జర్నలిజం అంటే, వార్త రాయడం కాదు. తప్పో ఒప్పో చెప్పాలి - మేమే అజ్ఞాన విలేఖరి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1203 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1233 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

జర్నలిజం అంటే, వార్త రాసి చేతులు దులుపుకోవడము కాదు. అందులో ఉన్న అసలు విషయాన్ని విశ్లేషించి బయటకు తీసి, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పాలి.

ఎవరూ చేయని ఆపని, మేము చేస్తున్నందుకు, ఇక నుంచి మాకు మేమే అజ్ఞాన విలేఖరి అని, పేరు పెట్టి పిలుచుకుని నిరసన తెలియ చేస్తాము. ఎందుకంటే, ఈ క్రింది వివరాలు చూడండి.

* మన ప్రియతమ ముఖ్యమంత్రి, 2000 వేల మైళ్ళు పైగా నడచి జన హృదయాలు ను దోచి, ఎన్నికల్లో గెలిస్తే, ప్రభుత్వ పధకాల సమాచార ప్రచారం లో, జగనన్న కు అన్యాయం జరుగుతుందని 2 ఏళ్లుగా మొత్తుకున్నా, ఆంధ్రా 13 జిల్లా ల అధికారులు, గ్రామ పట్టణ జిల్లా స్ధాయిలో, సొంత సోషల్ మీడియా లో ప్రజా సమాచారం పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉంటే, దానిని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తూ గమ్ముగా ఉంటే, వారంతా జ్ఞానులు పెద్దలు. జగనన్న కోసం అడిగే, మేము అజ్ఞానులం.

* మా బజారు లో 10 ఏళ్లుగా, ప్రభుత్వ పంచాయితీ భూమి ని కబ్జా చేసి, షాపులు కట్టి అద్దెకు ఇచ్చుకుంటూ, పంచాయతీ ఆదాయానికి గండి పెడుతున్నా, పట్టించుకోని స్ధానిక నాయకులు పంచాయతీ అధికారులు, అలాగే కనీసం ఇతర ఇళ్లు దగ్గర కస్టమర్ ల బండ్లు పెట్టవద్దని, చెత్త వేయవద్దు అని, ఎవరికీ చెప్పలేని ధర్మం కాపాడలేని, మా బజారు ప్రజలు జ్ఞానులు. పంచాయితీ ఆదాయము పెంచడానికి అడిగే, మేము అజ్ఞానులం.

* చంద్రన్న కు ప్రకాశం అలాగే చీరాలలో అలాగే మిగతా చోట్ల పార్టీ నాశనమై పోతుంది, సోషల్ మీడియా అప్డేట్స్ లేవు అని, 2 ఏళ్లుగా మొత్తుకున్నా, అన్ని స్ధాయి ల నాయకులు విని చూసి, గమ్ముగా ఉన్నారు అంటే, వారు జ్ఞానులు. తెదేపా బాగుకోసం అడిగిన, మేము అజ్ఞానులం.

* వీరన్న కు పార్టీ లో ఒకరు కూడా సహకరించక, పార్టీ ని పాడు చేస్తున్నారు అని, నాయకులు పట్టణాలలో తిరగడం లేదని, స్ధానిక బీజేపీ సోషల్ మీడియాలో సమాచారం పెట్టడం లేదని,

అలాగే పవన్ ను ఎదగనీయకుండా, పార్టీ పనులు ప్రజల లోకి పోకుండా, స్ధానిక నాయకులు జనసేన సోషల్ మీడియాలో సమాచారం పెట్టడం లేదని, 2 ఏళ్లుగా చెప్పిన కూడా, బీజేపీ జనసేన వారు మారరు మార్చరు. కాబట్టి వారు బాగు కోరే, మేమే అజ్ఞానులం.

* చీరాలకు అన్యాయం జరుగుతుంది, కొత్త జిల్లా, చేనేత పార్కు, ఫిషింగ్ హార్బర్ ఇవ్వండి దయచేసి, అని 2 ఏళ్లుగా అడుగుతూ ఉంటే, ప్రతిసారి గుర్తు చేస్తూ, అన్ని పార్టీలు ను కోరుతుంటే, స్థానిక నాయకులు అధికారులు జనాలు ఎవరూ నోరు ఎత్తరు, సప్పోర్ట్ చేయరు. కాబట్టి చీరాల మంచి కోరే, మేమే అజ్ఞానులం.

* నాన్ ఐపీఎస్ అధికారులు కు కూడా, సమాన ప్రచారం మర్యాద గౌరవం లభించాలని, డీఎస్పీ అలాగే, సీఐ లేదా మండల స్ధాయి, సోషల్ మీడియా లో వారి సేవలు, త్యాగాలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని, 2 ఏళ్లుగా కోరుతుంటే, ఎవరూ ఉలకరు పలకరు. కాబట్టి, పొలీసుల మంచి కోరే, మేమే అజ్ఞాన విలేఖరులం.

* ముదుసలి తల్లి దండ్రులను అనాధాశ్రమము లో వదలద్దని, పిల్లలను సంస్కారం గా పెంచాలని, వడ్డీ వ్యాపారులు అసలు వడ్డీ జనాలకు తిరిగి ఇవాలని, మానసిక ధ్యానం చేయాలని, అరిషడ్ వర్గాలను జయించాలని, ఇలా ఎన్నో కోరికలు కోరాము కధనాలు రాశాము, మేమే అజ్ఞాన విలేఖరులం.

* ఇలాంటివి ఎన్నో మా 1000 పైగా ఉన్న, కధనాలలో, మీరు చూడవచ్చు.

ఇకనుంచి సిగ్నేచర్ దగ్గర, అజ్ఞాన విలేఖరి అని పెట్టుకుంటాము. పదిమంది గురించి మంచి అడిగే వారు, అజ్ఞాన విలేఖరులు, ఈ సమాజంలో ఈనాడు. ఎవరు వారికి సహాయం చేయరు, మారరు, మంచి వైపు మార్చరు. ఇదే కదా, ధర్మాన్ని కాపాడటం?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1233 General Articles, 47 Tatvaalu
Dt : 13-Mar-2021, Upd Dt : 13-Mar-2021, Category : General
Views : 181 ( + More Social Media views ), Id : 1027 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : journalism , writing , reporting , news , correct , wrong , ignorant , reporter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content