చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా, మనిషి స్వభావం సంస్కారం మారకుండా, ఉదాహరణ, నేటి రాజకీయాలు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,705; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా అన్న దానికి, మనిషి స్వభావం సంస్కారం మారకుండా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఫలితము ఉండదు, అనే దానికి, ప్రత్యక్ష ఉదాహరణ, నేటి రాజకీయాల నుంచి ఇవ్వగలరా? మాకు అందరికీ తెలిసి ఉండాలి, నీతి గల వారు, ఎవరూ కాదనలేని ఉదాహరణగా ఉండాలి.

జవాబు - భగవంతుడు, ఎటువంటి వ్యక్తిగత వివక్ష రాగ ద్వేషం లేకుండా, కేవలం వారి చెడు పనులు గుణం పై మాత్రమే, వారి మానసిక అంత రంగాలు మంచి గా మారేటట్లు, దానికి తగిన పదాలను వచ్చేటట్లు దీవించు గాక.

వెనకటికి ఒక పెద్దాయన పోతన గారు చెప్పారు, పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుడట అని, అలాగే ఉంటుంది, మన పరిస్థితి.

కావాలని ఆలోచించి రాయాలి అంటే, మనసు ఒప్పదు సహకరించదు, ఒక్క పదమూ బయటకు రాదు. అవి మదిలోకి మూట లాగా, ప్రవాహము లాగా వచ్చాయి అంటే, దైవ కార్యం కోసం, తల నెప్పి వచ్చి భారముగా ఉండి, బయటకు దూకాలని, చేతుల ద్వారా పదాల రూపములో, బయటకు వస్తాయి.

నీతి గల తప్పులు ఉంటే చెప్పండి, సరి చేస్తాము క్షమాపణలతో. చదివిన మరియు పంచుకున్న ఉత్తములకు, దేవుని దీవెనలు.

ఎందుకంటే, ఒక రాజకీయ నాయకుని లక్షణము ను బట్టి, వారిని ఎన్నుకున్న జనాల మరియు వారి వెంట తిరిగే అనుచరుల అభిమానుల నాయకుల ఓటర్ల, మంచి చెడు లక్షణాలు కూడా దాదాపు గా అంతే ఉంటాయి, మన ఎదురు ఎంత మంచివారు గా నటించినా. లేకపోతే సమర్దించరు కదా?

ప్రజలు మరియు నాయకులు ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు, వారి ఆచారం మతము ను బట్టి, ఏదొ ఒక దేవుడిని నమ్మి.

* 1. కానీ భారత రాజ్యాంగము అందరికీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది అని తెలిసినా, ఇంకా గత రాజుల పాలన కు బానిసలుగా 20 ఏళ్ళు పై గా, ఇంకా కేవలము 2 కుటుంబాలకే దాసులము, ఇంక కొత్త 3 మరియు 4 కుటుంబాలకు వర్గాలకు ఆ పదవి ఇవ్వము, మార్పు చూడము.

రాష్ట్రము ఎంత అప్పుల పాలు అయినా, ఒక్క కరోనాను తట్టుకునే ఆసుపత్రి కట్టలేని నాయకులు అని నిరూపణ అయినా పర్లేదు అని భీష్మించుకు కూర్చున్నాము ప్రజలు గా, నిజమే కదా?

* 2. పేదలకు కార్మికులకు బడుగు బలహీన వర్గాలకు అండ, తమ లో నుంచి వచ్చిన సామాన్యుడే అని తెలిసినా, కనీసము 200 కోట్లకు పైన కుటుంబ ధనం లేని వారిని, వెన్నుపోటు లేదా కేసులు లేదా అవినీతి మచ్చ లేని వారిని, ముఖ్యమంత్రులు గా ప్రజలే అంగీకరించడము లేదు.

ఇంక పేదలను ఆదరించేది ఎవరు? వారి బతుకులు మారేది ఎప్పుడు? ఓటర్లు గా మనము, ధన పక్షపాతులమా లేక పేద మధ్యతరగతి పక్షపాతులమా?

* 3. కులం, వర్గం, అవసరం, అవకాశం, ధనం, మందు, బిర్యాని లేకుండా ఓటు వేస్తాము, అలాగే అసలు ఓటు వెయ్యకుండా తప్పించుకునే బాధ్యత లేని వ్యక్తులం కాదు మేము మా కుటుంబము అని జనం అనుకోవడం లేదు. ఇది ధర్మమేనా?

* 4. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నా, అమ్ముతున్నా, విదేశాలకు ధారాదత్తం చేస్తున్నా, 3 పంటల మాగాణి ని కాంక్రీటు చేస్తున్నా, ఇదేమి అభివ్రుద్ది అని అడగకుండా, ఉచితము గా చేతిలో కి వస్తే పైకము చాలు అనే జనం నాయకులు ఉన్నారు.

* 5. జగనన్న మరియు చంద్రన్న, మరియు వారి అనుచరులు ఎమ్మెల్యేలు ఎంపీలు అభిమానులు, ఎన్ని గుడులు తిరిగినా పూజలు ప్రార్ధనలు చేసినా, ప్రజా ధానము తో నడిపే పధకాలకు, తమ కుటుంబ పేర్లు పెట్టుకోకూడదు అన్న సంస్కారము ఇంగిత జ్ఞానం, ఈ నాటికీ తెలియడము లేదు, కదా?

తమ వ్యాపారాలకు లాభాలు, కానీ రాష్ట్రానికి మాత్రము అప్పులు అన్న స్రుహ ఒక్కరికీ లేదు కదా?

జిల్లాలకు ఊళ్ళకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టకూడదు, మిగతా వారిచే వారిని తిట్టించకూడదు అన్న స్రుహ, ఆ కుటుంబ సభ్యులకు కూడా రావడం లేదు కదా?

* 6. కేసీయార్, దళితుడిని సీయెం చేసి కాపలా కుక్కలా ఉంటాను అన్న నాయకుడు, బంగారు తెలంగాణా అని అప్పుల వైపు పరుగులు తీయిస్తున్న నాయకుడు, జనాలను రాష్ట్రాలను విభజించి పాలించిన నాయకుడు, ఇప్పుడు దేశ్ కి నేతా అని గతములో చంద్రన్న లాగా మిగతా రాష్ట్రాలు తిరుగుతాను అంటే, వినాశకాలే విపరీత బుద్ది, నాయకులదా లేక ప్రజలదా? పాత బస్తీని కొత్త బస్తీ చేయలేని ఆదర్శ నేత?

* 7. ఓవైసీ - ఎన్ని ప్రార్ధనలు చేసినా, పాత బస్తీని కొత్త బస్తీ చేయలేని, తర తరాల ఆదర్శ నేత? పాత బస్తీ ప్రజలు అన్ని సదుపాయాలు చదువు సంధ్య తో, కొత్త బస్తీ గా మారితే, ఇక ఆయన గెలవరు. అలాంటి పాత బస్తీల జీవితాంతం ఎదగనీయకుండా సమ్రక్షించేందుకు, ఇతర రాష్ట్రాలలో పర్యటనలు.

ఇదంతా, మాయ మోహం బ్రమలు కాదా?

చిత్తశుద్ది లేని శివ పూజ లేలరా అన్న దానికి, మనిషి స్వభావం సంస్కారం మారకుండా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా, ఫలితము ఉండదు, అనే దానికి, ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి కావా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,705; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 20-Feb-2022, Upd Dt : 20-Feb-2022, Category : Politics
Views : 556 ( + More Social Media views ), Id : 1303 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , shiva , worship , sincerity , human , culture , nature , example , politics , babu , jagan , Owaisi , kcr , vote
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content