మంచి కుటుంబం - మనసే అందాల బృందావనం, త్యాగ శీలవమ్మా మహిళా - అక్కినేని, జానకి, క్రిష్ణ, కాంచన - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1944 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1979 General Articles and views 1,678,985; 102 తత్వాలు (Tatvaalu) and views 207,784.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఒక మంచి విలువలు గల కుటుంబం, ఎలా ఉంటుంది చూడాలంటే, ఈ చిత్రము చూడాలి. విన్నవి చూసినవి అన్నీ నిజాలు కావు, వాటి వెనక బలమైన మంచి కారణాలు ఉన్నాయి, అని నిరూపించింది ఈ చిత్రం.

త్యాగశీలవమ్మా మహిళా, అనురాగశీలవమ్మా, తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా, అంటూ ఆనాటి మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. సొంత సోదరి కోసము చేసిన త్యాగాన్ని ఈ పాటలో మనము అర్ధము చేసుకోవచ్చు.

ఈనాటికీ కొంత మంది, మంచి వారిని చూడవచ్చు. త్యాగం మంచికోసం మాత్రమే ఉంటే విలువ పుణ్యం. అదే చెడుని సహిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే, అది త్యాగం కాదు, అవసరం అవకాశం కుటుంబపతనం పాపం సుమీ.

ఆనాటి తల్లి, కనీసం దూరపు ఆశతో, నా బిడ్డలు నన్ను దగ్గర ఉంచి ముదుసలి తనములో బంగారముగా చూస్తారు అని ధైర్యముగా చెప్పేది, తన సంస్కార పెంపక నమ్మకము తో.

మరి ఈ నాటి ప్రాపంచిక మోహ సంపాదన ఉద్యోగ మరియు మొబైల్ సోషల్ మీడియా సీరియల్ తల్లి, వాళ్ళు మమ్మల్ని చూడక్కరలేదు, మమ్మల్ని చూడరు, అని తన చేతగాని తనాన్ని నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని బాధ్యతారాహిత్యాన్ని, తన పెంపక సంస్కార లోపాన్ని తనే చూపిస్తుంది. ఇంటికో భస్మారులను తయారు చేస్తుంది.

చూపించినా చూపించకపోయినా, ముదుసలి తనము లో అనాధగా ఒంటరిగా కుళ్ళుతూ తన తప్పులకు పాపాలకు, తానే కుమిలిపోతున్నది. తండ్రి కూడా అంతే, అరిషడ్వర్గాల బానిసలు ఎవరైనా అనాధలుగా మిగలాసిందే, ఏడుస్తూ పోవాలసిందే.

మరి ఇంటి బయటకు వచ్చి లేదా ఇంట్లో ఉండి, ఏమి సాధించాము? కోట్లా, ఉద్యోగాలా, పదవా, పలుకుబడా, మంది మార్బలమా? లేక పతనమైన పిల్లలూ కుటుంబమా? అది ఎవరికి వారే ఆత్మావలోకనం చేసుకోవాలి, పశ్చాత్తప పడాలి.

మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం అంటూ, ఆ నల్లనయ్యను ఎంత మధురముగా తలచుకుంటూ పాడారో చూడండి.

తనను నమ్మిన వారిని అంటే, క్రిష్ణయ్య లక్షణాలు ఆచరించే వారిని, అంటే ధర్మాన్ని కాపాడటానికి ఎంతకైనా తెగించే వారిని, ఆయన మెచ్చుకుని మోక్షము ప్రసాదిస్తారు అని చెపుతుంది ఈ పాట. ఉన్నచోటనే, ఉన్నదానితోనే ఆనందము పొందాలి, పెద్దల సేవ చెయ్యాలి ముందు.

దేవుని నమ్మడము అంటే, అధర్మము చేస్తూ, విలువలు సంస్కారం నియమాలు వదిలేసి, నటన పూజలు ధ్యానాలు, అరిషడ్వర్గాల బానిసలుతో కలసి తిరుగుతూ, ఇల్లు వదలి, దేశ దేవాలయ తీర్ధయాత్రలు నెలకు ఒక సారి చేస్తే, ధన అహంకారముతో దానాలు అన్నదానాలు చేసిన, ఉపయోగము లేదు సుమా.

ముందు మానసిక నియత్రణ తో అరిషడ్వర్గాలను జయించాలి, అష్ట వ్యసనాలకు దూరం గా ఉండాలి, అర్హత సంపాదించాలి. అప్పుడు రూపాయి దానం చేసినా చేయకపోయినా, ఆకు/ నీళ్ళు/ బెల్లం ముక్కతో నైవేద్యం పెట్టినా, ఇంటి దగ్గర గుడికి వెళ్ళిన, ముదుసలి పెద్దల సేవ చేసినా, అమిత ఫలము. దేవునికి కావలసింది మానసిక నైవేద్యం ఆచరణలో.

1) మనసే అందా.ల, బృందా.వనం,
వేణుమాధవుని పేరే., మధురా.మృతం - 2 లైన్లు మొత్తము
కమ్మని నగుమోము, కాంచుటె తొలినోము
కడగంటి చూపైన, కడుపావనం.. ||మనసే అందాల||

రాధను, ఒక వంక, లాలించునే
సత్యభామను, మురిపాల, తేలించునే .. - 2 లైన్లు మొత్తము
మనసా.ర నెరనమ్ము, తనవారినీ ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనసార నెరనమ్ము తనవారినీ
కోటి మరులందు, సుధలందు, తనియించునే . . .||మనసే అందాల||

సాహిత్యం : ఆరుద్ర, గానం : సుశీల

2) ధనము నీయవచ్చు.., అసువులీయగవచ్చు . . .
ప్రాణసఖుని ఇచ్చి బ్రతుకతరమే . . . బ్రతుకతరమే

త్యాగ శీలవమ్మా మహిళా, అనురాగ శీలవమ్మా - 2
తోటి వారికై, సకలము నొసగే, కరుణామయివమ్మా . . . కరుణామయివమ్మా ||త్యాగ శీలవమ్మా||

నీ చిరునవ్వులు, సోదరి జడలో, విరిసే మల్లియలు
చల్లని నీదీవెనలు, నవ దంపతుల, వలపుల వెన్నెలలు - 2 లైన్లు మొత్తము
ఓహో
నిను వీడి పోయినది.., వలచిన హ్రుదయం - 2
నీలో., మిగిలే., స్మ్రుతులే., మధురం ||త్యాగ శీలవమ్మా||

శ్రీశ్రీ, ఘంటసాల

చిత్రం : మంచి కుటుంబం (1967), సంగీతం : కోదండపాణి
అక్కినేని నాగేశ్వరరావు, జానకి, క్రిష్ణ, విజయనిర్మల, కాంచన, త్యాగరాజు, రాంమోహన్, చలం

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

Manchi Kutumbam - Manase Andala Brundavanam - Thyaga seelavamma mahila anr krishna kanchana janaki  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,678,985; 102 తత్వాలు (Tatvaalu) and views 207,784
Dt : 02-Aug-2022, Upd Dt : 02-Aug-2022, Category : Songs
Views : 585 ( + More Social Media views ), Id : 1481 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Manchi , Kutumbam , Manase , Andala , Brundavanam , Thyaga , seelavamma , mahila , anr , krishna , kanchana , janaki
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content