బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే, మొదటి సంవత్సరమైన ప్రభవలో - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1164 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1193 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గురువు లందరికీ ఉగాది శుభాకాంక్షలు. తల్లి దండ్రుల మీద మరియు వారి భాష పై ప్రేమ, క్రుతజ్ఞతలతో, ఇన్నాళ్ళు తెలుగు లో శుభాకాంక్షలు లేదా 2 పదాలు రాసిన, సంస్కార మహానుభావులకు వందనాలు. మరలా వారం ఇవి అందుకోవడానికి ఆరోగ్యముగా ఉండాలి అందరం. కరోనా జాగ్రత్తలు 3 ఏళ్ళ క్రితమే, మీకు లిస్ట్ ఇచ్చాము. 75 ఏళ్ళ అమ్మ కూడా పాటించి, ఆరోగ్యముగా ఉన్నది అని మీకు తెలుసు.

తెలుగు (మాత్రుభాష) రాయలేని వారు ఎక్కువగా, కన్నతల్లి యందు క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని జన్మలు గా ఉండుటవలన, ఆ కరోనా గురువే కాపాడాలి. ఎందుకంటే వారి పిల్లలను కూడా సరైన సంస్కారముతో పెంచలేరు, అన్నిటిని తేలికగా తీసుకుని, పెద్దలను లెక్కచేయక, తప్పక ఫలితములు అనుభవిస్తారు.

దయచేసి, ఇప్పుడు అయినా తెలుగు లో మీ సొంత మాటలతోనే, ఇతరులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతారని, ఈ తెలుగు ప్లవ నామ సంవత్సరం లో, మనసు మారి గతాన్ని తలచి, మన పద్దతి ప్రవర్తన మార్చుకుని, మంచి వైపు అడుగు వేద్దాం, కొత్త ఆలోచనలతో అని ఆశిస్తున్నాము.

పోయాక పైకి వెళ్ళేది, ఉత్త చేతులతో నే సుమా, తోడు వచ్చేది మన సంస్కార వాసనలే, పుణ్య పాపాలే. వచ్చే జన్మలో నీచ ఉచ్చ స్థానాలతో, పరమాత్మ వైపు సాధన కొరకు. ఈ ధనము బంధము అధికారము మనతో రాదు.

ప్రపంచములో గ్రహాల గతులను, వాతావరణ మార్పుల ను బట్టి, ఉగాది సంవత్సరాది ని నిర్ణయించింది, కేవలం భారతీయులే. మిగతా మతాలకు ప్రపంచానికి సైన్స్ తెలీకముందే, భూమి గుండ్రం గా ఉంది, తన చుట్టు తాను ఆత్మ ప్రదక్షిన చేస్తూ, సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అని, 9 గ్రహాలు అని, నిర్ణీత సమయాల్లో కక్షలో తిరుగుతాయని, రాహు కేతు వులు చాయా గ్రహాలని, శని మందగమనుడని, ముందు గా చెప్పింది మన వాళ్ళే.

బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే, మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది, ఉగాది అంటారు.

ఈ ప్లవ నామ సంవత్సరం రాజు కుజుడు. క్రోధము యుద్దము స్వభావము. అలాగే సైన్యాధిపతి ఆయనే. కానీ మంత్రి బుధుడు. ఆ రోజున, పంచాంగము రాశి ఫలాలు వినాలి. ఊహా జనితముగా ఏమి జరగబోతుందో తెలుసుకుని, మనసు స్థిరపరచుకుని, దైవం అండతో, మానసిక బలముతో ముందుకు సాగాలి.

రాశి ఫలాలు భయపెట్టడానికి కాదు, ముందు చూపుతో జాగ్రత్త గా ఉండటానికి. పుట్టిన తేదీ సమయము తోనే కరెక్ట్ గా చూడగలము. ప్రతి రోజు, వారం, నెల పేపర్లలో చూసుకునే, గోచార ఫలము 50 శాతమే ఉపయోగము, జన్మ రాశి ఫలాలు కనీసం 75 శాతం ఉపయోగము. అవగాహనతో, దైవారాధనతో జాగ్రత్తలు పడటానికి మాత్రమే సుమా.

ఏలిన నాటి శని, రాహు కేతు గ్రహాల బాధితులు, తమ తల్లి దండ్రులను గురువులు గా భావించి పూజించిన, దాని తో పాటు గా నిస్వార్ధ దానాలు, మానసిక ధ్యానం చేస్తే అన్ని సర్దుకుంటాయి, ఎదుర్కునే శక్తి వస్తుంది సుమా.

మన తప్పుల ఫలితాలు అన్నిటినీ, మన పిల్లలు కూడా పంచుకోవాలి. అలాగే పిల్లల తప్పుల ఫలితాలు పెద్దలము కూడా భరించాలి. తప్పులు చేయకుండా ఉండటము శ్రేయస్కరము.

పండిత పుత్ర, పరమ శుంఠ అన్నది అందుకే. ధనము, హోదా, పదవి, అధికారం, అహంకారం, అమర్యాద ఉన్న మిత్రుల బంధువుల నాయకుల అధికారుల పిల్లలను ఒక్కసారి చూడండి, ఎంత బుద్ది మాంద్యముగా ఉంటారో.

మేము నాయకులకు అధికారులకు పంపే విన్నపాలు, వారి భవిష్యత పుణ్యము పెరగడానికి మాత్రమే సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1193 General Articles, 47 Tatvaalu
Dt : 10-Apr-2021, Upd Dt : 10-Apr-2021, Category : General
Views : 81 ( + More Social Media views ), Id : 1086 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lord , brahma , creation , year , prabhava , begin , brahmakalpa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content