జనం మారరు అని తెలిసి, ప్రయత్నం చేస్తాను, అనడం మూర్ఖం కాదా? వాళ్ళు తిట్టరా, ఈసడించుకోరా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*జనం మారరు అని తెలిసి, ప్రయత్నం చేస్తాను, అనడం మూర్ఖం కాదా? వాళ్ళు తిట్టరా, ఈసడించుకోరా, అవమానించరా, గేళి చేయరా, పలకకుండా స్పందన లేకుండా, గమ్ముగా నిర్లక్ష్యం గా ఉండరా?*

ధర్మాన్ని కాపాడు, అది మనల్ని కాపాడుతుంది అంటూ ఓ వైపు నటిస్తూ ఆచరించకుండా నే, మనుషులము మనమే కనీస ప్రయత్నం చేయకపోతే, జంతువులు చేస్తాయా? అప్పుడు మనం, భక్తులమా లేక నటశిరోమణులమా? మన అర్హత, మన సాధన కూడా చెప్పలి కదా?

ఒకరిని మార్చడం తర్వాత, ముందు మనం మారకుండా ఉండాలి అంటే, ఏదో ఒక సాధన చేస్తూ ఉండాలి, దాచుకోకుండా నలుగురికి నేర్పాలి కదా?

మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు, ఒక మంచిని మంచి అనలేరు, చెడును చెడు అనలేరు, నోరు పెగలదు, చేతి వేళ్ళు కదలవు. పిల్లలను దోవలో పెట్టలేరు. వారి గురించి ఒక్క మంచి మాట, ఒక్క సాధన కూడా చెప్పరు.

సంపాదన సుఖాలు స్వార్ధం మాత్రమే వారికి కావాలి. 3 ఏళ్ళ నుంచి ప్రతి నమస్కారం, ప్రతి శుభాకాంక్షలు చెప్పడం రాని, సంస్కార జీవులు కూడా ఉన్నారు. గుడి కి బొట్టు తో రావాలని కూడా తెలీదు. హోదా అధికారం ఐశ్వర్యం శాశ్వతం కాదని వారే చెపుతారు పైకి మరలా.

కన్న ముదుసలి తల్లి దండ్రులనే, దూరంగా విదిలించి, తమ స్వార్ధ సుఖం చూసుకునే, అధములు ఉన్నారు.

ఆ జీవచ్చవాలను, ఎవరు కదిలిస్తారు? జంతువులా, పక్షులా, క్రిములా, రోగమా, మ్రుత్యువా, మనమా?

వారి పిల్లలకు సంస్కారం ఎలా నేర్పుతారు, ప్రాపంచిక మత్తులో జోగుతూ? తోటి వారి గురించి, జాలి పడాల్సింది మనమే కదా? అవకాశ అవసర కోటీశ్వరులకు, స్వార్ధం లేకుండా సమయం మనసు మమత ఉండదు, కాబట్టి భక్తులే ఆ ప్రయత్నం చేయాలి, కదా?

అందుకే పురాణాలు, గీత చదవమనేది. మూర్ఖపు కౌరవుల మంద దగ్గరకు రాయబారానికి వెళితే, వారు వినరు మారరు తిడతారు కొట్టబోతారు అని, క్రిష్ణునికి తెలీదా? ఎందుకు వెళ్ళారు? ఆయనకన్నా మనము జ్ఞానులమా?

ముందు మెత్త గా, తర్వాత కటువుగా కఠినంగా ఎందుకు చెప్పారు? ఆ మంద బుద్దులకు ఆనాలి అనే కదా? వారు ఆయననే దూషించలేదా? పట్టి బంధించబోలేదా? అదే గీతా సారాంశం, ప్రయత్నం చెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి.

మార్చడానికి ప్రయత్నం చేస్తూ, మనం మోహం లో పడి, మనమే మారి పోకుడదు వారి లాగా, సహవాస దోషం తో జాగ్రత్తలు సుమా. అందుకే, శ్రీ క్రిష్ణుడు ఏనాడూ, కౌరవుల తో కలసి తిరగలేదు, వారి ఇంట, భోజనం నిద్ర కూడా ఉండదు.

ఆఖరికి రావణ యుద్దము లో కూడా, శ్రీ రాముడు నీతి చెప్పి, రావణుని మంచి ఆలోచన చేసి రేపు రమ్మని పంపాడు. శ్రీ రాముడికి తెలీదా, రావణుడు మారడని?

మరి మన మాటలు కటువుగా ఉంటే, వారి పనులు చేష్టలు కటువు గా లేవా? అమ్మ అయ్య చెపితే వినరు, భాగస్వామి చెపితే వినరు, పక్క వాడు చెపితే వినరు, పూజారి చెపితే వినరు. అందుకే కరోనా, రోగం, యముడు చెపితేనే వింటారు కదూ? వీరు పోతే, వారి పిల్లల పరిస్తితి? చుట్టూ విషం గక్కుతూ తగలబడుతుంటే, మనం మాత్రం ప్రశాంతము గా ఉండగలమా?

చేసే మంచి పని నిస్వార్ధం గా చిత్తశుద్ది తో చెయ్యి. ఇతరుల తిట్లు కోపాలు పొగడ్తలు ఫలితాలు అన్ని ఆ దేవునికే, మనం నిమిత్త మాత్రులం. రాముని, క్రిష్ణుని నిజముగా నమ్మితే, మంచి చెప్పడం చెయ్యడం ఆచరించడం ప్రాణం పోయినా మానము. అదే కదా త్రికరణ శుద్ది అంటే?

Knowing people will not change, I will try, isnt it foolish? Dont they scold, insult, tease  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 03-Jun-2022, Upd Dt : 03-Jun-2022, Category : General
Views : 176 ( + More Social Media views ), Id : 1416 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : people , change , sadhana , foolish , scold , insult , tease
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content