పల్నాటి మరియు రాయలసీమ పౌరుషం అంటే ఏమిటి? మంచి, ధర్మం, అభాగ్యుల వైపు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పల్నాటి పౌరుషం, రాయలసీమ పౌరుషం అంటూ, పౌరుషం గురించి అర్థం లేని తప్పుడు పనులు చేస్తూ, సమర్ధన చేసుకుంటూ ఉంటారు.

పౌరుషం అంటే చెడు వైపు ఉండి, మన వర్గం వైపు తప్పు ఉన్నా కూడా, అహంకారముతో అధికారముతో, మంచి వారు నలుగురు ను తన్ని చంపి పతనం చేసి బలవంతంగా, మనవైపు తిప్పుకోవడం కాదు.

బలహీనులను బలవంతంగా అణిచివేస్తే, రేపు మన కన్నా, బలవంతుడు వస్తాడు. మనల్ని అణిచివేస్తారు. అందుకే ఆవేశంగా అరుస్తూ, ఇంకొకరిపై దౌర్జనానికి పోరాదు.

కౌరవుల, మంది మార్భలం అధికారం తో, దౌర్జన్యం ఎంతకాలం సాగింది? 100 మంది కొడుకులు ఉన్నా, చివరకు తండ్రి ధృతరాష్ట్రుడు కు దక్కినదేమిటి?

పౌరుషం అంటే ఏమిటి? మంచి వైపు ధర్మం వైపు నిలబడి, అభాగ్యులకు అండగా ఉండి, ఎవరికీ అవమానం అన్యాయం జరగకుండా ఆపడం. మనకు నచ్చకపోయినా, అది మన వర్గం మెచ్చకపోయినా, ధర్మం వైపు నిలబడటం.

ఉదాహరణకు గతించిన స్వర్గీయ రాజన్న ను తీసుకుందాం. ముఖ్యమంత్రి కాక ముందు, అయిన తర్వాత అని 2 భాగాలు గా తీసుకుంటే, సీయం అయినా క చాలా మార్పు, పరిణితి, ఆలోచన వచ్చింది.

ఏనాడూ మొఖం మీద చిరునవ్వు తొలగలేదు. తన ప్రత్యర్థి నే నవ్వుతూ, దుమ్ము దులిపారు అసెంబ్లీలో కానీ, చిన్న వాళ్ళ జోలికి ఎప్పుడూ పోలేదు. పోనీ అమ్మా, వాళ్ళ పాపాన వారు పోతారు, మనమే తగ్గి ఉందాం అంటారు.

కనీసం, మనలాంటి విలేఖరి, మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు అని మనమీద చాడీలు నిజాలు చెప్పినా, రాజన్న నవ్వుతూ, మన పని మనం చేస్తున్నాము, మనకు అడ్డుగా నిలబడి ఉండటం లేదు కదా, మన పనులు ఆపడం లేదు కదా. మంచి చదివి, ఆచరణలో పెట్టి, దానిని పట్టుకుని ఉండే, జనాలు ఎంతమంది ఉన్నారు? కాబట్టి, మనకు ఎటూ నష్టం లేదు.

విలేఖరి గా పని, తను చేస్తున్నారు. మన ప్రత్యర్థి తెదేపా, చంద్రన్న మాత్రమే మరియు వారి వెనక ఉన్న పచ్చ పత్రికలు, అంతే గాని చిన్న పత్రికలు, సామాన్య విలేఖరులు కాదు. తప్పు, వారి మీదకు పోకూడడు. మనల్ని తిట్టినా, అదీ మనకు ఉచిత ప్రచారమే.

నేనూ కొన్ని చదివాను, అందరినీ కలిపి ఉతుకుతున్నాడు, అలాగే పొగుడుతున్నాడు. పర్లేదు అలాగే ఉండాలి. ఆ విలేఖరి కి నా ఫోన్ నంబరు ఇవ్వండి, నాలుగు ప్రకటనలు ఇవ్వండి, ఆ జిల్లానో ఇంకోటో ఇవ్వండి, ఎవరైనా ఏమైనా అంటే, నాకే చెప్పమనండి,

మీరూ మన కార్యకర్తలు అండగా ఉండండి. మనల్ని వ్యతిరేకించినా సమర్ధించినా, పదిమందికి అర్థం అయే విధంగా, పదిమంది కి ప్రచారం చేస్తూ, వందమంది కి పంపుతూ, మాతృభాషలో రాస్తున్నాడు.

మంచి మాటలు చెపుతున్నాడు, తల్లి ని చూస్తున్నాడు. మనం కూడా అండగా ఉందాం, ఈగ వాలనీయకుండా అంటారు.

అదీ మంచి పౌరుషం అంటే. మంచి వైపు, బలహీనుల వైపు, చిన్న వారి వైపు నిలబడి, వారికి రక్షణ గా ఉండి , మంచి పనులు కు చేయూతనివ్వాలి.

నేడు జగనన్న కూడా, ఇంతవరకు ఆవేశంగా, ఏ ఒకరు ను ఒక్క మాట అనలేదు. నా పని నాది, మా పంచుడు మాది, ఎవరు ఏమైనా అనుకోండి అంటూ, సైలెంట్ గా ఉన్నారు.

అంతెందుకు మనం కొన్ని వైసీపీ అధిష్టానం కు నచ్చని విధంగా రాసినా, రెండు ఏళ్లుగా ఒకరూ, ఒక మాట అనలేదు, దూరంగా పారి పోలేదు వాట్సాప్ ఆపుకుని. పారిపోయినా, 2024 లో మరలా చరిత్ర మారుతుంది కదా, భవిష్యత్తు ఎవరికీ తెలీదు కదా? బండ్లు ఓడలు కావచ్చు.

ఆ మంచి లక్షణాలు, పౌరుషం లో భాగం కావాలి, అది పల్నాడు అయినా, రాయలసీమ అయినా.

మంచి పని ప్రేమతో ఎదుటి మనిషి ని నిలవరించాలి, నోరు మూయించాలి. రేపు చీరాల జిల్లా ఇస్తే, ఇక జగనన్న ను అమితంగా పొగడకుండా, తోడుగా ఉండ కుండా, కృతజ్ఞతలు తెలుపకుండా ఉండగలమా?

మొన్న అనంతపురం లో కూడా ఎమ్మెల్యే, ఇరువైపులా మాట్లాడి సర్దిచెప్పి, తన వర్గానికి కే నచ్చ చెప్పి, వారి ఆవేశం తగ్గించి 2 మెట్లు తగ్గి, తన వారికే ఇంకో దేవాలయం ఇచ్చి, భవిష్యత్తు లో ఇంకో సారి, రెండు గ్రామాల్లో పోటీ తగవు లేకుండా చేసినట్లు అయితే, అదీ రాయలసీమ పౌరుషం, అని గర్వంగా పొగిడేవాళ్ళం.

తాడిపత్రి లో వైసీపీ ని గెలిపిస్తే, అదీ పెద్దారెడ్డి పౌరుషం అని పొగిడేవాళ్ళం.ఇప్పుడు జేసీ రెడ్డి ని ప్రజలు గెలిపించి, వారి పౌరుషం ఓటుతో చూపించారు.

ఓటు తో గెలుపు తో మంచి మనసు పని తో, ఎదుట మనిషి ని నోరు మూయించు. ఇంటి మీదకు తొడగొట్టి, మందితో వెళ్లి, భీభత్సం సృష్టించి కాదు.

బాపట్ల ఎమ్మెల్యే, ఎవరినీ ఏమీ అనకుండానే, మున్సిపల్ గెలుపు సాధించారు. అది కదా, గుంటూరు పౌరుషం అంటే? ఒంగోలు మంత్రి ఎమ్మెల్యే ఎవరినీ ఏమీ అనకుండా, గెలుపు సాధించారు. ఇదీ పౌరుషమే కదా? జనం లో తిరిగి, ధర్మవరం కేతిరెడ్డి గెలుపు ఇచ్చారు, అదీ పౌరుషం.

మనకు ఆదర్శం కొడాలి నాని, రోజా, పెద్దిరెడ్డి లా అరచే నోరు కాదు, మౌనంగా విజయం సాధించే, జగనన్న బాలినేని కోన, అలాగె పద్దతి గా విమర్శలు చేసే, సజ్జల, విజయ సాయి.

రేపు మా కరణం బాబాయి, అరే అబ్బాయి చీరాల జిల్లా తెచ్చాను, ఇంకా నన్ను ఒంగోలులో ఉంటున్నారు అంటావా విమర్శలు చేస్తావా అంటే నవ్వుతూ, ఊరుకో బాబాయి, ఎక్కడ ఉన్నా, పని సాధించావు, శభాష్ అనకుండా ఉంటామా? ఇదీ పౌరుషం కాదా?

అందుకే అరుపులు ఆవేశం కాదు, ఆలోచన కష్టపడి పనిచేయడం, మంచితో ఇతరుల ను ఆకట్టుకుని, వారి నోరు మూయించడమే, నిజమైన పల్నాడు, ఏ ప్రాంతమైనా, అలాగే రాయలసీమ పౌరుషం అయినా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 15-Mar-2021, Upd Dt : 15-Mar-2021, Category : Politics
Views : 356 ( + More Social Media views ), Id : 1034 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manly , masculinity , palnati , rayalaseema , good , virtue , unfortunate , jagan , ysr , balineni , sajjala , vijay sai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content