అందరి ధనం తో లేదా అందరి మీద అప్పు చేసి, మన పేరు పెట్టమంటే? సన్నాసి అని జనం ఊయరా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1544 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1579 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చంద్రున్న మరియు జగునన్న - బోరు, సైకిల్, విద్యా, కళ్యాణ, మురుగు నీరు, వీధి చెత్త, కక్కసు దొడ్డి శుభ్ర, మధ్యాహ్న భోజన, తద్దిన, మొదలగు 239 న్నర ఊరి జన ధన పధకాలకు, ప్రచార కక్కుర్తి తో వారి సొంత పేర్లు పెట్టుకుంటే, మిగతా డమ్మీ ఆత్మాభిమానం లేని మంత్రుల ఎంపీల పేర్లు లేకుండా వారికి విలువ లేకుండా పరువు తీసి, తమ బాధ్యత గా సొంతంగా, తమ పూచీకత్తు తో, తాము అప్పు తీరుస్తామని, అని త్రికరణ శుద్ది గా ఆత్మ సాక్షి గా ప్రజల ముందు, పేపర్ ఫ్రూఫ్ తో ఒప్పుకున్నట్లే గదా, రాజ పత్రంలో? అధికారులు లాయర్లు చెప్పరా, అడగరా ఈ మాట?

మన ఊళ్ళో బడి గుడి కడుతుంటే, రాయల్ గా గొప్పగా, మనం ఏమి చెపుతాము, మన పేరు పెట్టండి, ఖర్చు మొత్తం నేను భరిస్తాం అంటాం. లేదంటే పదిమంది చందాలు తీసుకుని, అందరి పేర్లు పెట్టమంటాము. అందరి ధనం తీసుకుని లేదా అందరి మీద అప్పు చేసి, మన పేరు పెట్టమంటే? అంతకన్నా సన్నాసి మోసగాడు ఇంకోడు ఉంటాడా? ఆ ఊరి జనం ఊయరా, చెప్పుతో కొట్టరా? ఆ మాత్రం ఇంగింతం లేని నాయకులు ను గెలిపించే, మనకు ఇంగితజ్ఞానం ఉందా, అధ్యక్షా? అందుకే నా, వాళ్ళ పిల్లలు, మనుమడు అధికారంలోకి రావాలని, అనడం పరుగులు?

అత్త సొమ్ము అల్లుడు దానం అంత హీనస్ధితికి, మన తెలుగు నాయకుల, వంశాలు కుటుంబాలు దిగజారిపోయారా? ఈ విషయంలో, తెలంగాణ కేసీఆర్ అన్న నయమే కదా, పేర్లు లో ఇంత నీచమైన, పరాన్న ధన, సొంత పేరు ప్రచార హీన స్ధితికి రాలేదు?

మరి నిద్ర పోయే ప్రతిపక్షాలు లేదా మేధావులు మేల్కొని, కోర్టు లో ఈ లీగల్ పాయింట్ తో అడగరా? ప్రజల కోసం అప్పు అయితే, మీ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఎలా వాగ్దానం చేశారు? కాబట్టి మీరే అప్పు బాధ్యత వహించాలి, అని కోర్టులు అడగవా? ప్రజల పై అప్పు సొమ్ము తో, భూములు అమ్మి తాకట్టు పెట్టి, మీ బోడి పధకాలు, మీ సొంత పబ్లిసిటీ ఏమిటి అని నిలదీయదా?

ఆత్మాభిమానం గల ప్రజలు కానీ, ఆ పార్టీ నాయకులు గానీ, మన మామ లేదా నాన్న గారు, ఇంత సంపాదించారు ఇచ్చి పోయారు, ధైర్యంగా ముందే చెప్పండి, పిచ్చి జనానికి మడమ తిప్పకుండా, లక్ష కోట్లు అప్పుచేసి రాష్ట్రం ను ప్రజలను తాకట్టు పెట్టి లేదా ప్రభుత్వ లేదా దేవాలయ భూముల అమ్మి, మిమ్మల్ని కూర్చునబెట్టి సౌకర్యాలు ఇస్తామనో, లేదా

గెరిటేజ్, సింగపూర్, లోటస్ కాండ్, ఎడుపులపాయ, బెంగుళూరు ఆస్తుల తో, మా సొంతంగా భరిస్తాం, మా వంశం లోనే, ఊరి జనాల అప్పు పన్ను ధనం తో, కక్కుర్తి తో మా పేర్లు పెట్టుకుని, ప్రచారం ఛస్తే చేయమని, గర్వంగా తల ఎత్తి, మామ మరియు తండ్రి ల, వంశ గౌరవం నిలబెట్టాలని చెప్పరా?

హతవిధీ, ప్రజలమైన మనమెంత కక్కుర్తి తో విశ్వాసహీన బాధ్యతారాహిత్య గా ఉన్నామో, మనకు మించిన కక్కుర్తి తాతలు గా, మన నాయకులు ను పెట్టుకుంటాము. మనకు లేని నీతి నియమాలు, వారికి ఉండాలా? అందుకే ఎప్పుడూ నాయకులు అధికారులు ది తప్పు కాదు, ప్రజలమైన మనదే తప్పు. మనమెప్పుడూ, మన కన్నా సిగ్గు మాలిన వారినే ఎన్నుకుంటాం నాయకులుగా, మన నెత్తిన పెట్టుకుంటాం కదూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1579 General Articles, 54 Tatvaalu
Dt : 12-Oct-2020, Upd Dt : 12-Oct-2020, Category : Politics
Views : 496 ( + More Social Media views ), Id : 752 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : loan , public , people , tax money , our name , schemas , sannasi , shame , jagananna , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content