లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి - ఇంద్రుడు చంద్రుడు - కమల్ హాసన్, విజయశాంతి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1618 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1653 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గుర్తు పెట్టుకోండి, మల్లెపూవు వాసన, మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా ఒకటే. కపట నటన మనుషుల ప్రవర్తన అలా ఉండదు సుమా.

సంపాదన, అధికారం, హోదా పెరిగితే, మనుషులు అరిషడ్వర్గాలకు బానిసలై, అహంకారముతో, మానవత్వం మరచి, ఎలా రాక్షసులుగా మారి, ఇంట్లో వారినే అంటే భాగస్వామి ని, పిల్లలను ఎంత రాచి రంపాన పెడతారో, ఈ చిత్రములో స్పష్టముగా చూపెడతారు. ఇంట్లో వారినే బాధలు పెట్టే వారు, ఇంక బయట మనుషులను పురుగుల్లాగా చూస్తారని, మనము వేరే చెప్పక్కరలేదు.

కానీ పులి, పాము, నక్క బుద్దులు ఉన్న మనము, మనకన్నా ఈ వంకర చెడు లక్షణాలు ఎక్కువ ఉన్న ఉత్తముని ఏరి కోరి, 3 పార్టీల దగ్గర ఏదో ఒకదానికి అమ్ముడుబోయి, చివరకు ఒకరికి ఓటు వేస్తాము. మరి పులి పాము నక్క మనల్ని నాశనం చేయకుండా, వారు కోట్లు వెనకేసుకోకుండా, అన్ని పధకాలకు తమ కుటుంబ పేర్లు పెట్టుకుంటూ, తమ స్వార్ధం కోసం రాష్ట్రాలు జిల్లలు దేశాలు విడగొడుతూ, మన బాగు ఎందుకు చూడాలి, ఎందుకు చూస్తారు?

అందుకే కరోనాకు ఇతర రాష్ట్రాలకు పరుగులు, మధ్యలో ఎన్నో ప్రాణ త్యాగాలు. మానవత్వం మరచిన ఓటర్లు, రాక్షసులను ఎన్నుకుంటే, ఎలా ఉంటుందో కపట మాయ పాలన ఈ చిత్రములో చూడవచ్చు. మనలాంటి అమ్ముడుబోయే తప్పుడు ఓటర్లపై, దేవుడు జాలి చూపించాలా?

కానీ అలాంటి ఓ నాయకుడు అంటే మన లాంటి తండ్రికి, చివరికి అన్ని పోగొట్టుకున్నాక, తాను పతనము అయ్యాక, కుటుంబ విలువలు గుర్తుకు వచ్చి, కన్న కూతురు దగ్గర ఏడుస్తూ, పాడే పాట ఇది. మన ఇళ్ళలో కూడా, ఇలాంటి మానవత్వం మరచిన సంపాదనే ధ్యేయముగా, ఇతరుల బతుకులను నాశనం చేస్తోన్న ఎంతో మంది, మేక వన్నె పులులు ఉన్నారు. తస్మాత జాగ్రత్త. ఈ చిత్రములో లావు పొట్ట వేసుకుని, బొంగురు బండ గొంతుతో కమల్ నటన అద్భుతం, ఇలాంటి పాత్రలు ఇంకొకరు చెయ్యలేరు.

పాట అందరూ పాడతారు, కానీ సామాజిక వివరణ రాయలేరు.

లాలి జో, లాలి జో, ఊరుకో పాపాయి
పారిపోనీకుండా, పట్టుకో నా చేయి - 2 సార్లు మొత్తము
తెలుసా... ఈ..ఊ..సు
చెబుతా.. తల.ఊ..చు
కాపురం చేస్తున్న, పావురం ఒకటుంది
ఆలినే కాదంది, కాకినే కూడింది

అంతలో ఏమైంది, అడగవే పాపాయి
పారిపోనీకుండా, పట్టుకో నా చేయి, ఉమ్మ్ .. ఉమ్మ్ ..

ఆ తర్వాత శాంతి ఎక్కడ, మనశ్శాంతి ఎక్కడా..
భయమేస్తుందా. . . ఉమ్మ్ .. ఉమ్మ్ ..

మాయనే నమ్మింది, బోయతో పోయింది
దెయ్యమే పూనిందో, రాయిలా మారింది
వెళ్ళే... పెడదా.రిలో..
ముళ్ళే... పొడిచాకనే..
తప్పిదం తెలిసింది., ముప్పునే చూసింది.
కన్నులే విప్పింది., గండమే తప్పింది.
ఇంటిలో చోటుందా, చెప్పవే పాపాయి
పారిపోనీకుండా, పట్టుకో నా చేయి

పిల్లలూ ఇల్లాలు, ఎంతగా ఏడ్చారో
గుండెలో ఇన్నాళ్ళూ, కొండలే మోశారు
నేరం.. నాదైనా..
భారం.. మీ పైన..
తండ్రినే నేనైనా, దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు, మెల్లగా దండించు
కాళిలా మారమ్మ, కాలితో తన్నమ్మా
బుద్ధిలో లోపాలే, దిద్దుకోనీవమ్మ

Lali Jo Lali Jo Uruko Papaee, Indrudu Chandrudu, Kamal Hassan, Vijayashanti

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1653 General Articles, 61 Tatvaalu
Dt : 05-Oct-2022, Upd Dt : 05-Oct-2022, Category : Songs
Views : 84 ( + More Social Media views ), Id : 1565 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lali , jo , uruko , papaee , indrudu , chandrudu , kamal , hassan , vijayashanti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content