Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. గౌరవనీయులు జగన్, అప్పలరాజు, బాలినేని, జిల్లా కలెక్టర్ గార్లు, మత్స్య శాఖ అధికారులు కు ఓడరేవు జాలర్ల విన్నపాలు.
ఒంగోలు కు పాయసమిచ్చారు, చీరాల కు గుక్కెడు గంజి నీళ్ళైనా దక్కనివ్వండి సార్లు,
అయ్యా పెద్ద పదవులు అలకరించిన, పెద్దలందరకు పేరు పేరునా దండాలండి. మాది ఓడరేవు, ప్రకాశం జిల్లా చీరాల దగ్గర సముద్ర తీరము అండి. పుట్టిన దగ్గర నుండి, అలాగే రోజూ లెగిచిన దగ్గరనుండి, సముద్రపు తల్లిని నమ్ముకుని, అలల ఆటుపోటుల తో, మా జీవిత బోటులు పై తిరుగుతూ, పట్టిన, చేపలతో బతుకుతున్నాము అండి. మంచి మనసుతో, ఆ ఫోటోలులో మా బతుకులు చూడండి అయ్యా, మాకు న్యాయం చెయ్యండి బాబులు.
మా కట్టాలు, మాలో ఒకరైన అప్పలరాజు గారికి, ఎరుకేనండి. ఎందుకంటే, శ్రీకాకుళం సముద్రం తీరము నుంచి, నెల్లూర్ తీరం దాకా, మా అందరి బతుకులు తుఫానులకు వరదలకు కుంగిపోవడము, ఎండలకు ఎండిపోవడం, ఒకటేనండి.
మా బతుకుల్లో వెన్నెల కురుస్తుంది అని, ఎన్నో ఏళ్ళు గా ఎదురు చూస్తున్నాము అండి. అమావాస్యాలు, పౌర్ణమి లు వస్తున్నాయి పోతున్నాయి అండి, మా జాలర్ల చేపల బతుకు వేటలో మార్పులు లేవండి.
2018 లో ఓడరేవు కు, ఫిషింగ్ హార్బర్ వస్తుందని 400 కోట్లు కేటాయించారు అని చెప్పారు, గత ప్రభుత్వములో, ఎగిరి ఆనందముగా గంతులు వేసామండి. మా జీవితాలలో మార్పులు వస్తాయని పండగ చేసుకున్నాము. ఒంగోలు నుంచి జిల్లా అధికారులు వచ్చి, స్థానిక ఎమ్మెల్యే తో కలసి, స్థలమును చూసి వెళ్ళారు. మరి ఆ తర్వాత ఏమైందో తెలీదు అండి.
History Link.
మరలా తర్వాత వార్తలు వింటున్నాము. 2000 కోట్ల పైన పెట్టుబడితో, రామాయపట్నం పోర్ట్ ఒంగొలు కు ఇచ్చారు అని. మా ఫిషింగ్ హార్బర్ మాకు ఇస్తారు అని, ఆశగా చూస్తున్నాము. కాని, ఆ 400 కోట్ల హార్బర్ కూడా కొత్తపట్నము లాక్కుని వెళ్ళారు అని తెలిసింది అయ్యా. అంకెలు తప్పులు ఉండవచ్చు, మన్నించాలి.
పరమాన్నం పాయసము (పోర్ట్) ఒంగోలుకి ఇచ్చినా, మేము భాగము అడగమయ్యా. కనీసము గంజి నీళ్ళు (ఫిషింగ్ హార్బర్) అయినా, మా చేతిలో పోయమని ప్రార్ధిస్తున్నాము. జగనన్న తో చెప్పి, మాకు ఇప్పిస్తారు కదూ.
ప్రజాస్వామ్యములో బలవంతుల దే రాజ్యము అంటుంటారు, అది నిజము చేయమాకండయ్యా, అన్ని ఒకరికే ఇచ్చి. మన కడుపు నింపుకుంటూ, బలహీనుల కడుపుకు ఓ రెండు మెతుకులు, పెట్టండయ్య.
చంద్రన్న కన్నా మీరే ఉత్తములు అని, దయామయులు అని, నిరూపించండయ్యా. ఇలా అడగటము తప్పు అయితే క్షమించండయ్యా.
ఓడరేవుకు చెందిన సముద్ర పుత్రుల తరపున
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,153; 90 తత్వాలు (Tatvaalu) and views 175,745 Dt : 16-Nov-2020, Upd Dt : 16-Nov-2020, Category : Politics
Views : 571
( + More Social Media views ), Id : 814 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
jagan ,
appalaraju ,
balineni ,
pongal ,
port ,
ongole ,
porridge water ,
fishing harbor ,
chirala ,
vodarevu ,
karanam ,
amanchi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments