనలకు మోసం కు మరియు పాప ప్రక్షాళన కు, శివ లేదా రామకోటి, ఉదయము 5 కు లెగవడం, నీతి నియమాలను బాధ్యత పాటించడం, పుస్తకం లో రాసి ఉంటాయి చూడండి మతిమరుపుకు మందుగా.

ఎప్పుడూ సుగుణం చెడగొట్టుకోవద్దు, బద్దకం అహంకారమును అలవరుచుకోవద్దు. గతం అలాగే మూలం మరువద్దు. క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని వారు, దైవానికి దూరం, శని వచ్చే 27 సంవత్సరాల కాలచక్రములో తప్పక దొరుకుతాడు. నాడు, ఎవరూ వారిని కాపాడలేరు.

మీ అమ్మ 5 ఏళ్లుగా మమ్మల్ని లెక్క చేయకపోయినా, ఏ విషయం కూడా పంచుకోక పోయిన కూడా, మేము గౌరవించి, అన్ని విషయాలు పంచుకున్నాము. ఏ రోజున, మీ అత్త ఎన్ని విధాలుగా మమ్మల్ని తిట్టినా అవమానించినా, మిమ్మల్ని ఈ రోజు కు వదలలేదు. కానీ అదే అత్త కారణం ను సాకు గా చూపి, మీ అమ్మ మంచిని వదిలేసింది.

ఎందుకంటే మనిషి గా మేము బంధాల ను గౌరవిస్తాం, అవసరం ఉన్న లేకపోయినా, అన్ని చెబుతాము. అవకాశ వాదులం కాదు కాబట్టి, అలాగే మీరూ ఉండాలి అని 5 ఏళ్ళు గా కోరాము. మీరు తిరస్కరించారు. తప్పు లేదు, అది మీ ఇష్టం.

ఇప్పుడు మేము ప్రతి వారం మేము, ఏమి చేస్తున్నామో మీ అమ్మ కు తెలుసు. తను చదవకపోతే, మీతో పంచుకోక పోతే, మా తప్పు కాదు. భవిష్యత్ ఫలితము కూడా తనకే, మీకే.

మీరూ అంతే, మీకు నమ్మకము ఉన్న వారితో, మంచి చెడు ప్రతి వారం పంచుకోండి, మీ మంచి గుణం, పనులు తెలుపండి. కనీసం అమ్మకు కూరలు కోసాను, ఇల్లు చిమ్మాను, అంట్లు కడిగాను, నాన్నకు సైకిలు తుడిచాను అని, సాక్ష్యం తో. స్నెహితునికి ఆసుపత్రిలో అరటికాయలు ఇచ్చాను అని. చుట్టాలకు బాగోపోతే వెళ్ళి పలకరించి వచ్చాను అని.

వాట్సాప్ లో ఇది చాలా తేలిక ఉచితము. హట్టాత్తు గా 3 ఏళ్ళ తర్వాత ప్రత్యక్షము అయ్యి, 1000 రూపాయలు కావాలి అన్నా, మంచి వారు ఇవ్వ కూడదు, అది మంచికో వ్యసనానికో ఎలా నమ్మాలి? ఇక్కడ ధనం కాదు ముఖ్య విషయం, మన గుణం ఎలా ఉందో ఇప్పుడు, రాక్షస ప్రవ్రుత్తా? లేక దైవ ప్రవ్రుత్తా?

మా అమ్మ కు ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, ఏదీ అవసరం లేదు అంటది. అలాగే మీ అమ్మ కూడా. వయస్సు మళ్ళిన అమ్మలు నాన్నలు అందరూ అంతే.

మంచి పిల్లలు గా, వారికి కావాలసినవి, మనము చెప్పి ఒత్తిడి చేసి చేయాలి. కనీసం గుర్తు చేసి, ఆసుపత్రికి తీసుకుని వెళ్లి మందు లు పరీక్షలు, ఆమె ధనం తో అయినా. నాన్న రోజు కి 3 చుట్టలు తాగుతుంటే, ఇంటర్మీడియేట్ వయసు లో, గట్టిగా చెప్పి తగ్గించి, 1 కి తెచ్చా, అది లేకపోతే బాత్రూం కష్టం అంటే. మరి మీరు అలా గట్టిగా చెప్పి మార్చలేరా?

మీ అమ్మ ఉన్నంత వరకే, మా తోడు అండ. మీ అమ్మ లేకపోతే, అదీ ఉండదు. ఇది 5 ఏళ్ళు ముందే చెప్పిన. మీరే నిర్లక్ష్యం బద్దకం అవసరం అవకాశం తో, పలకరు ఇప్పుడు లాగనే. భవిష్యత్తు మరచి.

కనపడని దేవుని వేడుకునే మనం, కనపడే అమ్మ ను అమ్మ నాన్న పై గౌరవము తో, తోడుగా వచ్చే గట్టి నమ్మకం బలం అండ ను పెద్దలను, కాలదన్నుతాం అహంకారం మూర్ఖత్వం తో. ఇదే తప్పు చేయవద్దని ఇంట్లో అందరిని బతిమాలాము.

కాబట్టి మీ అమ్మ కు నాన్నకు, మీ అమ్మమ్మ తాతయ్యకు కు, ఏమి మంచి చేస్తున్నారో వారం కు చెపుతూ, మీ పై నమ్మకం పెంచుకోండి, అవసరం అనుకుంటే భవిష్యత్తు లో. మిగతా పిల్లలకు కూడా ఇది పంపు. రేపు వారు ఇదే మాట అంటారు, 5 ఏళ్ళు తర్వాత వచ్చి, నాకు 50 కావాలి అని లేదా ఇంకో సహాయం కావాలి అని.

ఎందుకంటే మీకు పెళ్లి అయిన దాకా, ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. ఉద్యోగము లో కూడా, మనుషులు అవసరమే. మీ పెద్దలకు కు ముందు చూపు లేదు. ఉంటే, 5 ఏళ్ళు విషయాలు దాచరు.

మీకు ముందు చూపు, ప్రేమ, బాధ్యత, క్రుతజ్ఞత ఉందని నిరూపించండి. మీ పెద్దలు ఉన్నా లేకపోయినా, మన బంధం కొనసాగించండి, మీ మంచి గుణము తో. వద్దు అనుకున్నా, మీ ఇష్టం.

మీ తప్పుడు గుణం సరిచేసుకోకుండా, ఇతరుల ను నిందించవద్దు అడిగితే ధనం ఇవ్వలేదు అని అండ గా రాలేదు అని సహాయం చేయలేదు అని, 3-5 ఏళ్ళు గమ్ముగా దూరంగా దొంగలు గా చాటున ఉండి, కేవలం అవసరం కు మేము మాట్లాడితే అడిగితే, మాట్లాడలేదు చేయలేదు, అని దయచేసి అనవద్దు. ఎందుకంటే ఆ తప్పులకు కూడా, ఇంకా ఎక్కువ పాపం, భవిష్యత్తు నష్టం మనకే.

if you love treat care mom dad elders, you are serving us also please do it with good guna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,194; 104 తత్వాలు (Tatvaalu) and views 225,897
Dt : 14-Sep-2022, Upd Dt : 14-Sep-2022, Category : General
Views : 384 ( + More Social Media views ), Id : 1518 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : love , treat , care , mom , dad , elders , parents , help , serving , guna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content