విలేఖరులు, పత్రికలు టీవీలు ఆన్లైన్ మీడియా, పార్టీ వైపు ఉండి, కధనాలు రాయడం కరక్టేనా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1486 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1521 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మీ విలేఖరులు, పత్రికలు టీవీలు ఆన్లైన్ మీడియా వెబ్సైట్ లు, ఏదో ఒక పార్టీ వైపు ఉండి, ఏదో ఆశించి ఏదో తీసుకుని, కధనాలు అసత్యాలు అనుకూలంగా రాయడం కరక్టేనా? మంచి కి నీతికి నిలబడే వారు లేరు, ఇది తప్పు కదా?

జవాబు, మంచి ప్రశ్న, ఇదే ప్రశ్న, మనలో, మన ఇంట్లో, మన బంధువులు స్నేహితులు లో మరియు ఇరుగు పొరుగు లో, దాంకుని ఉన్న బాధ్యత లేని ఓటరు ని, ఎప్పుడు అయినా ఈ మాట అడిగారా?

ఎందుకు ధనం, అవకాశం, అవసరం, వర్గాల కు లొంగకుండా నీతి గా, జాతి కోసం రాష్ట్రం కోసం ఉండము, ఓటు వేయము అని అడిగారా?

మనకు భయం, మన తప్పులు మనకు కనపడవు, వినపడవు. మనం తప్ప, మిగతా ప్రపంచం అంతా మారాలి.

నాయకులు, అధికారులు, పోలీసులు, విలేఖరులు మాత్రమే తప్పుడు వారు, మన దృష్టిలో. మనం మాత్రం, పురుషోత్తమ కడిగిన ముత్యపు ఓటరులం.

ఇన్ని వేల కోట్లు అప్పు చేసుకుంటూ పోతూ, రాష్ట్రం ను తాకట్టు పెట్టి, తమ సొంత పేర్లు తో ప్రచారం చేసుకునే మరియు, ప్రభుత్వ స్ధలాలు అమ్మి, గనుల ధనం ప్రజలకు, సంక్షేమం కోసం చేరకుండా చేసే వారిని, గత 30 ఏళ్లుగా మళ్ళీ మళ్ళీ ఎన్నుకునే, ఓటరు గా మనం చేసేది కరెక్టే నా? అంటే మనలో నీతి ఉందా? మనం ఎటూ వంగకుండా, కేవలం అభివృద్ధి వైపు నిలబడ్డామా?

ఎప్పుడు అయినా, మనకు తెలిసిన వారు చేస్తున్న, మంచి పనులు ను, సమర్ధన చేసి ప్రోత్సాహం చేసే, మంచి మనసు సంస్కారం, మనకు ఉందా? ఉచితంగా శభాష్ అనే గుణం కూడా లేని మనం, ధనం ఇచ్చి, ఓ మంచి కార్యంను ముందుకు నడపమని, తోడుగా అండగా ఉండటం, మనకు చాతనవునా? లేదు కదా, మనం మంచి చేయం, చేసేవారు ని, 4 రూపాయలు ఇచ్చి, కింద పడకుండా ఆదరించము.

మరి ఓ బీద లేదా మధ్య తరగతి విలేఖరి, తన కుటుంబం ఎలా నడుపుకోవాలి? మనం సహాయం చేసి, వారిని నీతిగా ఉంచం. మరి ఓ పత్రిక లేదా ఓ నాయకుడు, అబ్బాయి ధనం ఇస్తాం మంచిగా రాయి అంటే, తన బతుకు తెరువు కు, ఆ బడుగు విలేఖరి రాయవద్దా? కుటుంబం ను రోడ్డు న వేయాలా? అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదూ అంటే ఇదే గదా.

పత్రికలు/ టీవీ /వెబ్సైట్ మరియు విలేఖరులు ఎప్పుడూ ఒకటి కాదు. కంపెనీ మరియు కార్మికులు ఎప్పుడూ ఒకటి కాదు కదా. పత్రిక, ఒక (లేదా కొందరు) వ్యాపారి లేదా నాయకుడు అండతో, లాభాల కోసం ఓ పార్టీ ప్రచారం కోసం పెట్టేది. దానికి ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రకటనలతో ఆదాయం ఇస్తే, వారికి వ్యతిరేకంగా రాయలేరు కదా. భజన చేయకపోతే, ఆదాయం రాదు కదా, కంపెనీ సాగదు. అందులో పనిచేసే, జీతాల విలేఖరికి స్వేచ్ఛ ఉంటుందా? మనసుకు తగిన విధంగా రాయనిస్తారా నిజాలతో?

కాబట్టి పత్రిక ఎప్పుడూ, ఏదో ఒక వైపు వంగాలి లొంగాలి, లేదా మూయాలి, సొంతముగా నడపలేరు. జనం ఉదారముగా విరాళాలు ఇస్తారా, మంచి వార్తా కంపెనీ కి? మనం ఎప్పుడు అయినా ఇచ్చామా? పేపరు కూడా కొనకుండా, పక్కన వాడి పేపరు చూస్తాం. కనీసం మంచి వార్తను, ఫార్వార్డ్ కూడా చేయం అవతల వారికి పేరు రాకూడదు అని.

ఒక విలేఖరి కి, ప్రభుత్వ కార్యక్రమాల కోసం, ప్రభుత్వ గుర్తింపు కార్డు కావాలి అనుకుందాం. సవాలక్ష ప్రశ్నలు తో అది తెచ్చుకోవడం చేతగాక, ఓ ఎమ్మెల్యే ఎంపీ లేదా అధికారి తో అది ఇప్పించుకుంటే, వారికి వ్యతిరేకంగా రాయగలరా? రాయలేరు. రాస్తే, మరలా వారు సహాయం చేయరు కదా. అంటే, మామూలు విలేఖరులకు ఇన్ని అడ్డంకులు ఉంటాయి. కాబ్ట్టి, వార్తా టీవీ కంపెనీని ఏమినా అనుకోవచ్చు, కానీ దయచేసి విలేఖరులను అనవద్దు.

అంటే నిజాయితీగా ఉండే వారికి, మనం సహాయం చేసి, మనం ఎటూ అండగా ఉండం. వారు ఇతరుల సహాయం కూడా తీసుకోకూడదు.

మనం ఓటును మాత్రం, మన వర్గం అవకాశం అవసరం కోసం, నీతి లేకుండా వాడవచ్చు, అంతే నా?

నిజాయితీగా ఉండే విలేఖరులు ను, మనమే అవినీతి వైపు నడుపుతున్నాము. ఆ పాపం లో, మనకూ భాగం ఉంది మిత్రమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1521 General Articles, 51 Tatvaalu
Dt : 19-Dec-2020, Upd Dt : 19-Dec-2020, Category : Politics
Views : 504 ( + More Social Media views ), Id : 871 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reporters , print , tv , online , media , party side , write , articles
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content