Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మన పాటలు సందేశాలు విని, పశ్చాత్తాపం పొంది, తమకు రాబోయే భయంకర శిక్షలు తప్పించుకోవడానికి అయినా, ఒక్క కొడుకు కూతురు అయినా, తమ తల్లి దండ్రులను దగ్గర పెట్టుకుని, చూస్తారని ఆశపడటం లో తప్పు లేదు, స్వార్ధం లేదు, నష్టం కూడా లేదు. దానికే ఈ తపస్సు, యజ్ఞం, కఠోర నియమం, ఎంత సమయం పోతున్నా కూడా, కానీ మనకు ఆరోగ్యం, వారికి కూడా, కనీసం గొంతులో పదాలు పలికిస్తే.
మీ లాంటి మంచి మనసు ఉన్నవారు, తల్లి దండ్రిని గౌరవించేవారు, వీటిని ఎటూ పదిమందికి చేరుస్తారు, కనీసం మనం చేయలేని పని ని పది మందికి తెలిపి, ఉచిత పుణ్యం సంపాదించుకుందాం.
పెళ్ళి కాని వారిని, ఎందుకు కాలేదు అని ప్రశ్నించే ముందు, జాలి పడే ముందు, ధన అవసర అవకాశాలు హోదా పదవి వీసా కోసం అమ్ముడు పోకుండా, మనము నిస్వార్ధముగా గుణములు మాత్రమే చూసి పెళ్ళి చేసుకుని, ఉత్తమ సంస్కారం గల పిల్లలను కని, ముసలి తనము లో వారి దగ్గర ఉండే, అర్హత సంపాదించాము అని గొప్ప గా చెప్పుకుందాము. ఎందుకంటే పెళ్ళి కాని వారికి 1 రూపాయి పాపం ఐతే, సంస్కారం లేని పిల్లలను గని, ఒంటరిగా అనాధలు గా ఉండటం 10 రూపాయల పాపం. ఎందుకంటే, నిస్సిగ్గుగా కలియుగ పాపాన్ని పెంచాము సంస్కారం మరిచాము అని నిరూపణ అయ్యింది కదా? ఒకరి కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే, మనల్ని జాలిగా అయినా చూసే సంతానం ఒక్కటీ లేదంటే, ఇంక మన విలువ ఏమిటి? మన జీవిత ఫలితం ఏమిటి? ఏమి సాధించాము 60 ఏళ్ళు? కేవలం సంపదలు భోగాలు?
10 మాసాలు మోసారు మన పెద్దలు మనలను అందరినీ, వారి చెయ్యి పట్టుకుని తిరిగాము. కానీ నేడు మా చెయ్యి వారికి అవసరము లేదు అని నిసిగ్గుగా చెపుతున్నాము, ధనం ఇస్తున్నాము మనుషుల్ని పెట్టాము అంటున్నాము, మా అంత సౌకర్యాలు వైద్యం వద్దు అని మనమే అంటున్నాము, మరలా దేవుని పూజ మా అస్తులు పెంచి మమ్మల్ని మాత్రమే చల్లగా చూడుమని. మనకు రేపు జరగబోయేది అంత కన్నా, ఘోరముగా ఉంటుంది.
పాటలో ఈ దేవుని చదరంగములో అని ఉంది, తప్పు ఆ మాట, ఇది మానవ స్వార్ధ చరంగము. అందుకే అలా పాడాము. మన తప్పులకు, మన నీతి మాలిన పనులకు, దేవుడు రాత అన్న మాటలను వాడి ఆత్మ ద్రోహం చేసుకోవద్దు. తప్పులు ఈ జన్మలో ఒప్పుకోకపోతే, వచ్చే జన్మలో ఒప్పిస్తారు తగిన గుణపాఠం తో, మనకు బాకీలు అవసరమా మరుజన్మకు?
కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు,
ఆపై నీతో వచ్చేదెవరు? ఏ ఒక్క తల్లి తండ్రి ధైర్యముగా వీటికి జవాబు చెప్పే పరిస్తితిలో లేరు, తమ సంస్కార పెంపకం ఒప్పుకోరు, తమ తప్పులు తాము తెలుసుకోరు - పెద్దలు పిల్లలు ఇద్దరు, ఇలాగే కలియుగ పతనం కొనసాగిస్తూ 90 శాతం పాపం కు చేరుస్తు. ఇప్పుడు కరెంట్ తో కాల్చేయి వచ్చాయి, స్థలం అంటే రేటు పెరిగింది కదా?
తాళి కట్టిన, మగడు లేడని, సొంత వారు తోడుగా లేరని, తరలించుకు పోయే, మృత్యువాగదు, ఎందుకంటే మనము తప్పులు కూడా ఎవరినీ లెక్కలేకుండా చేస్తాము, ఈ కట్టెను కట్టెలు, కాల్చక మానవు, ఆ కన్నీళ్ళకు, చితిమంటలారవు.
పదిమాసాలు మోశావు, పిల్లలను
బ్రతుకంతా మోశావు, బాధలను
ఇన్ని మోసిన నిన్ను, మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
పల్లవి :
ఈ జీవనతరంగాలలో… ఈ మానవ చదరంగంలో..
ఎవరికి ఎవరు సొంతము… ఎంతవరకీ బంధము
చరణం: 1
కడుపు చించుకు పుట్టిందొకరు..
కాటికి నిన్ను మోసేదొకరు..
తలకు కొరివి పెట్టేదొకరు..
ఆపై నీతో వచ్చేదెవరు… ఆపై నీతో వచ్చేదెవరు ||ఈ జీవనతరంగాలలో||
చరణం: 2
మమతే మనిషికి, బందిఖానా..
భయపడి తెంచుకు, పారిపోయినా..
తెలియని పాశం వెంటబడి, ఋణం తీర్చుకోమంటుంది 2
నీ భుజం మార్చు కోమంటుంది ||ఈ జీవనతరంగాలలో||
చరణం: 3
తాళి కట్టిన, మగడు లేడని..
తరలించుకు పోయే, మృత్యువాగదు..
ఈ కట్టెను కట్టెలు, కాల్చక మానవు..
ఆ కన్నీళ్ళకు, చితిమంటలారవు..
ఈ మంటలు, ఆ గుండెను, అంటక మానవు ||ఈ జీవనతరంగాలలో||
చిత్రం: జీవనతరంగలు (1973), సంగీతం: జె.వి.రాఘవులు, సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ
Movie: Jeevana tarangalu (1973), Music: JV Raghavulu, Lyrics: Acharya Atreya, Singer: Ghantasala, Actors: Shobhan Babu, Krishnamraju, Vanishree
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Jeevana Tarangalu padi masalu mosavu pillalanu e jivana tarangalaloa Shobhan, Krishnamraju, Vanishree
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,196; 104 తత్వాలు (Tatvaalu) and views 259,059 Dt : 25-Sep-2022, Upd Dt : 25-Sep-2022, Category : Songs
Views : 972
( + More Social Media views ), Id : 1535 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
jeevana ,
tarangalu ,
masalu ,
pillalanu ,
jivana ,
tarangalaloa ,
shobhan ,
krishnamraju ,
vanishree Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments