బంధువైనా లొంగక, మంత్రి బాలినేని అలాగే ఇతరుల పాపం మరియు పార్టీ కి నష్టం తగ్గించిన, ముందు చూపు జగనన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1617 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1652 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనం 3 ఏళ్ళుగా మొత్తుకుంటున్నాము, ఎమ్మెల్యే లు మంత్రులు అధిష్టానం తో, కాలం బలమైనది, అహంకారం ఆధిపత్యం తో ఇష్టం వచ్చినట్లు చేయవద్దు, గతము లో మా 2 వ అబ్బాయి తెదేపా చంద్రన్న లా, ఘోర పతనం వద్దు అని.

మొన్న ఉగాదికి కూడా చెప్పాము, ప్రధాన గ్రహాల మార్పులు, జాగ్రత్తలు అని.

కరెంట్ కోత ఆపక పోతే, అలాగే మమ్మల్ని ఎవరూ ఏమీ పీకలేరు అన్న అనవసర ఆర్భాట పదాలు వదలకపోతే, మా 3 వ అబ్బాయి వైకాపా జగనన్న కి కూడా, ఓట్లు సీట్లు అధికార కోత తప్పదు.

ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అన్న మాట మరువద్దు సుమా, నాయకుడు అంటే, కింద వారి తప్పుల భారము అన్ని మోసే వాడు కూడా.

శకుని లా పొగిడేవాడు ఎప్పుడూ మన వెనుక గొయ్యి తీసేవాడని కష్టం లో వదిలేస్తాడు అని, ధైర్యంగా నిస్వార్థంగా, మన తప్పులు ముఖం మీద ఎత్తి చూపేవాడే, మన ఆప్తుడు మిత్రుడు అని కష్టము లో ఆదుకుంటాడు అని, భారతం రామాయణం భాగవతం నిరూపించాయి.

కౌరవుల బంధువులు మరియు మిత్రులు, దుర్యోధనుడు పతనం కోరారు, కేవలం తమ స్వార్థం తో.

కృష్ణుడు మరియు పాండవులు మాత్రమే, కౌరవ రారాజు క్షేమం కోరారు. కానీ మూర్ఖులు కౌరవులు మోహాంధకారములో మునిగి, వారినే శత్రువులు అని భ్రమ పడ్డారు, పతనం చెందారు.

ఎక్కువ మంది, భ్రమల్లో వ్యామోహం లో, మనల్ని కూడా అలాగే అనుకుంటారు.

కొత్త మంత్రులు నాయకులు అధికారులు కూడా, ఇది మనసు లో పెట్టుకొని మసలాలి, లేదంటే మరలా పతనం తప్పదు.

మరి మన మాటల విన్నపాలు ఎమ్మెల్యే ఎంపీ లు చూస్తున్నారో లేదో లేదా వారి పీఏ లు మధ్యలో దాచేస్తున్నారో తీసేస్తున్నారో తెలీదు.

చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి అవకాశం, మనం 2 ఏళ్ళ ముందు చెప్పినట్లుగా జరిగింది. మీరు సెర్చ్ కొడితే అన్ని కనపడుతాయి మన లోకం తీరు లో లేదా సోషల్ మీడియా స్టేటస్ లో ఉంది.

మిత్రులు, నాయకులు, బంధువులు ఎవరైనా సరే, ప్రాపంచిక మోహం లో ఉన్న వారు, మనం మంచిమాట చెప్పినప్పుడు, లెక్క చేయకుండా, గేళిచేస్తూ, మూర్ఖం గా ముందుకు పోతారు.

2 లేదా 5 ఏళ్ళు తర్వాత ఫలితాలు తప్పకుండా వస్తాయి, అప్పుడు బీపీ వచ్చి, మనశ్శాంతి దూరమై మూర్చబోతారు. చిన్న పిల్లలు లా ఇతరుల మీద పడి, యాగీ చేస్తారు. కానీ ఫలితాలు ఉండవు ఉపయోగం లేదు. అంతే గానీ తమ తప్పు లు ఒప్పుకోరు.

ఎవరైనా మన తప్పులు కు శిక్ష పడినప్పుడు, మరలా సహాయం చేసినా, వారూ పాపం లో భాగం అవుతారు. కర్ణుడు, దుర్యోధనుడు పతనం అప్పుడు ఎవరూ సహాయం చేయలేదు, చేయకూడదు.

నిన్న కూడా పార్టీ పెద్దల కు, కమ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మంత్రులు లేరు అంటున్నారు. ఒకవేళ సంఖ్య కష్టం గా ఉంటే, కనీసం కమ్మ వారికైనా ఇవ్వగలరు జగనన్న కు చెప్పి, అని విన్నవించాము. మంచి మాట వినకపోతే, ఫలితాలు వారికే. అయితే 70 శాతం బీసీ లకు ఇతరులు కు న్యాయం చేశారు.

పచ్చ మీడియా కడుపు మండిన మాటలు పట్టించుకోవద్దు, అన్ని అబద్ధాలు, వారు ఇంకా చంద్రన్న ను దిగజారుస్తున్నారు వాస్తవాలు దాచి. చీరాల లో 30 మంది వార్డు అభ్యర్థులు ను పెట్టుకోవడం ఎలాగో ఎందుకు పెట్టలేక్పోయిందో, తెదేపా కు నేర్పగలరు మీ నీతులు తో.

బాలినేని వంచకుడు అంత దోచాడు అని ఓ వైపు పచ్చ మీడియా కధనం ఇస్తున్నారు, ఇంకో వైపు బాలినేని కి అన్యాయం అని రాస్తారు, రెచ్చగొట్టి పుల్లలు పెట్టాడానికి.

ఇక అసలు విషయానికి వస్తే, బాలినేని తప్పులు ఎన్నో. నేల విడిచి, సాము చేశారు, మన పాత కధనాలు చూడండి సాక్ష్యం.

వైకాపా పార్టీ కోసం ఎన్నికల్లో నష్ట పోయిన వారిని ఇంకా నష్ట పరుస్తూ, తెదేపా వారిని అందలం ఎక్కించారు.

జగనన్న పరువు తీస్తూ, విలువలు రాజీనామా లేకుండా, తెదేపా ఎమ్మెల్యే తో అక్రమ బంధం సాగించారు. జిల్లా అధికారులు చేత సోషల్ మీడియా నడిపించలేకపోయారు.

పోనీ వ్రతం చెడ్డా, ఒక మంచి పని అయినా చేసి, చీరాల తెదేపా ఎమ్మెల్యే కరణం పరువు నిలబెట్టమని కోరితే, ఆయన పరువు కూడా చీరాలలో తీసేసారు. దేనికీ పనికిరాని విశ్వసనీయత లేని ఎమ్మెల్యే గా నిలబెట్టారు, ఆయనకూడా మూర్ఖముగా నిలబడ్డారు ఆనందముతో స్వార్ధం కోసం.

చీరాల జిల్లా లేదు, జిల్లా శాఖలు లేవు, హార్బరు లేదు, చేనేత పార్క్ లేదు, ఏదీ లేదు. తా చెడ్డ కోతి వనమెల్లా చెడగొట్టింది అని నిరూపించారు.

పదవి రాలేదని గగ్గోలు పెడుతున్నారు అందరితో పాటూ బాలినేని, మరలా రాజీనామా తో బెదిరింపు, ఆఖరికి దళిత సురేష్ మంత్రి పదవి కూడా పీకమని, చిన్న పిల్లల ఏడుపు.

ఇప్పుడు అయినా తప్పులు ఒప్పుకుని, అక్రమ కేసు తో జైలు లో పెట్టిన ఒంగోలు సుబ్బారావు గుప్తా ను వదిలి క్షమాపణ చెప్పి, చీరాల కు మంచి చేసి, భవిష్యత్తు మార్చుకుంటారు అని ఆశిద్దాం.

జగనన్న కూడా ఒంటెద్దు పోకడలు పోతే, చంద్రన్న లాగా పతనం పొంది, ఇంక మిగిలింది కేవలం మా 4 వ అబ్బాయి, ఎటువంటి రాజకీయ మచ్చ లేని, పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంకా చివరకు మిగిలింది, ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి అని మనమే ఒప్పుకుని, బంగారు పళ్లెంలో ఇచ్చినట్లు చేయడమే.

ఎందుకంటే జనం కూడా తెలివిగా, మనము మంత్రులు ను మార్చినట్లు, ఎమ్మెల్యేలు పార్టీ మార్చినట్లు, మనము కూడా సీఎం ను కూడా, ఎందుకు మార్చకూడదు, మనకు కుటుంబ బానిసత్వం ఎందుకు అనుకుంటే, భవిష్యత్తు కష్టాలు తప్పవు.

Jagannanna new team foresight minimized sin and damage to ysrcp party with relatives balineni and others  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1652 General Articles, 61 Tatvaalu
Dt : 11-Apr-2022, Upd Dt : 11-Apr-2022, Category : Politics
Views : 219 ( + More Social Media views ), Id : 1338 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : govt , jagan , advisers , minister , cabinet , posts , team , shuffle , balineni , relatives , damage , sin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content