Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. The illusions and dreams of yesteryear will dissolve and new illusions will appear. The real life is seen in the lonely journey.
ఇన్నాళ్ళ బ్రమలు మాయలు కలలు కరిగిపోతాయి, కొత్త మాయలకు దోవ కనపడుతుంది. అసలు జీవితం, ఒంటరి ప్రయాణం లో కనపడుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
అయ్యో, ఈ 5 ఏళ్ళ లో కూడా చిలక్కి చెప్పినట్లు గంటలు ఫోన్ లో చెప్పినాము, ఆ అలవాట్లు మానేయాలి, మానసిక బలం పెంచుకోవాలి, ఎప్పుడు అయినా ఆ అలవాట్లు/ ఆలోచనల తో ఆరోగ్య/ జీవిత ప్రమాదం. మాకోసం అయినా, పది కాలాలు మాకు తోడుగా ఉండాలి అని, అందరికీ చెప్పిన విధంగా, మా మంచి జీవివి కదూ అంటూ బతిమాలాము. ఆత్మ కు సద్గతి కలుగు గాక.
మిత్రమా దయచేసి ఇప్పుడు అయినా మానసిక బలహీనత వీడాలి, లేదంటే మాకు మీకు అన్యాయం చేస్తున్నారు. 75 శాతం మంది ఆనందం అనుకునే ఏ అలవాటు అయినా, వారి పతనం కు దారితీస్తుంది ప్రాపంచిక బ్రమలు లో.
చక్కెర తీయగా ఉందని పిల్లల కు పెడతాం ఐస్క్రీం కేకు చాక్లెట్ గా, అది తప్పు అని తెలిసి, ఎంతోమంది షుగర్ రోగంతో పోయారు అనేక తెలిసి, అదే మానసిక బలహీనత పెద్దలు నుంచి పిల్లల కు. అప్పు చేసి పప్పుకూడు మంచిదని, దుబారా సంతోష సంబరాలు సౌకర్యాలు ముఖ్యమని, చెప్పే హీనులు ఉన్నారు.
ఆఖరుకు రీడ్ రిసీప్ట్ ఉంచుకోలేని, చాటు మాటు 2 నాల్కల, అలాగే పరాయి మత బాబాయిల చుట్టూ తిరిగే, తమను తాము తెలుసుకోలేని తమ తప్పులు ఒప్పుకోలేని, మానసిక బలహీనులు మూర్ఖవాదులు, మన చుట్టూ ఉన్నారు. వారి పిల్లలకు ఏమి నీతులు చెపుతారు, ఏమి సంస్కారం నేర్పుతారు, తామే ఆదర్శముగా లేకుండా? ఇదే స్వయం పతనం అంటే, ప్రపంచ బ్రమలు అంటే.
+ + +
ముగ్గురు పెద్ద వయస్సు అక్క చెళ్ళెళ్ళు, ఒకరు నొకరు చూసుకుంటూ, 45 నిమిషాలు మాట్లాడుకున్నా (ము)రు. వారి మానసిక ఆనందం ఎంత ఉంటుందో ఆలోచన చెయ్యండి, తమ చిన్నప్పటి గుర్తులు మెదలి, కేవలం చూడగానే.
మీ ఆత్మ, మా ఆత్మ, పంచభూతాలు, దేవుడు అంతా ఒకటే, వేరు గా విడిగా లేవు అని ఆత్మ జ్ఞానం గ్రహించండి దయచేసి. 20 ఏళ్లు పైగా మనం భవిష్యత్తు ఎవరికి చెప్పిన కూడా, లేటుగా అయినా, ఆ శిక్షణ తప్పదు పంచభూతాలతో.
శిక్షణ మొదలు అయిన తర్వాత, ఎవరమూ కాపాడలేము. ఆఖరికి దేవుడు కూడా, కాపాడలేరు. కృష్ణుడు ఎదురుగా ఉండి కూడా, మనలాంటి అవసర అవకాశ కపట నటన 2 నాల్కల కౌరవుల ను కర్ణుని కాపాడలేదు.
ఎందుకు అంటే, మనలోని దైవ శక్తి ని, అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం లో చిదిమేసాము గేళిచేశాము ఇన్నాళ్లూ, సజీవ గురువు సేవ లేకుండా, ప్రాపంచిక వ్యామోహం లో పతనం అవుతూ.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి
అందరు పిల్లలు, తమ ముదుసలి తల్లి తండ్రులు ను, వారి సంస్కార పెంపకంలో నేర్చిన, సజీవ గురువ సేవ లో భాగంగా దగ్గర పెట్టుకుని, మధ్య తరగతి జీవనం లో మనం చెప్పిన అలాగే ఆచరిస్తున్న ఆయుర్వేదం, అలాగే మానసిక నియంత్రణ పద్దతులు వాడుతూ, మానసిక మరియు శారీరక ఆరోగ్యం కాపాడ గలిగితే,
వారు కూడా ఈ ముదుసలి విశ్రాంతి వయస్సు లో, అమ్మ లాగా 79+ ఏళ్ల కు కూడా, షుగరు బీపీ వర్టికో లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా, కేవలం అరబిళ్ళ షుగర్ బీపీ బిళ్ళ లు తో, రోజూ మైలు నడుస్తూ మనశ్శాంతి ఆరోగ్యం గా ఉంటారు, తమను తాము ఆధ్యాత్మికంగా తెలుసుకుంటూ.
మా దగ్గర 1 నుంచి 6 నెలలు ఉంటూ నేర్చుకోవడం కు మిమ్మల్ని, మీ ఇంటి మానసిక ఆర్థిక పరిస్థితి బట్టి, మేమూ ఆ ఆర్థిక స్ధితి భాగం పంచుకొంటూ ఆహ్వానించింది, బతిమాలింది మీకు తెలుసు. కర్మ విడువదు, ఈ జన్మలో లేదా మరు జన్మలు లో, మిత్రమా ఇప్పుడే మేలుకో.
+ + +
అమ్మా ఎలా ఉన్నావు, జరిగిన విషయం తెలిసింది. మన మధ్య లో నవ్వుతూ తుళ్ళుతూ, ఉండే ఓ కెరటం ముగిసింది.
మనల్ని వీడినందుకు బాధపడాలో లేదా మానసిక బలహీనత తో తను బాధ పడకుండా, ఇతరుల ను బాధ పెట్టకుండా, తన దోవ చూసుకున్నందుకు, మనకు దూరంగా వెళ్ళినందుకు, సంతోష పడాలో తెలీని విచిత్ర పరిస్థితికి, తెలీని అయోమయ స్థితి.
కానీ మంచి అయినా చెడు అయినా, ఒక నమ్మక తోడు ఉంటే బాగుంటుంది. అది లేకపోతే ఇతరుల లో ఎన్ని మార్పులు ఇబ్బందులు వచ్చాయో మన చుట్టూ చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు అర్ధం అవుతుంది, మన సొంత వారే ఇంట్లో వారే మనల్ని ఎంత హీనంగా చూస్తూ దూరం పెడతారో.
ఇన్నాళ్ళ బ్రమలు మాయలు కలలు కరిగిపోతాయి, కొత్త మాయలకు దోవ కనపడుతుంది. అసలు జీవితం, ఒంటరి ప్రయాణం లో కనపడుతుంది, ఎంత మంది మనతో అవసర అవకాశాలతో తోడు ఉన్నా. ఇన్నాళ్ళ జీవితం ఒక ఎత్తు, ఇక రాబోయే జీవతం ఇంకో ఎత్తు. ఏది మనకు క్షేమమో ఏది మనకు పతనమో అసలు అర్ధం కాదు. అక్కడే, మాయ జయిస్తుంది, మనకు మానసిక బలహీనత ఉంటే.
మానసికంగా ధైర్యం గా ఉంటూ, ఆచరణలో దైవ సత్వ గుణము ను చూపే ప్రయత్నం చేస్తూ, మనకు లేని తెలియని సత్వ గుణ శాతం పెంచుతూ, రాబోయే సమస్యలు మాయలు మోహాలు కష్టాలు కన్నీరు అవమానాలు చిరునవ్వు తో ఎదుర్కొంటు, రజో తమో గుణ సాధన తగ్గింపుతో, మంచి కి తలవంచి, మీకు దగ్గరలో నమ్మకం అయిన వారిని ఆచరణ గురువు గా ఎంచుకుని, వారి సాధనల లిస్ట్ సాక్ష్యం తో చూసి విచారణ చేసి, వారి మాటలను చిత్తశుద్ధి తో పాటిస్తూ, అందరికీ ఆదర్శంగా వివరిస్తూ, చివరి దశలో అమ్మ లాగా, సంస్కార పిల్లల దగ్గర మనశ్శాంతి తో ఉండాలని భగవంతుని కోరుతూ ఉన్నాము.
రాబోయే కాలములో చాటుగా ఉన్నా, మన మంచిపనులు బయటకు చెప్పలేకున్నా, సాత్వికుల జవాబులకు మౌనముగా ఉన్నా, మనము పతన బాటలో నడుస్తున్నాము అని అర్ధం స్పష్టం. రజో తమో గుణాల వారే, మేము ఇతరులకు ఎందుకు చెప్పాలి అనుకుంటారు. మనకు పంచభూతాల శిక్షణ తప్పుదు, అది సొంత పిల్లల రూపములో లేదా అల్లుళ్ళు కోడళ్ళ రూపములో లేదా స్నేహితులు/ బంధువుల/ అరిషడ్వర్గ/ అష్టవ్యసన రూపములో. ఎందుకంటే మన అందరి శరీరాలలో, పంచభూతాలు ఉన్నాయి మరువద్దు.
తీరిక చేసుకుని, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెపితే, మేము మాట్లాడగలము, మానసిక ధైర్యం చెపుతూ, భవిష్యత్ ను మరలా గుర్తు చేస్తాము, గత ఏళ్ళుగా మాట్లాడుకున్నది, మన ఇంట్లో వారి గుణ కర్మలను బట్టి. మన శనివార సాధనలు, మానసిక బలం పెంచడం కు ఉపయోగం, ఆచరణలో, మరువద్దు. ఏ పూజలు పునస్కారాలు యాత్రలు, మన కర్మ ఫలితాలను ఆపలేవు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,155; 104 తత్వాలు (Tatvaalu) and views 259,054 Dt : 28-Jul-2024, Upd Dt : 28-Jul-2024, Category : General
Views : 172
( + More Social Media views ), Id : 2153 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
illusions ,
dreams ,
yesteryear ,
dissolve ,
appear ,
real ,
life ,
seen ,
lonely ,
journey Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments