Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. శనీశ్వరుడు, నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. సూర్యుని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని.
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం
ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు: నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం. నల్లని కాకి అతని వాహనం.
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు. కర్మ ఫలదాత. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.
శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి 8 వ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి 12, 1 మరియు 2 ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే: విష్ణువును, కృష్ణుని, హనుమంతుని రూపంలో ధ్యానం. రామ నామం, హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతి.
శని అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావములు కలుగచేయువానిగా, మరియు సహనము, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా; మరియు ఆంక్షలను, నియమాలను విధించేవాడుగా పరిగణింపబడ్డాడు. మైనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉన్నచో ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయములు సానుకూలముగా ఉండును.
శని గ్రహం ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించటానికి 30 సంవత్సరాలు పడుతుంది, అనగా ఈ 30 సంవత్సరాలలో ఇది 12 రాశులు లేదా సంపూఋణ సూర్యభ్రమణం చేయుటకు పట్టు కాలం. కావున ప్రతి రాశి లేదా చంద్ర రాశులలో శని భగవానుడు సగటున రెండున్నర సంవత్సరాలు గడుపును. ఏలిన నాటి శని యొక్క ప్రభావం వారి యొక్క జన్మ రాశికి ముందు రాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమై జన్మరాశి తరువాత రాశిలోనికి ప్రవేశించడంతో ముగుస్తుంది. మొత్తము ఈ 7.5 సంవత్సరాల (2.5 సంవత్సరాలు×3) కాలాన్ని సాడెసాతి లేదా "ఏల్నాటి శని"గా పరిగణిస్తారు, ఇది జీవితంలో అత్యంత కష్ఠ కాలం. శని మహాదశ లోనికి ప్రవేశించే ముందు ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలు చాల ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో శని రాజును కూడా దరిద్రునిగా మార్చగలడని చెప్పబడింది.
శనీశ్వర భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో కచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.
శని భగవానుడు తన చెడు ప్రభావములకంటే కూడా దీవెనలకు ప్రసిద్ధుడు. దీవెనలు అందించుటలో మరి ఏ ఇతర గ్రహాన్ని శనితో పోల్చలేము. తన దశ చివరిలో ఆయన దీవెనల వర్షం కురిపించును. ప్రజాపతి ఈయన అది-దేవత కాగా యముడు ప్రత్యాది-దేవత. శనిదేవుడు వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించును, చిరాకులను మరియు జాప్యాన్ని కలుగచేయుటచే మన అధర్మమైన పనులను సరిదిద్దును. చివరిలో మనం చేసే తప్పులను తెలుసుకొనే జ్ఞానమును ప్రసాదించును. ఆయన శిక్షించడం ద్వారా అంతరంగములో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టును, జీవి లేదా వ్యక్తి ఆత్మను పరిపూర్ణం చేయుటద్వారా వ్యక్తి లోపలినుండి రాగి నుండి బంగారముగా మారును అనగా అతను జీవిత సత్యాలను, తాను అజ్ఞానముచే చేసిన పనుల నిరర్థకతను అర్థంచేసుకుంటాడు.
శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు. ఇదంతా మానవులపై దేవతలు కర్తలుగా, పవిత్ర స్వరూపం చేయించును. శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 8వ సంఖ్యలో జన్మించినవారు శనిదేవునిచే పాలింపబడతారు. ఏ నెలలోనైనా 8, 26 తేదిలలో జన్మించిన వారు జీవితంలో కష్టాలను ఎదుర్కుంటారు. చెడు పనులకు బాధ్యత వహించటం, ఆత్మవిమర్శ మరియు కష్టించి పనిచేయుట వంటివి శనిదేవుని శాంతింపచేయుటకు మార్గాలు. శనివారాలలో నీలపు వస్త్రాన్ని దానం చేయటం మరియు పేదవారిని సేవించటం కూడా సహాయపడును.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,103; 104 తత్వాలు (Tatvaalu) and views 254,443 Dt : 08-Nov-2017, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 5472
( + More Social Media views ), Id : 24 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Shani ,
Yama Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.