పాటతో పరమార్ధం - మాటలకందని భావాలు - నీతి నిజాయితి - కృష్ణంరాజు, కాంచన, సతీష్ అరోరా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2268 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2303 General Articles and views 3,486,932; 104 తత్వాలు (Tatvaalu) and views 395,899.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Maatalakandani Bhavalu - Neeti-Nijayiti - Krishnam Raju, Kanchana, Gummadi, Nagabhushanam, Satish Arora (hero) పాటతో పరమార్ధం - మాటలకందని భావాలు - నీతి నిజాయితి - కృష్ణంరాజు, కాంచన, గుమ్మడి, నాగభూషణం, సతీష్ అరోరా(హీరో)

నీతి నిజాయితీ తో ఉంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా, చివరికి విజయం అని నిరూపిస్తుంది. అదే అడ్డదారిలో గడ్డి తింటే, అహంకారముతో విర్రవీగితే, ముందు అంతా బాగున్నా, చివరికి అంతా చింతనే కన్నీరే.

ఈ సినిమాలో ఏమీ తెలియని అమాయకుడైన కథానాయకుడిని, సంఘంలో ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతుంది కథానాయిక. మాటలకందని భావాలు, మంచి మనసులు చెబుతాయి, కవితలకందని భావాలు కంటి పాపలై చెబుతాయి అంటూ కథానాయిక, కథానాయకుణ్ణి ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుంది. వెన్నెల మాటాడదు, మల్లిక మాటాడదు అయినా కానీ వెన్నెలను, మల్లెలను ఆస్వాదించని వారు ఎవరు? అని అడిగి కథానాయకునికి ధైర్యం నూరిపోస్తుంది. ఏనాడు పలకని దైవం ఈ లోకాన్ని ఏలుతుంది కదా? అలాగే నీవు కూడా మాటలు రాకపోయినా గొప్పవాడివి అవుతావని చెబుతుంది.

మాటలకందని భావాలు, మం.చి మనసులు చెబుతాయి
కవితలకందని భావాలు, కంటిపాపలే చెబుతాయి ||మాటలకందని||

వెన్నెల మాటా.డునా., వెదజల్లును చల్లదనాలు.
మల్లిక మాటా.డునా., కురిపించును పరిమళాలు. | | వెన్నెల | |
బాసరాని పాపాయి, బోసినవ్వు చా.లదా. 2
ఏనాడూ పలకని దైవం, ఈ లోకము లేలదా
ఈ లోకము లేలదా ||మాటలకందని||

పిల్లగాలి పరుగులలో, వెల్లివిరియు గీతికలు.
కొండవాగు తరగలలో, కోటి రాగ మాలికలు. ||పిల్లగాలి||
హృదయానికి చెవులుంటే., జగమంతా నాదమయం 2
కనగలిగిన మనసుంటే., బ్రతుకే అనురాగమయం
అనురాగమయం||మాటలకందని||

మాటలకందని భావాలు పాట, నీతి నిజాయితి (1972) సినిమా కోసం, డా. సి. నారాయణరెడ్డి రచించారు. ఈ పాటకు పి.సుశీల నేపథ్యగానం చేసింది. సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా పాటలు విజయవంతమయ్యాయి. అయితే సినిమా పరాజయం పాలైంది. భలే మజాలే భలే కుషిలే టైం రోజాలె మనం రాజాలే ఘంటసాల గారు, బాలు గార్ల యుగళ గీతం పాడారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,486,932; 104 తత్వాలు (Tatvaalu) and views 395,899
Dt : 27-Jul-2025, Upd Dt : 27-Jul-2025, Category : Songs
Views : 2755 ( + More Social Media views ), Id : 2274 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Maatalakandani Bhavalu , Neeti-Nijayiti , Neeti Nijayiti , Krishnam Raju , Kanchana , Gummadi , Nagabhushanam , Satish Arora
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content