Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. జులై 6 మరియు 7 వ తేదీలలో బే ఏరియా లో(కాలిఫోర్నీయా), భక్త జన సమూహం, ఆ జగన్నాధుని ఉత్సవాల కోలాహలముతో తరించిపోయినది. 3 నగరాలలో, జై జగన్నాధా, జై జగన్నాధా అంటూ భక్తులు జయజయ ధ్వానాలతో, ఆ మహా విష్ణువుని తలచుకున్నారు. అమెరికా గడ్డ పై కృష్ణ భక్తుల చైతన్యం, జై జగన్నాధ అంటూ న్రుత్యాలతో తాళాలతో కదం తొక్కిన పారవశ్యం.
శనివారం ఉదయము, ఫ్రీమాంట్ హిందూ ఆలయములో ప్రారంభము అయినది, జగన్నాధుని రధ అలంకారము. ఒరిస్సా భక్తులు, ఫ్రీమాంట్ జగన్నాధ ఆలయం వారు, ఈ కార్యక్రమాన్ని, హిందూ దేవాలయ సహకారముతో చేయ సంకల్పించారు.
పూరిలో జరిగినట్లుగా చేయాలన్న సంకల్పముతో, కృష్ణ బలరామ సుభద్రా పరివార సమేతముగా పూజించి, రధము పై వేడుకగా ప్రతిష్టించారు. ప్రాంతీయ మేయర్, ఇతర అధికారులు కూడా గౌరవ సూచకంగా పాల్గొన్నారు .
చిన్నారుల గొప్ప నాట్య వందనముతో, జగన్నాధుని రధయాత్ర వైభవముగా మొదలు అయ్యింది, షుమారుగా మధ్యహ్నం 12 కి. ఆలయ ప్రాంగణము లో, భక్తుల వేడుకుల కేరింతలు, జయ జయ ధ్వానాలతో, 3 సార్లు చుట్టూ తిరిగారు.
అందరూ కనీసం కొంత దూరమైనా, రధం తాడు పట్టుకుని లాగాలని ప్రయత్నించారు, మన సాంప్రదాయం ప్రకారం. తరువాత అందరికీ, తీర్ధ ప్రసాదాలు, ఉచిత ప్రసాద భోజనము(మధ్యాహ్నం 1 కి) అందించారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి, సన్నివేల్(ఫ్రీమాంట్ నుండి అరగంట దూరం) హిందూ దేవాలయములో కూడా, ఇలాంటి కార్యక్రమం మొదలు పెట్టారు, అక్కడి ఒరిస్సా సమాజము భక్తులు, సన్నివేల్ జగన్నాధ ఆలయం వారు. రధ యాత్రకు ఇబ్బంది లేకుండా, ఒక మైల్ దూరం లో స్థలం ఏర్పాటు చేసి, అక్కడ నుండి బస్సు సౌకర్యం కల్పించారు. ముందుగా జగన్నాధుని పూజ, భక్తి గీతాలతో సంగీత కార్యక్రమము తో, వేడుక ప్రారంభము అయినది.
శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత రాయబారి కూడా, కుటుంబసమేతం గా వచ్చి, వేడుకలలో పాలుపంచుకున్నారు. భక్తులు వైభవముగా, దేవుని ప్రతిమలను రధం మీదికు చేర్చారు. ఆలయ ప్రాంగణము లో, భక్తుల వేడుకుల కేరింతలు, జయ జయ ధ్వానాలతో, 3 సార్లు చుట్టూ తిరిగారు. తరువాత అందరికీ, తీర్ధ ప్రసాదాలు, ఉచిత ప్రసాద భోజనము(రాత్రి 7 కి) అందించారు.
తరువాతి రోజు ఆదివారం, మహా నగరం శాన్ ఫ్రాన్సిస్కో(ఫ్రీమాంట్ నుండి గంట లోపు దూరం) లో ఉన్న ప్రసిద్దమైన గోల్డెన్ గేట్ పార్క్ లో, మధ్యాహ్నం 12 నుంచి కోలహలముగా జగన్నాధుని రధ చక్రాలు, వైభవంగా కదిలాయి. ఇస్కాన్(సిలికాన్ వాలీ, బర్కిలీ) వారి అధ్వర్యం లో, ఇక్కడ చాలా సంవత్సరాలుగా, అతి పెద్ద ఎత్తున, మూడు రధాలతో సాగే యాత్ర, ఇది ఒక్కటే అని చెప్పవచ్చు.
ఈ యాత్రలో, హైందవ మతాన్ని స్వీకరించిన అమెరికా జాతీయులు కూడా పాల్గొంటారు. హరే రామా హరే క్రిష్ణా అంటూ, భగవంతుని కొలుస్తూ, కనీసం మైలు దూరం, భక్తులు వందల సంఖ్యలో, యాత్ర కొనసాగిస్తారు. ఆ తర్వాత అందరూ ఒక చోట , భజనలు చేస్తూ ఆనందముతో తన్మయత్వములో, ఆ భగవంతుని కొలుస్తారు. తరువాత అందరికీ, తీర్ధ ప్రసాదాలు, ఉచిత ప్రసాద భోజనము(మధ్యాహ్నం 1 కి) అందించారు.
ఇస్కాన్ వారి గొప్పతనం చూడండి. మన పక్క ఇంటి వారిని, రధ యాత్ర లో లేదా గుడిలో, పాడుతూ గెంతుదాము, ఆరోగ్యం కి మనసు కు మంచిది, అని చెప్పడానికి సిగ్గు మనకు. ఒకవేళ మనం చెప్పినా, విందు వినోదం కో, అవసరానికో, తప్ప వారూ రారు. మనమూ కూడా వెళ్ళమూ.
మరి ఇస్కాన్ వారు , అన్ని దేశాల లో ఉన్నారు, ఇలాగే రథ యాత్ర లు చేస్తారు, అందరికీ క్రిష్ణ చైతన్యం గురించి అర్థం అయ్యేలా చెపుతారు. వారి పనులు ను ఇష్టపడ్డ, చదువు కున్న విదేశీయులు, హిందూ మతం అనుసరిస్తున్నారు/ తీసుకుంటున్నారు, స్వచ్ఛందంగా.
మనం కష్టం వస్తే, డబ్బు ఇస్తే, అవసరం వస్తే, క్షణం లో మతం మారతాము. తోటి వారికి సహాయం కూడా చేయము.
కనీసం ఇలా జరుగుతుంది అక్కడ అని చెప్పుకోవటానికి, అందరికీ చూపించటానికి అయినా, మన మనసు ఒప్పకుంటుందా? హరే క్రృష్ణ హరే క్రృష్ణ !!!
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,072; 90 తత్వాలు (Tatvaalu) and views 175,742 Dt : 08-Jul-2019, Upd Dt : 08-Jul-2019, Category : America
Views : 1368
( + More Social Media views ), Id : 134 , Country : USA
Tags :
jagannada radhayatra ,
Fremont ,
Sunnyvale ,
San Francisco ,
california ,
usa ,
hindu temple ,
ISKCON ,
jagannath temple అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments