Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కమ్మటి సినిమా కమ్మటి పాటలు ఉన్న ఉత్తమ సినిమా, కుటుంబ సభ్యులు అందరూ కలసి చూడ గలిగే అద్భుత సినిమా, తీయగలిగిన ఉత్తమ దర్శకేంద్రుడు ఒకే ఒక్కరు, కె విశ్వనాథ్. ఆయనకు పాదాభి వందనాలు.
ఆయన సినిమాలకు హీరో హీరోయిన్ అన్నీ కధ నే, నటులు కాదు. కధలో పట్టు సినిమాను మొత్తము నడిపిస్తుంది ఆసక్తిగా కూర్చొపెడుతుంది. ఆయన ఖచ్చితముగా సాంప్రదాయాన్ని విలువలను పాటిస్తారు.
సినిమా కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు, ఆత్మ సంత్రుప్తి మరియు విలువలు తర్వాత తరాలకు నిలబెట్టడం కోసం ఆదర్శముగా ఉండాలి అనే మహానుభావుడు. అన్ని సినిమాలు సూపర్ హిట్ నే, తగిన ఆదాయం కూడా వచ్చింది.
మరి అలాంటి సినిమాలు ఎందుకు ఇతరులు తీయలేరో? ఆయన తర్వాత అలాంటి దర్శకుని మరలా పొందగలమా? ఇలాంటి ఉత్తమ గుణ సంపన్నులకు, అదే సినీ దర్శక యజ్ఞం కొనసాగించడానికి, వారసత్వ దర్శకులు ఉండాలి.
కంచికి పోతావా కృష్ణమ్మా అంటూ ప్రేమికుల మధ్యలో ఎంత బాగా ఎంత సున్నితమైన మాటలతో, దేవుడి పేర్లతో కలిపి ఎలా తీర్చి దిద్దారో. మీరే పాట చదివి, పాడి ప్రేమ సాహిత్యమో క్రిష్ణ సాహిత్యమో అది చెప్పగలరు.
తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా అంటూ ఆ క్రిష్ణ పరమాత్ముని సేవను ఎంత మధురముగా రాసి పాడి చుపించారో చూడండి. మనసు ఎంత తన్మయత్వములోకి వెళుతుంది ఈ పాట వింటే.
దేవునికి జరిగే వైభోగాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి - పాడేటి భూపాల రాగాలు, పన్నీటి జలకాలు పాలాభిషేకాలు, కస్తూరి తిలకాలు కనక కిరీటాలు... తీర్ధ ప్రసాదాలు దివ్య నైవేద్యాలు అంటూ, తప్పక మనసుతో మీరు పాడాలి, శ్వాస ఉపయోగం ఎటూ మీకు తెలుసు, సాత్విక మనసు కూడా పెరుగుతుంది, స్పందన కలుగుతుంది.
అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, ఆనంద నిలయా వేదాంత హృదయా,
మానవసేవ మహాయజ్ఞ మిది, సమిధవు నీవని తెలియుమయా - అంటూ వేదాంత రహస్యాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి.
1) కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ ఆ ఆ..ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ -2
ఊ..ఉఉఉ ఊ..ఆ ఆ ఆ ఆ హ హ
త్యాగరాయకీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ..రాగమేదో తీసినట్టు ఉందమ్మా 2
ఉ ఊ ఊ
ముసి ముసి నవ్వులు పూసిందీ కొమ్మ..మువ్వ గోపాలా..మువ్వ గోపాలా..
మువ్వ గోపాలా..అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వడి కావమ్మా అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా 2 ||కంచికి పోతావా||
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా..రాతిరేళకంత నిదుర రాదమ్మా 2
ముసిరిన చీకటి ముంగిట, వేచిందీ కొమ్మ..ముద్దుమురిపాలా..
మువ్వగోపాలా..నీవురావేలా..అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా..2 ||కంచికి పోతావా||
కంచికి పోతావా కృష్ణమ్మా.. ముద్దుమురిపాలా..
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా మువ్వగోపాలా..
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ నీవు రావేలా..
2) గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా 2
అందమైన యదు, నందను పై 2 కుందరదన లిరువొందగ పరిమళ..
గంధము పుయ్యరుగా... అందమైన యదునందనుపై
కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా
గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా
తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా 2
కళ కళమను ముఖ, కళ గని సొక్కుచు 2
పలుకుల నమృతము లొలికే స్వామికి
గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా 2
చరణం 1:
చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా 2
మాలిమితో గోపాల బాలురతో.. 2 ఆలమే.పిన, విశా.ల నయనునికి..
గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా 2
చరణం 2:
పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా 3
జాజులు.. మరి విరజాజులు దవనము 2 రాజిత త్యా.గ రా.జవినుతునికి
గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా
తిలకము దిద్దరుగా.. కస్తూరి.. తిలకము దిద్దరుగా
చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా
పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా
గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా
3) రాయైతే నేమిరా దేవుడు...2 హాయిగా.. ఉంటా.డు జీ.వుడు...
ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న, మహా.నుభా.వుడు... 2
చరణం 1 :
రేపొచ్చి పా.డేటి భూపాల రా.గా.లు...పన్నీటి జలకాలు పాలా.భిషేకాలు
కస్తూరి తిలకాలు.. కనక కిరీటాలు...
కస్తూరీ తిలకం లలాటఫలకే.. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు... పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
కస్తూరి తిలకాలు.. కనక కిరీటాలు... తీర్ధ ప్రసాదాలు.. దివ్య నైవేద్యాలు
ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు
రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం 2
అనాయాసయోగం అంటే ఇదే నాయనా.. అనంత వైభోగం ||రాయైతే నేమిరా||
చరణం 2 :
బృందావనిలో లీలా విలాసాలు... అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు 2
ఇవన్నీ నాకు(వారికి) జరగాలని కోరుకోరా నాయనా... నువ్వంటే జరుగుతుంది
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... నువ్వంటే నాకు(వారికి) దక్కురా 2
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... స్వాతంత్రం జన్మ హక్కురా 2
భావి భారత, వీర పౌర, భయము వీడి సాగిపోరా... ||రాయైతే నేమిరా||
4) పల్లవి
అసతోమా సద్గమయా - తమసోమా జ్యోతిర్గమయా
ఆనందనిలయా - వేదాంత హృదయా 2
చరణం 1
ఆత్మ దీపమే వెలిగించుమయా, అంధకారమే తొలగించుమయా ||ఆనంద||
దీనజనావన దీక్షాకంకణ ధారణమే, నీ ధర్మమయా ||ఆనంద||
చరణం 2
సిరులకు లొంగిన, నరుడెందుకయా . . .పరులకు వొదవని, బ్రతుకెందుకు కయా . . .
ఆనందనిలయా - వేదాంత హృదయా ||ఆనంద||
చరణం 3
కర్మయోగమే ఆదర్శమయా, జ్ఞానజ్యోతిని దర్శించుమయా ||ఆనంద||
మానవసేవమహాయజ్ఞమిది, సమిధవు నీవని తెలియుమయా
చరణం 4
కోవెల శిలకు కొలుపెందుకయా, నీ వెల తెలియని నీవెందుకయా ||ఆనంద||
[పల్లవి] అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా
ఆనంద నిలయా - వేదాంత హృదయా
మానవసేవ మహాయజ్ఞ మిది, సమిధవు నీవని తెలియుమయా
చరణం 5
కోవెల శిలకు కొలుపెందుకయా, నీ వెల తెలియని నీవెందుకయా ||ఆనంద||
[పల్లవి] అసతోమాసద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
ఆనంద నిలయా - వేదాంత హృదయా
Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,
Actress : Sulakshana / సులక్షణ ,
Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,
Lyrics Writer : Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి ,
Singer : P.Suseela / పి. సుశీల, Sp balu / యస్ పి బాలు ,
K Vishwanath/ Subhodayam కె విశ్వనాథ్/ శుభోదయం
K Vishwanath Subhodayam kanchiki potava gandhamu puyyaruga rayaite nemira devudu asatoma
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,597; 104 తత్వాలు (Tatvaalu) and views 254,500 Dt : 28-Jun-2022, Upd Dt : 28-Jun-2022, Category : Songs
Views : 965
( + More Social Media views ), Id : 1445 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
vishwanath ,
subhodayam ,
kanchiki ,
potava ,
gandhamu ,
puyyaruga ,
rayaite ,
devudu ,
asatoma Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments