Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. భద్రాచలం రామయ్య వైభవం చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ముత్యాల తలంబ్రాలు, దండలతో ఎలా పెళ్లి జరిపిస్తున్నారో. భద్రాచలం చరిత్రలోనే ఇది మొదటి సారి, భక్తులు లేకుండా సీతారాముల కళ్యాణం చేయడం.
రామయ్య నిండుగా ఎంత ముచ్చటగా ఉన్నారో, పెళ్ళి కళ ఉట్టిపడుతూ. సిగ్గు ల మొగ్గ సీతమ్మ ను చూడండి, ఎంత పొడవైన బరువైన పూల జడతో, అంత సేపు ఎలా కూర్చుని ఉందో మాయమ్మ. రాబోయే కష్టాలు ఇప్పుడే చూపించారు అన్నట్టుగా ఉంది, ఆ బరువైన అలంకరణలు తో.
ఆ చిరుకోపం అంతా, తలంబ్రాలు మొత్తం రామయ్య మీద పోసి తీర్చుకున్నది, మా సీతమ్మ తల్లి. పోనీలే పాపం ఇందులో అయినా గెలవనీయి అని, రామయ్య ముసిముసి నవ్వు లు నవ్వు తూ, పెళ్ళి తంతు ముగించారు.
భద్రాచల రామయ్య ఇక్కడ పెళ్ళి తో ఆగితే ఎలా అని, వాళ్ళిద్దరూ లక్ష్మయ్య తో కలసి ఆంధ్రా ప్రభుత్వ మర్యాదలు స్వీకరించటానికి, ఒంటిమిట్ట కూడా వెళ్ళారు, ఇంకోసారి పెళ్లి లో పాల్గొనడానికి, భక్తులను కనువిందు చేయడానికి. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు సీతారాముల కళ్యాణం. మీరు ఇవన్నీ ఆ వీడియోలలో గాంచండి. ఈ దేవాలయాలలో చేసినట్లు గా, ఇంకో చోట చేయడం కష్టం.
ఓం నమో రామ భద్రాయ
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,456; 104 తత్వాలు (Tatvaalu) and views 253,855 Dt : 02-Apr-2020, Upd Dt : 02-Apr-2020, Category : Devotional
Views : 1043
( + More Social Media views ), Id : 466 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
sita rama kalyanam ,
bhadrachalam ,
ontimitta Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments