ఎప్పుడూ నాయకులు, అధికారులు ది తప్పు కాదు. తప్పు, బాధ్యత గా ఓటు వేయని . . . - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,813; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒక బాధ్యత గల పౌరుని ప్రశ్న, ఏమండీ బాగా రాశారు, ప్రస్తుత మరియు మాజీ ఎమ్మెల్యే ల ను, ఆ పది అభివృద్ధి పనులు బాధ్యత గురించి, అలాగే అడగాలి అని.

జవాబు, ఇది ఏ ఊరుకైనా వర్తిస్తుంది. గురువు గారు, ఎమ్మెల్యే ల ను అడగడం కాదు, మనల్ని మనం అడుక్కోవాలి అవే ప్రశ్నలు. నాయకులు మరియు అధికారులు అంటే ఎవరు, మనలో ని వారే కదా? మనం బాధ్యత గల పౌరులమా? ధన, కుల, మత, వర్గ, ప్రాంత, అవసరాలకు లొంగకుండా ఓటు వేశామా? ఇకనైనా వేస్తామా?

మొదటి నుంచి, మా మాట ఒకటే, తప్పు అధికారులు నాయకులు ది, ఎప్పుడు కి కాదు. ఎప్పుడూ, తప్పు అంతా ప్రజల మైన మనదే. విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి వస్తుందా?

జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో, ఆరోగ్య అధికారి, సీఐలు చేత సోషల్ మీడియా లో అభివృద్ధి పనులు పెట్టించలేక పోవడం, మన ఎమ్మెల్యే, ఎంపీ ల చాతకాని తనం. జగనన్న కు, ప్రజలకు, మరియు ప్రభుత్వం కు వారు కలసి తెలిసి చేస్తున్న ద్రోహం. ప్రతిపక్షాలు కూడా అడగవు, ఎందుకు సోషల్ మీడియా లో పెట్టరు అని.

మరి మనం చాతగాని వారం కాదా? అవి ఎందుకు చేయడం లేదు, చేపియ్యడం లేదని, అడుగుతామా నాయకులు ను? ధర్నా చేస్తామా? అర్జీలు పెడతామా? చేయము గాక చేయము.

అదే సినిమా టిక్కెట్లు, మందు, ఆన్లైన్ గేమ్స్, జూదం, చెడు వ్యసనాలకు సంబంధించినవి దొరకకపోతే, చైతన్యంతో ధర్నా లు ఉంటాయి, సోషల్ మీడియా కామెంట్స్ ఉంటాయి, పక్క రాష్ట్రం వెళ్ళి 3 సీసాలు తెస్తాము కానీ, మంచి పనులు కు ఆ ఉత్సాహం ప్రోత్సాహం ఉండవు కదా.

ఇప్పుడు ఆ ఇద్దరూ నాయకులు ముసి ముసి నవ్వులు నవ్వుతూ, మన అందరినీ ఇలా తిరిగి ప్రశ్నించారు అనుకోండి, ఉదాహరణ కు, మరి మన జవాబు? తెల్ల మొఖము వెయ్యడమే కదా?

మాజీ ఎమ్మెల్యే గారు గనుక, ఆ పది పనులు, పది ఏళ్లుగా నేను చేయించ లేదు. మరి మీరు నాకు ఇంకా ఓట్లు వేస్తున్నారు అంటే, మీ అంత వెర్రి నాగన్నలు, ఎక్కడ అయినా ఉంటారా? మీకు అభివృద్ధి అంటే తెలుసా, అవసరమా? అని అడిగితే, మన జవాబు, సిగ్గు తో తలదించుకోవడమే కదా.

ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా, అలాగే మనల్ని ప్రశ్నిస్తే? నా ఇన్నాళ్ల గత నియోజకవర్గ ప్రజలు, నన్ను తిరస్కరించారు, తగిన అభివృద్ధి పనులు చేయలేను అని. అయినా, మీరు ఇక్కడ ఈ నియోజక వర్గములో నన్ను నెత్తిన పెట్టకున్నారు. చంద్రన్న, అక్కడ ఈయన పనికిరాలేదు, ఇక్కడ మాత్రం మీకే పనికి వస్తారు అంటే, గుడ్డిగా నమ్మారు, బోర్లా పడ్డారు సంవత్సరముగా. చంద్రన్న ను, విడిచాను తాత్కాలికముగా.

ఈ పార్టీ కూడా, నా గత వైభోగము సంగతి తెలిసి ఆహ్వానించింది. సంవత్సరం గా మీ ఊళ్ళో నివాసము లేను. మీకు కించిత్ బాధ లేదు. మీకు అభివృద్ధి గురించి అవసరమా? మీరు వెర్రి నాగన్నలు కాదా? అంటే మన జవాబు ఏమిటి? సిగ్గుతో తల దించుకోవడమే కదా.

కాబట్టి, ఎప్పుడూ నాయకులు ది , అధికారులు ది తప్పు కాదు. తప్పు అంతా, బాధ్యత లేని ఓటు వేయని, మనలాంటి ప్రజలదే. కాబట్టి, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడైనా మారదాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,813; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101
Dt : 04-Sep-2020, Upd Dt : 04-Sep-2020, Category : Politics
Views : 681 ( + More Social Media views ), Id : 677 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaders , officials , not wrong , public , wrong , voting , responsibility
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content