Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. 60 దాటిన ముదుసలి అమ్మ నాన్న లను తెచ్చి, ఇంట్లో ఉంచుతాను అంటే, ఇష్టము లేక అలిగి వెళతాం అంటున్నారు. అది అన్యాయం కాదా? మరి దీనికి పరిష్కారం?
గురువు గారు, మీ నిజాయితీ నచ్చింది. ఎందుకంటే మిగతా వారు, ఎన్నో అబద్ధాలు చెపుతున్నారు, వారు రారు, ఇక్కడ ఉండరు నచ్చదు, తిండి పడదు, గాలి మరియు మనుషులు నచ్చరు అని , . . .
కానీ ప్రతి విషయానికి, ముందు వెనుక కూడా, ఆలోచన చేయాలి కదా. దొరికిన దొంగ బాధ పడతాడు, పోలీసులు పట్టుకున్నారు, ఇబ్బంది పెట్టారు అని. మరి అతను చేసిన దొంగ తనం గురించి మాత్రం చెప్పడు, తప్పు ఒప్పుకోడు. అంతే కదా నేటి లోకం తీరు.
మరి మనం చేసిన, అన్యాయం గురించి ఎవరు చెప్పరే? గత 50 ఏళ్లుగా, ఏ పెళ్లి అయినా, కేవలం గుణ గణాలు, బంధుత్వం, మంచితనం సాంప్రదాయం చూసి, రూపాయి కట్నం లేకుండా, స్వార్థం లేకుండా, చేసుకుని ఉన్నాయా? 80 శాతం లేవు. కల్యాణ మండపాలు ఖాళీ లేవు, విడాకుల కోర్టులు ఖాళీ గా లేవు. అసలు పెళ్ళి అంటే భయపడే స్థాయికి వచ్చి, సహజీవనము తో ముందుకు పోతున్నారు లేదా ఒంటరిగా ఉంటున్నారు.
బీదవారిని లేదా తమ కంటే తక్కువ ధనం కలవారిని, నోరెత్తరు పడి ఉంటారని, కుసంస్కారము తో చేసుకున్నా, ఆ తర్వాత రోజులు మారాక, వాళ్ళు అడ్డం తిరిగి, తల బొప్పి కట్టిన వారూ ఉన్నారు. వయస్సు పైబడినది అనో లేక ఇంకో మోహం లోనే, తొందరపడి, నష్టపోయిన వారూ మరియు ఇంకా సర్ధుబాటులో ఉన్న వారూ ఉన్నారు.
ఇప్పుడు పెళ్లి అంటే, కేవలం ఉద్యోగం, విదేశం, ఆస్తి, కట్నం, అధికారం, అవసరం, మోహం వ్యామోహం కోసం తప్ప, బంధానికి అనుభందానికి, మమతాను రాగాలకు విలువ లేదు.
లక్ష్మీ నారాయణులు లాగా సీతా రాములు లాగా, లవ కుశులు లాంటి ఉత్తమ జాతి రత్నాలను లక్ష్మి సీతమ్మ వంటి మహాలక్ష్మిలను కందామని, ఆలోచన ఎవరికీ లేదు అవసరము అని కూడా అనిపించడము లేదు. అంటే, అప్పుడు మన తల్లి దండ్రుల భవిష్యత్, మన భవిష్యత్తు గుర్తుకు రాలేదు, రాదు కూడా కదూ? చిత్రం ఏమిటి అంటే, మన తల్లి దండ్రులు కూడా, ముందు చూపుతో ఉండక, కేవలం అప్పుడు ఆ అవసరం, సమాజ గొప్ప లు వైపే చూస్తారు, ఇంకా చూస్తున్నారు.
మరి పరిష్కారం? ఇప్పుడు అయినా, తప్పులు ఒప్పుకుని, పశ్చాత్తాపం పడి, కాళ్ళు పట్టుకుని అయినా, జీవిత భాగస్వామి (ఆడ లేదా మగ) ని, వారి వైపు వారిని, పెద్దలు కు, నచ్చ చెప్పి, ఒప్పించాలి. ఒంటరి ప్రేమ పెళ్లి లో, ఈ అవకాశం కూడా ఉండదు .
అలా కాకుండా, ఇంట్లో వాళ్ళ కి చెప్పకుండా, తెచ్చి పెడితే, అమ్మా నాన్న లు పడే నరకం బాధ కు, మనమే బాధ్యత వహించాలి, తొందరలోనే పెద్దల తద్దిన లేదా అనాధాశ్రమ కార్యక్రమం పెట్టుకోవాలి. ఇక ఊరంతా మన అరుపులు గోల వింటారు. అస్తవ్యస్తంగా తయారు అవుతుంది. విడాకులు, గొడవలు, కేసులు, కోర్టులు మొదలు.
అలాగని పెద్దలను వదిలేసామా, మనము రేపు రోగము తో, మంచము ఎక్కిన, ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. మనము చేసిన పాపము, మన వెంట పడుతుంది.
ఇప్పుడు అక్రమ నల్ల లేదా సక్రమ ధనం, ఇంట్లో వాళ్ళ పేరున పెట్టి, బినామీ లు గా చుట్టాలను పెట్టి, ఇంకా బలవంతులు గా చేసి, ఎక్కువ నష్ట ఫలితాలు కష్టాలు పడుతున్నారు. అందుకే పెద్దలు చెప్పారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవా అని.
దయచేసి మీ పెద్దలు, అవతల వారి పెద్దలు తో మాట్లాడి, మన ఇంటి పెద్దలు కు, మీ కుటుంబం కు సమస్యలు, లేకుండా చేసుకోండి సాధ్యమైనంతవరకు. మీ ఇంటి సమస్యలు, పూర్తిగా అవగాహన అనుభవం ఉన్న వారే, మంచి దోవ చూపగలరు ఇరువైపులా నష్టము లేకుండా.
అవకాశ వాద మధ్యవర్తిత్వం తో జాగ్రత్తలు, ఇంకొంత రాజేసి, పబ్బం గడుపుకుంటారు. జాగ్రత్తలు మరి. ధన్యవాదాలు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,537; 104 తత్వాలు (Tatvaalu) and views 254,494 Dt : 28-Aug-2020, Upd Dt : 28-Aug-2020, Category : General
Views : 1176
( + More Social Media views ), Id : 662 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
life partner ,
angry ,
aged parents ,
home ,
fair ,
solution Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments