Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. Is singles only care old parents? Give the correct answer and shut my kids mouths.
*అబ్బాయి, ఒంటరి గా ఉన్న వాళ్ళే, ముదుసలి తల్లి దండ్రులు ను చూస్తారు దగ్గర పెట్టుకొని, పెళ్ళై సంసారం తో కష్టం అని మా చవటలు చెబుతున్నారు. కాస్త, సరైన సమాధానం చెప్పి, వాళ్ళ నోరు మూయించు. వాళ్ళకు తగ్గవాడివి నువ్వే, పుణ్యం ఉంటుంది, మా బిడ్డలాంటి వాడివి.*
జవాబు, అయ్యో ఎంతమాట, పెద్దవారికి గా మీకు నమస్కారాలు. మీరు ఆదేశించాలి, మేము ఆచరణలో పెట్టాలి. గతములో కూడా, రాశాము అనుకుంటా, అయినా మరలా ప్రయత్నం చేద్దాము.
ఆడలేక మద్దెల ఓడు అంటే, తెలుసు కదా. మీ వాళ్ళు బహుశా అంతే కావచ్చు.
అలాగే, ఒంటరి వాళ్ళు లేదా పెళ్ళెన వారు, ఉద్యోగం వచ్చిన తర్వాత, తల్లి దండ్రులు లేదా బయటవారి దగ్గర, అప్పు చేయలేదు, చేయి చాచలేదు, ఆస్తులు అమ్మ లేదు, అత్త వారింటి ఆస్తి కి ప్రాకులాడ లేదు అంటే, మేమూ అలాగే చేస్తాం అంటారా మీ వాళ్ళు? నీతి గా ఉంటారా ఆత్మాభిమానం తో?
ఉండరు ఉండలేరు, తమకు నచ్చనివి, ఇలాగే ఏవో సాకులు చెప్పి, పేరెంట్స్ నే బురిడీ కొట్టిస్తారు, తమ పిల్లల చేతిలో భవిష్యత్ లో మోసపోతారు.
జీవిత భాగస్వామి కి కట్నం, అధికారం, అవకాశం, అవసరం, అందం కోసం అమ్ముడు పోయిన లేదా ఆత్మాభిమానం లేని వారి మాటలు ఇలాగే ఉంటాయి.
మనము బీదవారి గురించి మాట్లాడటం లేదు, అన్ని ఉన్న వారి గురించే సుమా.
తమ తల్లి పాలు విలువ తెలియని మూర్ఖుల మాటలు ఇవి. అందరి కంటే ఉత్తమం అనిపించుకోవాలి మంచి పని లో గానీ, ఇంకొకరి తో పోల్చుకుని, కన్న తల్లి తండ్రి కే శఠగోపం పెడతాం అంటే ఎలా? పెంపక లోపం అయితే, మనము చెప్పాల్సింది ఏమీ ఉండదు.
ఆస్తి ఇవ్వు, పింఛను ఇవ్వు అప్పుడు చూస్తాం అంటే? లేదా ఇంట్లో కుక్క మాదిరిగా కట్టివేస్తే లేదా బయట తమతో పాటూ అన్నిటికి తిప్పకుండా మూలన కూర్చోబెడితే చూసినట్లా? వ్యాపారులా లేక కడుపు న పుట్టిన వారా?
మాకు దేవాలయం దగ్గర, కనీసం నెలకు 3 కుటుంబాలు కనపడుతాయి. పిల్లలు అలాగే తమ ముదుసలి తల్లి దండ్రులు తో కలిపి వస్తారు. పెద్దలు ఎన్నాళ్ళు గా ఉన్నారో తెలీదు గానీ, అడుగులతో తడబడుతూ కర్రతో నడిచేవారు, పండు ముదుసలి కూడా ఉన్నారు.
1) ఒకరి సంసారిని అడిగా, ఏవండీ ఇంత బిజీ లైఫ్ లో, పిల్లలు తో పాటు గా, ముదుసలి పెద్దలు మీతో ఉండటం, మీకేమీ ఇబ్బందులు గా లేదా అని. అందరూ వందల కారణాలు సాకులు చెబుతారు.
వారు చెప్పిన జవాబు - మాకు పెళ్లి, గుణం బట్టి, పెద్దలు చేశారు. మాకు విలువలు సంస్కారం ప్రేమ ఆప్యాయత ముఖ్యం, ధనం కాదు.
మా పెద్దలు, మా బాగు కోరి, తమ చెమటను రక్తం గా మార్చి, ఉన్నత సౌకర్యాలు జీవనం కోసం, విదేశాల్లో మరియు భారత దేశ పెద్ద నగరాల్లో, చదువు ఉద్యోగం ఇచ్చారు.
మరి వారికి కూడా, మా సమాన ఉత్తమ సౌకర్యాలు ఇవ్వడం, మా కర్తవ్యం క్రుతజ్ఞతలతో. మా సోదరులు పల్లెటూళ్లలో ఉన్నారు. అక్కడ నా పిల్లల ను ఉంచలేను, కాబట్టి నా తల్లి దండ్రులు ను కూడా ఉంచను. బంధువులు సోదరులకు చెప్పి తెచ్చాము అన్నారు.
నాకు చాలా సంతోషం వేసింది, ఇలాంటి ఉత్తమ బిడ్డ లను కని, వారిని సంస్కారంతో పెంచి, ఇప్పుడు ఆనందంగా ఉన్న, మిమ్మల్ని చూస్తుంటే, గర్వముగా ఆనందభాష్పాలు వస్తున్నాయి. నన్ను ఆశీర్వదించి ఆశీస్సులు ఇవ్వగలరు అని తలవంచి దండం పెట్టాను.
వీల్ చైర్ లో తండ్రిని, గుడికి తెచ్చి న కుటుంబం కూడా ఉంది, కొడుకు కోడలు పిల్లలు తో.
2) సరే, ఒక ఒంటరి వ్యక్తి ని అడిగా, నువ్వు ఎందుకు తల్లి దండ్రులు ను దగ్గర ఉంచుకోలేదు అని,
అతని జవాబు, అన్నా నా సంగతి పూర్తి గా మీకు తెలుసు, అబద్ధాలు చెప్పను, మనకు ఓ చోట కాలు నిలవదు, ఉద్యోగం సంపాదన ఆనందం కోసం ఎటో తిరుగుతా. ఇంటి బాధ్యతలు నాకు కష్టం. జేబు లో రూపాయి నిలవదు, మోహం విడిచి క్షణం ఉండలేను. మించిన ఐశ్వర్యం ఉంది, అలాగే మోహం కూడా ఉంది. నా స్వార్ధం నాకు ముఖ్యం, బయట వారి గురించి పట్టించుకోను.
ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు, నా దగ్గర ఉంటే, అమ్మ నాన్న కు మనశ్శాంతి ఉండదు, తర్వాత అయినా బాధతో వెళ్లి పోతారు, అసలు ముందు నన్ను నమ్మి రారు. అందుకే సోదరి దగ్గర ధనం ఇచ్చి పెట్టిన. నువ్వు నన్ను ఏమనుకున్నా, నా బుద్ధి మారదు అన్నాడు.
లేదు, నువ్వు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది, తప్పును లోపాన్ని స్పష్టముగా ఒప్పుకున్నావు, తల్లి దండ్రుల సుఖం ఆలోచన ఉంది.
పెద్దలు మీద వంద అబద్దాలు చెప్పి నటించే వారు కన్నా, నీకు తక్కువ శిక్ష తప్పకుండా ఉంటుంది. మనసు ను అదుపు చేసే ప్రయత్నం ఇప్పుడు అయినా మొదలు పెట్టుకో, భవిష్యత్తు లో నీకే ఉపయోగం అని చెప్పినా. ప్రయత్నం చేస్తా అన్నాడు.
అంటే, ఒంటరి వాళ్ళు లేదా పెళ్ళైన వారు మాత్రమే పెద్దలను దగ్గర ఉంచి చూస్తారు, చూడరు అని అనకూడదు.
సంస్కారం కృతజ్ఞతలు బాధ్యత విశ్వసనీయత ఉన్న వారు చూస్తారు, లేని వారు ఏదో అబద్ధాలు చెబుతూ చూడరు. అంతే కదా తేడా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,104; 104 తత్వాలు (Tatvaalu) and views 254,444 Dt : 27-Feb-2022, Upd Dt : 27-Feb-2022, Category : General
Views : 720
( + More Social Media views ), Id : 1319 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
singles ,
care ,
parents ,
answer ,
shut ,
kids ,
mouths ,
children Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments