ఇంత నష్టపోవడం, అమ్మ సేవకై? కానీ కేరీర్, భవిష్యత్, వ్రుధాగా పాడుచేసుకోవడం కాదా? మూర్ఖత్వం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,995; 104 తత్వాలు (Tatvaalu) and views 225,186.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*వాస్తవ వాది లోక విరోధి, కానీ దేవుడు మన్ననలు మెండు. అలాగే త్రికరణశుద్ది, మాటలు చేతలు రాతలు ఆలోచనలు అన్ని కలుస్తున్నాయి, ఉదాహరణ ప్రత్యక్షముగా చూస్తున్నాము. కానీ, రేపు తెలియని ముదుసలి తల్లి కోసం, మరలా తెచ్చుకోవడం కష్టమైన, ధనానికి అమిత లాభమైన, జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకుండా, ఖర్చు తో ఉండటం అంటే, సామాన్యమైన విషయం కాదు. ఎంత ఉన్నా, ఇంకా పక్కవారి ని దోచే ఈ రోజుల్లో, ఉన్న దానిని వదిలి, ఇంత నష్టపోవడం, అమ్మ సేవకై? కానీ ఇది కేరీర్ ను భవిష్యత్ ను వ్రుధాగా పాడుచేసుకోవడం కాదా? ఇది మూర్ఖత్వం అంటారు 80 మంది నూటికి, అంటే మీ జవాబు? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పగలరు. చెప్పకపోయినా, అర్ధం చేసుకోగలము.*

జవాబు - ధన్యవాదాలు పర్లేదు, ఈ విషయం దాచకుండా అందరికీ, రాజీనామా ఇవ్వకముందే, సంవత్సరం ముందుగానే చెప్పాము, ఇందులో మనము సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదు. అందరికీ తెలిసిన విషయమే.

ఎందుకంటే, అందరూ తమ ముదుసలి తల్లి దండ్రులు మరియు చివరలో తమను చూసే సంస్కార గుణం గల పిల్లల కోసము, కొన్ని త్యాగాలు వారూ చెయ్యాలి, ధన మోహాన్ని వదలాలి. దానికి మనము ఉదాహరణగా, మొదటి అడుగు వేయాలి, ఆదర్శముగా ఉండాలి.

ఆ తల్లి దండ్రులు అందరూ, ఇల్లు కూడా లేని ఓ అనామకుడు, చేస్తున్న ఈ చిన్న పనిని, మీరేందుకు చేయలేరు ఇన్ని కోట్లు ఉండి, ఇన్ని ఇళ్ళులు ఉండి, ఇంత పలుకుబడి, మంది మార్బలం ఉండి, అని అడిగే ధైర్యం తెప్పించాలి.

అంటే వారికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఉండాలి, అది మనమే ఎందుకు కాకూడదు? దేవుని ముందు వరసలో, మనమే ఎందుకు ఉండకూడదు? ఇది దేవుని పూజ కాదా? మానసిక నైవేద్యం కాదా? అరిషడ్వర్గాల సాధన కాదా? మనసు నియంత్రణ కాదా? దైవం అండతో, మాయకు ఎదురీదడం కాదా?

నష్టపోయినా, మనశ్శాంతి ఉండదా? పంచభూతాల ముందు వినయముగా మొక్కి ధైర్యముగా నిలబడలేమా, తర్వాత ఆజ్ఞ సెలవియ్యండి అని?

మనకు తెలిసిన వారికి కూడా, వారి భవిష్యత్ సంవత్సరాల ముందే చెప్పాము. మన జిల్లా మంత్రి కి అలాగే 4 గురు రాజకీయ పిల్లలకు కూడా, 3 ఏళ్ళు ముందు గానే చెప్పాము, రాబోయే గడ్డు రోజులు. చేతులు కాలిందాకా, ఎవరూ వినరు, అదే కలియుగ మహాత్యం.

వారే ఈ 80 శాతం మంది, అరిషడ్వర్గాలకు తలవంచేవారు, బ్రమలలో నే ఉంటారు, అందులోనే గతిస్తారు, వచ్చే జన్మలో ఇంకా ఎక్కువ కష్టాలతో నష్టాలు భరిస్తారు, ఆ చక్రం నుంచి బయటకు రారు. ఇప్పుడు వాస్తవం అబద్దముగా చూస్తారు, ఎదురుగా ఎన్నో ఉదాహరణలు ఉన్నా, మాకు అది వర్తించదు అనుకుంటారు, అదే విష్ణు మాయ. ఆయన పరీక్షను అర్ధం చేసుకోరు, దగ్గరి వారి ద్వారా, మంచి పలికించినా, పెడచెవిన పెడతారు.

మాత్రుదేవోభవ, పిత్రుదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ చిన్నప్పుడు చదివాము. కానీ ఆచరణలో ఎప్పుడూ చేయము, పిల్లలకు నేర్పము, ఉదాహరణ చేతలలో చూపము, ఇతరుల మంచి గురించి చెప్పము. అందుకే 80 శాతం మంది మాటలు చేతలు అసలు కలవవు. తమకు కష్టం వస్తే, నీతి నియమాలు అంటారు, సుఖము లో ఉంటే, అబ్బే ఈ రోజుల్లో నీతి నియమం ఏమిటండి చాదస్తం అంటారు. చేతిలో కాస్త డబ్బు పెడితే, 2 రోజులు కూడు పెడితే, రుణం తీరుతుందా?

ఆ దేవునికి, ఎప్పుడు ఏవి ఎలా, ఇవ్వాలో తెలుసు. ధనం రావడం, పోవడం, చాలా తేలిక. ఓ పాపాత్ముడు, తన పాపం వదిలించుకోవడానికి, మన లాంటి వారికే, లక్షలు కోట్లు ఇవ్వాలి. లేదా లాటరీ, లేదా మంచి వారు. అలా ఎవరైనా ఇస్తే, క్షణములో ధనం వస్తుంది కదా? కాబట్టి అది కష్టం కాదు.

మరి ఏది కష్టం, మంచి గుణము వ్రుద్ది చేయడం. ఆ కోటి ఇచ్చిన వ్యక్తి కి కూడా, మనము లేదా ఇంకొకరు, దానికి బదులు గా, మంచి గుణాన్ని క్షణము లో ఇవ్వ గలమా? లేదు, వారు కూడా జీవిత కాల సాధన చేయాలి, సుమా. అంటే ఏది కష్టం? ధనమా, మంచి గుణమా?

మనము రాజీనామా ఇచ్చినా, దేవుని సంకల్పం, ఇంకో లా ఉందేమో? రాష్ట్రానికి, జిల్లాకు సేవ అయిపోయింది. కేంద్రం వాసన కూడా కొంత కాలం చూపుదాము అనుకుంటారేమో, తెలీదు కదా. లేదు ఇలా రాస్తూ, దేవుని సేవ చెయ్యి, అండ నేను చూపుతా అంటారేమో. మామూలు అన్నం కూర పచ్చడి మెతుకులు తిని, చాప పై పడుకునే మనకు తేడా ఏముంది? అది ఆయనకే వదిలేస్తే, ఆయనే చూసుకుంటాడు, చూస్తాడు. మనకెందుకు లేని పోని బాధ, మంచి దోవ విడవకుండా మాయలో పడకుండా ఉంటే చాలు.

కాబట్టి మూర్ఖత్వం ఏమీ లేదు, నలుడు లా హరిశ్చంద్రుని లా, మంచి కోసం, కష్టాలకు ఎదురు నడవాలి తప్పుదు, అదే దైవ పూజ, మానసిక నైవేద్యం.

మీ మంచి పనులు గుణం కూడా, అందరికీ ఎప్పటికప్పుడు చెపడం మరువద్దు, రేపు మేమే లేదా ఇంకొకరు, మీకు అండగా ఉంటామేమో, ఉండాలేమో. ఆరోజు మాత్రమే చెపితే, నమ్మలేము కదా?

ఇంక జీవితం వ్రుధా గురించి అనుకుందాము. గతము లో మీకు, అనాధాశ్రమములో ఉన్న అధికారులు నాయకులు ధనవంతులు గురించి, కధనము పంపాము గుర్తు ఉందా? లోకం తీరులో వెతికితే కనపడుతుంది.

మరి ఆ తల్లి దండ్రులు అందరూ, తమ పిల్లల కోసం, జీవితము అంతా ధార పోసి, చివరకు ఒంటరిగా దిక్కులేని వారిగా, ఆశ్రమము లో చేరారు లేదా ఇంట్లో ఉన్నారు. మరి ఇప్పుడు వారు సాధించినదేమిటి? వారి సంపాదన ఉద్యోగం పదవి ఆస్తి, వారిని పిల్లలతో ఉంచగలిగాయా? వారి జీవితం వ్రుధాకాదా?

వారి పనులలో త్యాగం ఏమైనా ఉందా? అది కేవలం బాధ్యత మాత్రమే, మోహము లో సుఖాలు ఫలితంలు ఆశిస్తూ?

వారి పిల్లలే మొఖాన కడుగుతున్నారు అడుగుతున్నారు, ఏమి చేసారు మీరు మాకు? మా దగ్గర మీరు వద్దు, మాకు మీ చాదస్తం తలనొప్పి ముదుసలి వాసన వద్దు అంటున్నారు, ఇదేనా వారు సాధించింది?

వారి కి ఇది పుణ్యమా? ఇంకా పాపం వస్తుందా, భస్మాసురులను పెంచి పోషించి, ఆస్తులు ఇచ్చినందుకు, బలవంతులను చేసినందుకు? మీకు కావల్సిన జవాబు వచ్చింది అనుకుంటా?

మనము మోహములో, అరిషడ్వర్గాలకు బానిసలై జీవితాన్ని గడిపితే నడిపితే, దేవుడు మరియు మనశ్శాంతి మనకు దూరం.

మనము అరిషడ్వర్గాలకు దూరముగా ఉండి, మన జీవితాన్ని ఆయనకు వదిలేస్తే, ఇప్పుడు దేవుడు తిప్పలు పడతాడు, మనకు దోవ చూపడానికి. ఏది తేలిక మిత్రమా?

Losing so much for mothers service? isnt it ruining career future? Stupidity?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,995; 104 తత్వాలు (Tatvaalu) and views 225,186
Dt : 05-Jul-2022, Upd Dt : 05-Jul-2022, Category : General
Views : 452 ( + More Social Media views ), Id : 1453 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : losing , money , govt , job , old , mother , parents , service , ruining , career , future , stupidity
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content