Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. పాటతో పరమార్ధం- మంగళరూపిణి మంగళదాయిని (అష్టలక్ష్మి పాట)- విజయ- మోహన్ బాబు, మురళీ మోహన్, సరిత, అనిత
Song Spirit - Mangala Rupini, Ashtalakshmi song - Vijaya - Mohan Babu, Murali Mohan, Saritha, Anitha
అష్టలక్ష్మి అంటే - ఆది లక్ష్మీ, ధాన్య లక్ష్మీ, ధైర్య లక్ష్మీ, గజ లక్ష్మీ, సంతాన లక్ష్మీ, విజయ లక్ష్మీ, విద్యా లక్ష్మీ, ధన లక్ష్మీ - అని మనందరికీ 20 ఏళ్ళు పైగా తెలుసు, పూజలు చేసాము.
మరి వారి గుణ గణాలు మనకు ఉన్నాయా, వచ్చాయా, వస్తాయా? ఎవరికీ తెలీదు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే, ఎక్కువ మందికి మొక్కుబడి పూజలు, తూ తూ మంత్రము గా. దేవతలను ఎందుకు చెప్పారు, ఎందుకు పూజ చెయ్యమన్నారు, ఎందుకు మంత్రం చదవమన్నారు, చాలా మందికి తెలీదు.
ఇంట్లో దేవునికి అలా 1 నిమిషములో దండం పెడతాము, కొంపలు మునిగిపోయినట్లు. దేవాలయములో బిజీ మినిస్టర్ లాగా, మాకు నీతులు వద్దు, 5 నిమిషాల్లో పూజ పూర్తి కావాలి అంటాము, అదే పెద్ద సమయం దానం ఇచ్చినట్లు. కానీ కడుపుకు మాత్రం భోజనం 1 గంట ప్రశాంతముగా అన్ని కలిపి తిని, టీవీలో/ షికారులో 2 గంటలు సినిమా చూసి, ఇతరులతో పోసుకోలు మాటలు 2 గంటలు, ఆ తర్వాత రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం మాత్రం ఎంత సమయమైనా చేస్తారు.
లక్ష్మీ అంటే మనశ్శాంతి, ఆనందము, సంతోషము, ఆరోగ్యం అని చాలా మందికి తెలీదు. కేవలం ధనము అనుకుని, ప్రాపంచిక మోహాలతో భోగాలతో, అదే ధనముతో, వెన్నుపోటు లేదా ఇంకో దోవలో పతనము అవుతారు.
కనీసం ఈ చిత్రము పాటైనా, మీ నోట వినే భాగ్యం మాకు ఉంటుందా? ఇంట్లో వారితో పాడించే సంస్కారం మనకు ఉందా, మనకు మనమే సరి చూసుకుందాము, సరి చేసుకుందాము.
పెద్దలుగా మనము పాడితేనే, మన పిల్లలు, మన తర్వాత తరాలు పాడతారు. మంత్రాలు నోటికి రావు అని, సిగ్గుతో మన సంస్కార పెంపకాన్ని ఒప్పుకున్నా, ఇలాంటి పాటలు కూడా రావు అంటే, ఇక మన భవిష్యత్ ఎలా ఉంటుందో, మనకు తెలుసు.
అది మనము మోహములో రాసుకున్న, ప్రాపంచిక వ్యామోహ పతన దోవ. ఇప్పుడైనా మానసిక బలాన్ని పెంచుదాము, వాక్సుద్దిని పెంచుతూ, ముదుసలి తనములో మనశ్శాంతిని పొంది, సొంత పిల్లల దగ్గర మర్యాద గౌరవం ప్రేమ క్రుతజ్ఞత విశ్వసనీయతతో ఉందాము.
మంగళరూ.పిణి మంగళదాయిని
సర్వమంగళా మాయమ్మా-2
వేంకటరమణుని, భవ్యం. కరుణా.., వెలసిన దేవీ రావమ్మా..
1 మంత్ర నివాసిని, మంత్ర స్వరూపిణి, ఆది లక్ష్మీ, మము చూడమ్మా..-2
నీ దివ్య పావన, పాద కమలముల, శోకిన భాగ్యము నాదమ్మా, శోకిన భాగ్యము నాదమ్మా
ఆది లక్ష్మీ, మము చూడమ్మా..
2 శోకనివారిణి, క్షామవినాసని, ధాన్య లక్ష్మీ, దయ చూడమ్మా..
చల్లగ చూచీ, మానవ జాతికి, సస్య సంపదలనీవమ్మా, సస్య సంపదలనీవమ్మా
ధాన్య లక్ష్మీ, దయ చూడమ్మా..
3 భవభయ హారిణి, దురిత విమోచని, ధైర్య లక్ష్మీ, దయబూనమ్మా..-2
ఆవేదనలా, నలుగుడు జీవుల, ఆదరించగా రావమ్మా, ఆదరించగా రావమ్మా
ధైర్య లక్ష్మీ, దయబూనమ్మా..
4 విష్ణు స్వరూపిణి, లోకహితైషిణి, గజ లక్ష్మీ, దిగిరావమ్మా
మనసర్పించి, ప్రార్థించెదను, నిత్యము కృపతో కనవమ్మా, నిత్యము కృప తో కనవమ్మా
గజ లక్ష్మీ, దిగిరావమ్మా..
5 మంజులభాషిణి, అమృతవర్షిణి, సంతాన లక్ష్మీ, స్వాగతము-2
పిల్లలు హాయిగ, పరవశమందగ, అనవరతము ఇల కాపాడు, అనవరతము ఇల కాపాడు
సంతాన లక్ష్మీ, స్వాగతము..
6 జయ జయ సుందరి, చంద్ర సహోదరి, విజయ లక్ష్మీ, దయచేయమ్మా
ఈ లోకంలో, ప్రతి హృదయంలో, జయశంఖం పలికించమ్మా, జయశంఖం పలికించమ్మా
విజయ లక్ష్మీ, దయచేయమ్మా..
7 హరిహర బ్రహ్మకు, పూజిత వందిత, విద్యా లక్ష్మీ, దే.వీ. మాతా-2
పదములే నీకూ, పూవుల మాలలు, జ్ఞానము నీయవో లోకనుతా, జ్ఞానము నీయవో లోకనుతా
విద్యా లక్ష్మీ, దే.వీ. మా.తా.
8 నీదు ప్రభావము, నిండెను విశ్వము, ధన లక్ష్మీ పరదేవతా
నీ కర కంకణ, విఘ్వన నాదము, ఆనతించనీ జగమంతా..
ధన లక్ష్మీ, పరదేవతా
[ఆశలు తీర్చి అండను చేర్చి అష్టలక్ష్ములారా కాపాడండి
నా పై కరుణతో, కనక వర్షమే, వర్షించండి, ప్రియమారా
అష్టలక్ష్ములు బ్రోవండీ , అష్టలక్ష్ములు బ్రోవండీ
బ్రోవండీ , బ్రోవండీ]
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,724; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493 Dt : 06-Jun-2023, Upd Dt : 06-Jun-2023, Category : Songs
Views : 187
( + More Social Media views ), Id : 1777 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Mangala Rupini ,
Ashtalakshmi ,
Vijaya ,
Mohan Babu ,
Murali Mohan ,
Saritha ,
Anitha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments