Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* నిరంజన్ మరియు టీం కు శుభాకాంక్షలు
* తానా లో నే ప్రజాస్వామ్యము
* సంస్థ స్వార్ధ నాయకుల తీరు
* ఆనాడు చంద్రన్న తెలివి తేటలతో, తెదేపాను కైవసం
* రామన్న ను వెన్నుపోటు తో పక్కకు
* కొత్త గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారు
* సభ్యులు తెలివి బలమున్న వాడిదే
* పాండవులు బలహీనురు అయితే మంచి వారు
* గ్రూపు అండలేని, ఒంటరి గోగినేని
* గోగినేని గారి వేదాంత అనుభవము
* 75% ఖచ్చితంగా ఒప్పుకునేవి
2 min read time. తానా ప్రజాస్వామ్య ఎన్నికల సమరం ఫలితాల ఆశయం, గ్రూప్ లా లేక సేవలా? మన విశ్లేషణ తో పాటు గా, గోగినేని గారి వేదాంతం కనువిప్పు కూడా చదవండి.
తానా సభ్యులకు అభినందనలు. గెలుపొందిన నిరంజన్ శృంగవరపు మరియు టీం సభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.
అభినందనల దోవ దానిదే, విమర్శల దోవ దీనిదే, రెండూ ఉండాలి, నిజమైన ప్రజాస్వామ్యము లో.
ఇకనైనా కుట్రలు, గ్రూప్ లు మాని, ఇరు వర్గాలు మంచి వైపు పనిచేస్తాయని ఆశిద్దాము.
విమర్శలు అందరూ చేస్తారు చాటుగా, మన ఇష్టం వచ్చిన విధము గా నొటికి వచ్చినట్లు, మన ఇంట్లో లేదా మన అనుకూల మిత్రులు బంధువులతో. కానీ ఎదుటివారి మంచి కోసం, సద్ విమర్శలు చేసి, నేరు గా నాయకులు అధికారుల నంబర్ల కు పంపి, వారిచే మంచి తిట్లు లేదా మన్ననలు పొందే వారు ఎంతమంది?
మొదట గా మనము ఒప్పుకోవాల్సింది, తానా లో మాత్రమే ప్రజాస్వామ్యము ఉంది, మిగతా పెద్ద తెలుగు సంస్థలతో పోలిస్తే. పోరాడి గెలిచే అవకాశం కనీసం ఇక్కడ ఉంది, అని ఒప్పుకోవాలి.
మిగతా వాటిలో పోరాట పటిమ కనపడదు. ఎందుకంటే, చాటుగా పదవులు పంచుకుని, బానిసత్వముతో ఎదుగుదామని సంత్రుప్తి పడి, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘాలలో, ఎక్కువ ధనముతో లేదా వేలములో పదవులు కొనుక్కుంటున్నారు, అన్న వినికిడి కూడా ఉంది.
మనము ఏ సంస్థను, లేదా దాని ఆశయాలను తప్పు పట్టడం లేదు. కొందరు స్వార్ధ నాయకుల తీరును మాత్రమే తప్పు పడుతున్నాము. 20 ఏళ్ళ ముందు నాయకులు చిత్తశుద్ది తో పని చేసినా, నేటి నాయకులు స్వార్ధము తో, సంస్థలను, బ్రష్టు పట్టిస్తున్నారు.
ఆనాడు చంద్రన్న తన తెలివి తేటలతో, తెదేపాను కైవసం చేసుకోవడానికి, ఆడిన ఎత్తులు పై ఎత్తులు అన్ని, కేవలం పార్టీ రక్షణకు అన్న నినాదముతో, ఇప్పుడు ఇక్కడ కూడా నడిచాయి. చిత్రము గా అప్పుడు, రామన్న ను వెన్నుపోటు ద్రోహం తో పక్కకు నెట్టి, నిందారోపణ చేసి, చంద్రన్న నే పార్టీ రక్షకుడిగా, తెదేపా నాయకులు అభిమానులు కూడా తెలిసీ నమ్మి ఆదరించారు.
రామన్న వ్యధతో నిస్సహాయకుడి గా మిగిలిపోయారు, పార్టీ వ్యవ స్థాపకుడు అయినా కూడా.
కాలం కలసిరానప్పుడు, తాడు కూడా పాము అవుతుంది. తాడి ని తన్నే వాడు ఉంటే, తల దన్నే వాడు ఉంటాడు అనాలి కదూ?
అంటే మిగతా నాయకులు మంచి చెడు అంతా తెలిసీ కూడ, సొంత పార్టీ లోనే, కొత్త గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారు, ఇప్పుడు ఫలితాలు చూస్తున్నారు.
ఇప్పుడు తానా లో అదే కధ, తిరిగి జరిగింది. ఇక్కడ కొడాలి గారి పాత గ్రూప్, ఇంత కాలం ఉన్న పట్టును కోల్పోయింది, కేవలము తక్కువ తేడాతో. నిరంజన్ గారి కొత్త గ్రూప్, పట్టు నిలుపుకుంది.
తానా సభ్యులు వివేకముతో అన్ని తెలిసీ కూడా, తెలివి బలమున్న వాడిదే రాజ్యం అని, గ్రూప్ రాజకీయాలను స్వాగతించారు. గతము లో ఇదే విధముగా ఇదే తెలివితో ఏలిన, పాత గ్రూప్ ను తిరస్కరించి కొత్త గ్రూప్ ను అందలము ఎక్కించారు.
సాధారణము గా అందరూ దొంగలు అయినప్పుడు, చిన్న దొంగను లేదా ఉన్న వారిలో మంచి వారిని ఎన్నుకో మంటారు. ఎందుకంటే, క్రమముగా అవినీతి తగ్గుతూ ఉంటే, భవిష్యత్ లో మంచి వారు వస్తారు.
కానీ, మనము తెలుగు నేల ఎన్నికల్లో అయినా లేదా విదేశీ తెలుగు ఎన్నికల్లో అయినా, ఒకటే వివేకవంతుల లక్ష్యం, ఏదో ఒక గ్రూప్ నాయకుడు గా, వీలైనంత పెద్ద దొంగనే ఎన్నుకోవాలి, మనకు కావాల్సిన గొయ్యి తీయడానికి, మన దొంగ బుద్దులకు సరిపోయే విధముగా.
ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అంటే, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద దొంగ రావాలి, ఈ గ్రూప్ నాయకుడిని దించాలి అంటే, అంతేనా?
పాండవులు బలహీనురు అయితే మంచి వారు, ఉన్నంత లో. అందుకే క్రుష్ణుడు వారికి అండగా ఉన్నారు.
మరి మనము తెలుగు వారము, మనలాంటి బలహీనులకు అండగా ఉంటామా? వారిని ఓడిస్తామా? అందుకే, గ్రూపు అండలేని, ఒంటరి గోగినేని గారు ఓడిపోయారు. కాదు కాదు, మనం అంతా కలసి మంచిని, ఓడించాము.
ఎందుకంటే, మనకు పెద్ద ముఠా కొత్త నాయకులే కావాలి. మరి తప్పులు అన్ని మనము చేస్తూ, నాయకులకు ఎందుకు తప్పు పడుతున్నాము రామ రామా?
అందుకే మన నినాదం ఎప్పుడూ, తప్పు నాయకులది కాదు, ఓటు వేసి గెలిపించే ప్రజల దే, అంటే సభ్యులదే.
గోగినేని గారి వేదాంత అనుభవము చూడండి, ఇవి వారి మాటలు సుమా ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచి - గత 10 ఏళ్ళు పైగా అలా జరగ లేదా? మీరు అలా గెలవలేదా, అంటే?
* 75% పైగా ఓట్లు, ముందు బాలట్ కలెక్టర్ల వద్దకు, అక్కడినుంచి ముఠా నాయకుల వద్దకు, అక్కడినుండి కొన్ని సందర్భాలలో బాలట్ ట్రేడర్ల వద్దకు, అక్కడ నుండి వర్గ గాడ్ ఫాదర్ ల వద్దకు, క్రమంగా బాలట్ బాక్స్ వద్దకు - ఈ విధానాన్ని మన తెలుగు సమాజం, తానా సభ్యులు ఆమోదించినట్లే అందరూ భావించాలి.
* స్వచ్చంద సంస్ధ లో వాలంటీరుగా, నిష్పక్షపాతంతో నిస్వార్ధంగా సేవ చేయటానికి, ఇంత ఖర్చూ, సుమారు 10 వేల బాలట్లను, ఇళ్లనుంచి కలెక్ట్ చేసుకునేంత శ్రమ చేయటం - అర్ధమూ కావటము లేదు, మింగుడూ పడటం లేదు. కానీ జరిగింది, జరగబోయేది ఇదే కదా!
* తానా సేవల గూర్చి కాక, స్వంత విషయాలపై విష ప్రచారాలు సభ్యత కాదనీ, ఒకవేళ వారు చెప్పేది తప్పని అనిపిస్తే వారితో భవిష్యత్తులో నైనా జాగ్రత్తగా మసలుకోవాలి
* ఇంటి వివాహానికి, ఏదో ఒక వర్గాన్ని మాత్రమే ఆహ్వానించినట్లు తప్పుడు ప్రచారం జరగడం, దానిని అనేక మంది ప్రముఖులు అనుకునే వారు కూడా కామెంట్ చేయడం. ఇలా ఈ ఎన్నికలు చాల మంది మనసులను పాడు చేసిందనీ, విచక్షణ కూడా కొన్నిసార్లు కోల్పోయి, తుచ్చ ఎన్నికల ప్రయోజనమే పరమావది కావటం ఏమిటో, నాలాంటి వారికి ఎప్పటికీ తెలియదేమో?
* పై వివరించిన విషయాల్ని బట్టి, ప్రచారం లో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పూరిత వాతావరణాన్ని బట్టి, వర్గాల ఓట్ల శాతం వ్యత్యాసము 10 శాతానికి దగ్గరలోనే ఉండటాన్ని బట్టి, పోటీ ప్రదానంగా తానా సంస్థ ఆశయాల గూర్చి కాక సంస్థపై ఆధిపత్యం మీద కావటం మూలం గా, తానా కు ఖచ్చితంగా గాయమైనట్లే భావిస్తున్నాను.
* ఇప్పుడు మనమందరమూ దీనిపై ద్రుష్టి సారించి, అవసరమైన దిద్దుబాట్లు చేసి, సంస్థ ప్రాధమిక ఆశయాలైన సేవలను తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి చేస్తూ ముఖ్యంగా ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న క్లిష్ట పరిస్థిలో సహాయపడటానికి పునరంకితం కావాలి.
గమనించ వలసిన విషయాలు, అధిక శాతం (75%) ఒప్పుకునేవి ఇవన్నీ మనము తెలుగు నేలపై అమలు చేస్తున్నవే గదా అంటే?
* తానా ఎన్నికలలో పాల్గొనాలంటే, ఎదో ఒక వర్గానికి చెందిన ప్యానెల్ లో మాత్రమే పోటీ చేయాలి, దానికి అవుసరమైన వివిధ (???) ప్రయత్నాలు చేసుకోవాలి
* తానా ఎన్నికలలో బాలట్ కలెక్షన్లు ఒక సంస్కృతి, దానిని గౌరవించటం తప్పనిసరి
* ఎన్నికలకు చాల ముందు నుంచి తానా సభ్యుల అడ్రస్ చేంజ్ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలి
* మరీ మంచివాడిగా ఉండడడానికి, అతి ప్రయాస పడటం వలన, ఆయాసము తప్ప ఉపయోగంలేదు
* ఓటర్లుకు మౌఖికముగా ఒకటికి రెండు సార్లు వారికి తెలిసిన వారి ద్వారా, మన గురించి పాజిటివ్గా, అవతలి వారి గురించి నెగటివేగా రుద్దుతూ ఉండాలి
* వేరే వారిమీద ఏ మాత్రం అవకాశం ఉన్నా గాని, బురద చల్లి, వోటర్లకు మనకే ఓటు ఎందుకు వెయ్యాలి, వారికెందుకు వద్దు అనేవి, రెండూ బుర్రలో బ్రెయిన్ వాష్ ఒకటికి రెండుసార్లు, వేరే వేరే వ్యక్తుల ద్వారా చేయాలి
* మరీ పెద్ద మనిషి లా ఉన్నా గాని, అదీ నమ్మక అనుమానము రావచ్చు, ఏదో ఒక లోపం ఉండటం పెద్ద సమస్యేమీ కాదు
* తానా సేవల చరిత్ర మంచిదే కానీ, క్వాలిఫికేషన్ కంటే మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరమే లేదు
* మనం తానాలో పొడిచేసాం అని, ఏమి చెప్పినా, ప్రూవ్ చెయ్యాల్సిన అవసరం పెద్దగా లేదు. కనుక నిర్భయంగా చెప్పుకోండి
* ప్యానెల్లో మన పార్టునకు, ఆర్ధిక భారము భరించుటకు సిద్ధమవ్వాలి
* ప్రాంతీయ ప్రతినిధుల ఎన్నికలలో, వీలైనంతవరకు పోటీ ఉండేలా చేయాలి, సర్దుబాట్లను విఫలం చేయాలి
* కుల, ప్రాంత, జిల్లా, కాలేజీ, రాజకీయపార్టీ వంటి గ్రూపు లను వీలైనంత కవర్ చేయాలి
* స్వంత నిధులతో ఆశించే పదవిని బట్టి సభ్యులను చేర్చాలి, లేదా చేర్చినవారి తో సఖ్యతగా గాని, డీల్ గాని ఏదైనా ఉండడటం శ్రేయస్కరము
* అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ ఒక్క జీవిత భాగస్వామిని, ఇంట్లోని పెంపుడు జంతువులను తప్ప నర మానవుడెవరినీ నమ్మకపోవడం మంచిది
* ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అందరి వాడిగా ఉన్నట్లు మసలుకోవటం నేర్చు కోవాలి. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని అన్నట్లు మన సమయం వచ్చే వరకు వేచి చూసే ఓపిక అవుసరం
* రాజకీయ ఎన్నికల్లో లాగా సిద్ధాంతాలకు పోకుండా, ఎవరు బి ఫారం ఇస్తే అక్కడ పోటీకి సిద్ధమైతే ఛాన్సులు పెరుగుతాయి
* ఎంతటి వారి మీద నైనా విషప్రచారం జరుగుతుంది కనుక దానిని మరీ సీరియస్ గా పట్టించు కోనక్కరలేదు
* రాజీ ప్రయత్నాల్లో మరీ చీపు కమిటీ పదవులకు అమ్ముడు పోకపోతే, అవసరం వారిది కనుక మంచి బేరం దొరకవచ్చును
పైన వన్నీ ఎన్నికలలో పాల్గొనలనుకునే వారికి స్వీయ అనుభవాలతోపాటు చాలా మందిని (గెలిచిన, ఓడిన వారిని) పరిశీలించిన తరువాత క్రోడీకరించడం జరిగింది. కష్టంగా అనిపించినప్పటికీ, స్వచ్చంద సంస్థలో పనిచేయడానికి వీటి లో వీలైనన్ని అమలుచేయడం అవసరమే.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,057; 90 తత్వాలు (Tatvaalu) and views 175,741 Dt : 01-Jun-2021, Upd Dt : 01-Jun-2021, Category : America
Views : 546
( + More Social Media views ), Id : 1186 , Country : USA
Tags :
tana ,
election ,
win ,
result ,
purpose ,
analysis ,
groups ,
fight ,
gogineni ,
kodali ,
niranjan ,
philosophy ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments