గురువారం స్ధానిక గురువు ను తలచుకుందాం - తేట తెలుగు లో వేమన వచన పద్య రూపం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,628; 104 తత్వాలు (Tatvaalu) and views 225,612.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గురువారం, గురువు ను తలచుకుందాం. మరి ఏ గురువు ను తలచుకుందాం? అందరికీ ఇదో పెద్ద ప్రశ్న. భౌతిక, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక, అవకాశవాద, అవసర, స్ధానిక, పర రాష్ట్ర, పర భాషా, విదేశీ గురువులలో ఎవరిని తలచుకోవాలి అని పెద్ద ప్రశ్న.

ఈ రోజుల్లో ఎంత దూరం వెళ్ళ గలిగితే, అంత ఫాషన్, అంత గొప్ప. ఖచ్చితము గా మన గురువుకి తెలుగు రాకూడదు, పుట్టుపూర్వోత్తరాలు తెలియకూడదు, వారు ఎటువంటి భాషా లేదా హైందవ సేవ చేసి కావ్యాలు పద్యాలు కాలజ్ఞానం రాసి ఉండకూడదు, మనలాగే గమ్మున కూర్చుని ఉండాలి, అని చాలా మంది ఉద్దేశ్యం.

కృష్ణయ్య, వ్యాసుడు, వాల్మీకి, శంకరాచార్య, రామానుజులు, వీళ్ళు మనకు ఆనరు పాతబడ్డారు పండగలకు చాలు, ఇప్పటి మాయా ప్రపంచంలో. కొత్త వింత, పాత రోత, విలువ తక్కువ, ఎందుకంటే మనకు అజ్ఞానము దురాశలు ఎక్కువ.

మరి ఆ తర్వాత కొత్త గురువు కావాలి, ఎవరు మరి? తల్లి దండ్రుల మాట, గౌరవించేవారు ఎటూ తక్కువ, ఈ రోజుల్లో. ఎందుకంటే, సంస్కారం నేర్పడానికి, వారికీ తీరిక లేదు సంపాదన ప్రాపంచిక మోహములో. చివరలో ఒంటరిగా అనాధలుగా విశ్రాంతి గా ఉంటారు కన్నీళ్ళతో, అచ్చటా ముచ్చటా లేకుండా, ఎందుకు పెళ్ళో ఎందుకు పిల్లలో వారికీ తెలీదు.

మనకు అంటే తెలుగు వారికి, ఎప్పుడూ మన సొంత ఇంటి కూర నచ్చదు, పొరుగింటి పుల్ల లేదా సద్ది కూర కూడా, అద్భుతమైన రుచే. ప్రచారం లేని మన తెలుగు గురువు, మనకు నచ్చరు ఆదరించము, ప్రపంచ భ్రమలలో మునిగి. ఏ గురువైనా ఒకటే అంటే, మరి స్ధానిక గురువు తోనే వెళ్ళవచ్చు కదా?

కానీ వెళ్ళలేము, మాయలో చిక్కిన మనసు ఒప్పుకోదు. సొంత అమ్మ ను ఆదరించము గానీ, పిన్ని ని ఆదరిస్తున్నాము అంటే, మన ఆదరణలో లోపం మోహం భ్రమ మాయ నాటకం ఉందనేగా?

మన మాతృ భాషలో నే వేదాంతం ని, తేట తెలుగు లో చెప్పిన, దగ్గర స్ధానిక గురువు ను తలచుకుందాం. ఎవరు మరి ఆయన? ఇంకెవరు, మన యోగి వేమన. శివ భక్తుడు.

వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని, తెలుగువారు ఉండరని లోకోక్తి.

వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించారు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.

ఆంగ్లేయుడు, సి పి బ్రౌన్ చెప్పిన ప్రకారం, ఇతను జంగమ కులానికి చెందిన శివకవి. రెడ్డి/ కాపు అని వివిధ పరిశోధనలు. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు.

బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839 లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించారు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చారు.

ఆట వెలదిని ఈటెగా విసిరిన దిట్ట/ ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట.

విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటం అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

1. వేమన ప్రేయసి విశ్వదను, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.

2. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని పండితులు ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు.

* శ్రీశ్రీ ఇలా అన్నారు - కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ
* రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ - వేమన కవిత్వం గాయపు మందు, గాయానికి కాక, కత్తికే పూసినట్లుండును

సర్వ భోగాలు, ఐశ్వర్యాలు వదలి, చిన్న పేలిక గుడ్డ ధరించి, భగవంతుడు ఆది గురువు కృష్ణయ్య భగవద్గీత సారాన్ని, తేట తెలుగు లో, వచన పద్య రూపంలో చెప్పిన ఆచరించిన, ఆధ్యాత్మిక తాత్విక వేత్త. ఆ పద్యాలు కు, మరలా అర్థం రాయాల్సిన అవసరం లేదు.

ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు మహాసమాధి చెందారు.

ఈ 5 పద్యాలు, అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టి, నలుగురుకి చెప్పగలిగితే, ఇక దైవ గమ్యం చేరేందుకు ఉపయోగపడే, పూజలు పునస్కారాలు అనే సాధారణ దోవ, మనకు అవసరం లేదు.

నిశ్చలమైన పర బ్రహ్మ ను, మన మదిలో నే చూడవచ్చు ను కదా. వినండి, మీరూ నేర్చుకొని, ఆచరణలో పెట్టగలరు. మనం పాటించకుండా చెపితే, జనం ఒప్పకోరు కదా.

పాటించు, పదిమంది కి చెప్పు. భూమికి పాప భారం తగ్గించు.

1. కాదు కాదు గురులు కా గుణింతము చెప్ప
శాస్త్ర పాఠములను చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలంబు గురువు రా
విశ్వధాబిరామ వినురవేమ....

అర్ధము - ఆధ్యాత్మిక గురువు అంటే కా గుణింతములు నేర్పడం, శాస్త్ర పాఠాలు చదివి చెప్పడం కాదు, గురువు కోరికలు తీర్చరు.

కేవలము దేవుని వైపు, అంటే ముక్తి కి దారి చూపే వారే, ఆధ్యాత్మిక గురువులు.

వ్యాసుడు, వాల్మీకి, ఆది శంకరులు, బ్రహ్మం గారు, రాఘవేంద్రస్వామి, వేమన, ఆ పరమేశ్వరుని అంటే శివుడు విష్ణువు ను ఎలా పొందాలో, రాతలలో పాటలలో చేతలలో, దోవ చూపారు.

2. ఆలు సుతులు మాయ యన్న దమ్ములు మాయ
తల్లి దండ్రి మాయ తాను మాయ
తెలియనీదు మాయ దీనిల్లు పాడాయె
విశ్వధాబిరామ వినురవేమ....

అర్ధము - భార్య పిల్లలు అన్న దమ్ములు తల్లి దండ్రులు, ఈ బంధాలన్ని యూ మాయనే, అంటే అశాశ్వతమే. వచ్చేటప్పుడు తోడు లేవు, పోయేటప్పుడు వెంట రావు. వీటి కోసము, ఎన్నో మోసాలు ఘోరాలు చేసి, కాలాన్ని జీవితాన్ని వయస్సును వ్రుధా చేస్తూ, ఇతరులను నిందిస్తు బాధపెడుతూ, అశాశ్వతమైన, అధికార సంపాదన ఆనందాల, మత్తులో మునిగేవు. సంసారము లో ఉన్నా, తామరాకుని నీరు ఎలా అంటదో అలా ఉండాలి.

అసలు మనము కూడా మాయ నే కదా, ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. రోజులు గడిచేకొద్దీ, మ్రుత్యువు సమీపిస్తుందని మరచేవు. రేపు మనది కాదు. కాలుడికి, మనమీద మన తప్పుల మీద ఎటువంటి జాలి ఉండదు. ముదుసలి తనములో, అవయవాలు పట్టుతప్పినాక, దైవ స్మరణ చేయలేవు.

ఈ బంధాల మాయలో పడి, శాశ్వత నిజ స్వరూపాన్ని, అంటే పరమాత్మ బంధాన్ని మరచి, నీ అసలు ఇల్లు శాశ్వత ఉచిత ఆనందాన్ని పాడుచేసుకుంటున్నావు. ఇప్పుడు ఉన్న ఇల్లు దేహన్ని రోగాలు రొప్పులతో నాశనము చేసుకుంటున్నావు.

3. శిలను ప్రతిమ చేసి చీకటిలో బెట్టి
మ్రొక్కవలవ ది కను మూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభి రామ వినురవేమ....

అర్ధము - మూర్ఖముగా రాయిని ప్రతిమ గా చేసి, చీకటిలో పెట్టి, ఊరక మొక్కవద్దు. అది మొదటి మెట్టు మాత్రమే. జ్ఞానవంతుడవయ్యే కొద్దీ, పసిబిడ్డి చక్రాల నడక బండిని వదిలిన విధముగా, మన అందరి హ్రుదయములో ఉన్న పరబ్రహ్మము అనే దేవుని, రోజూ కనీసము 30 నిమిషాల ధ్యానం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

చిత్తశుద్ధి లేని భక్తి, చిత్తము లేని విగ్రహ పూజ వలన, ఫలము లేదు. అంటే ముందు మనము సంస్కారముతో సాధనతో, మన కోతి మనసును అదుపులో పెట్టుకోవాలి. అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు దూరముగా ఉండాలి. మాటలు ఆలోచనలు పనులు, ఈ మూడుటికి పొంతన ఉండాలి. నటన ఉండకూడదు.

జన్మతహా వానరుడైన ఆంజనేయుడు మనసుపై పట్టు సాధించి, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించి న తర్వాతనే, రామయ్య తండ్రిని కలిసారు. అతి చిన్న వయసులోనే ప్రహ్లాదుడు, మనసులో పరమాత్మను ద్రుఢముగా నిలిపాకనే, అన్ని కష్టాలను భరించినాకే, శ్రీహరి నరసిమ్హావతారములో వచ్చి రక్షించారు.

4. ఏది కులము నీది ఏది మతంబురా
పాదుకొనుము మదిని పక్వ మెఱిఁగి
ఆదరించుచు దాని యంతము దెలియుము
విశ్వధాబిరామ వినురవేమ....

అర్ధము - కులము, మతము, జాతి, ప్రాంతము అని ఊరక మాటలు గొప్పలు చెపడం కాదు. దానికి చెందిన వ్రుత్తి ని, మంచిని నేర్చుకుని, దాని యందు మంచి పట్టు కలిగి ఉండి, ఆచరణలో దానిని చూపాలి.

ఉదాహరణకు నేను బ్రహ్మణుడిని అని చెప్పెటప్పుడు, వేదాలు పురాణాలు ఆచారాలు సంస్కారము బుద్ది, పక్షపాతం లేకుండా తప్పు ఒప్పు ధైర్యముగా చెప్పాలి, ఆచరణలో చూపాలి, మాటలలో చెప్పగలగాలి.

నేను క్షత్రియుడను అనేటప్పుడు, రాజ్యం కోసం ప్రజల కోసం, నిస్వార్ధముగా పోరాడి ప్రాణాలు ఇవ్వడానికి, కోరిన వారికి ధన సహాయం చేయడం కు, సిద్దముగా ఉండాలి.

తెలుగు వాడిని అని చెప్పేటప్పుడు, తెలుగు సోషల్ మీడియాలో రాయడం, పలకడం, తెలుగు గురువులను గౌరవించడం వచ్చి ఉండాలి.

ఇంటి పనికి పనికి వచ్చే, ఆస్తులు ఇచ్చే, వయస్సులో ఉన్న అమ్మా నాన్న అంటే ఇష్టం అనడం కాదు, వారిని ముదుసలి తనములో గౌరవముగా దగ్గర పెట్టుకుని, నోటిలో ప్రేమ గా ముద్ద పెట్టాలి కదా?

5. తత్త్వములలోన పరమాత్మ తత్త్వ మెఱిఁగి
నిత్యనిర్ముక్త పరిపూర్ణ నిలయమంది
సరి పరబ్రహ్మ మయమని సంచరించు
నతడె విజ్ఞాని, పరశివు డతడే వేమ!

అర్ధము - తత్వములలోన పరమాత్మ తత్వము తెలుసుకుని, రోజూ మనసులో దైవాన్ని నిలకడగా ధ్యానం లో నిలిపి, నేనే పర బ్రమ్మాన్ని అని ఆచరణలో, దేవుని గుణాలను చూపునటువంటి వాడే, జ్ఞాని విజ్ఞాని, మాయకు లొంగడు, అతడే దేవుడు అతడే శివుడు.

అంటే త్రికరణ శుద్దిగా, దైవ గుణాలను ఆచరణలో చూపితే, నలుగురికి ఆదర్శముగా ఉంటే, నిస్వార్ధముగా నులుగురి మంచి కోరితే, ఆ నరుడే ఆ దైవ నారాయణుడు.

అందుకు ఉదాహరణ రాముడు, క్రిష్ణుడు, బుద్దుడు, ఆది శంకరులు, వాల్మీకి, వ్యాసులు, బ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి, వేమనలే కదా.

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

Vemana padyalu, Kadu kadu gurulu, Alu sutulu maya, Silanu pratima chesi, Edi kulamu nidi, Tatvamulaloana paramatma  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,628; 104 తత్వాలు (Tatvaalu) and views 225,612
Dt : 03-Dec-2020, Upd Dt : 03-Dec-2020, Category : Songs
Views : 1497 ( + More Social Media views ), Id : 834 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : local , guru , Thursday , telugu , yogi , vemana , song , poem , brammam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content