సూక్తము, మంత్రపుష్పం, పలకడములో కొన్ని దోషాలున్నా, స్పష్టముగా ఉన్నాయి. శూద్రులైతే వేదం? పట్టు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ నారాయణ సూక్తము, మంత్రపుష్పం, మీరు పలకడములో కొన్ని దోషాలు ఉన్నా కూడా, 5 నిమిషాలపాటు స్పష్టముగా నాభినుంచి పదాలు గట్టిగా పలుకుతున్నాయి. శూద్రులైతే వేదం చదవకూడదేమో? ఇంత పట్టు ఎలా వచ్చింది? మరి మిమ్మల్ని తోటి బాపనవారు ప్రోత్సహించారా?*

జవాబు - ధన్యవాదములు గురువు గారు. అవును, కొన్ని దోషాలు ఉన్నాయి మనం పలకడం లో లేదా మనం చూసి పలికిన పుస్తకం లో. కానీ, పెద్దలు విజ్ఞులు మన్నించాలి, అని ఎప్పుడూ తలవంచి సవినయముగా కోరతాను. కేవలము దైవారాధన తో, అందరినీ ప్రోత్సహించడానికి మాత్రమే, మనము గాయకులం కాదు, మధుర స్వరం అవసరంలేదు.

ఇవి అన్ని అందరమూ నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే సినిమా పాటల బదులు గా, వాక్సుద్ది, మానసిక బలం, అరిషడ్వర్గాల సాధన, మరియు ఆరోగ్యం కోసం కూడా సుమా. వీడు ఇంత స్పష్టముగా పలికినప్పుడు, మన తల్లి దండ్రుల పెంపకములో మేమెందుకు ఉచ్చరించలేము, దేవుని మెప్పించలేము అన్న, మంచి పోటీ రావాలి.

ప్రాణవాయువు నాభి నుంచి కంఠము దాకా, క్రమబద్దము గా తెచ్చి అలాగే ఆపి, స్పష్టముగా పలకడమంటే, రక్త ప్రసరణకు రోగ నిరోధకకు ఆరోగ్య వ్యవస్థకు, ఉచిత మందు కదా? బద్దకము నిర్లక్ష్యము అహంకారముతో, మనము వాటికి దూరము అయ్యాము, చేతగాని తనము తో మనలో కొందరు వాటిని ఎగతాళి చేస్తారు, ఇంకొందరు కొందరు వారి ఆధిపత్యం కోసం కావాలని మనల్ని దూరము చేసారు.

అంతెందుకు ఇప్పుడు వెళ్ళి ఎంపీ ని ఎమ్మెల్యేని సీయెం ని అడగండి - మా పిల్లలు కు మీ పదవులు ఉండ కూడదా ఇన్నాళ్ళు గా, ఎందుకు ఈ కుటుంబ వారసత్వ బానిసత్వం అని? వారి జవాబు ఒకటే, మీరు మా కుటుంబము లో పుట్టలేదు, మా అంత నల్ల డబ్బు లేదు, మా అంత ఘాతకాలు నమ్మక ద్రోహం చేయలేరు కాబట్టి అని మనసు లోపల జవాబు. బయట నటన జవాబులు చాలా ఉంటాయి, నమ్మవద్దు.

ఒకసారి పదవి అధికారం వచ్చిన తర్వాత మాత్రం, అగ్రవర్ణమైనా లేదా బడుగు బలహీన వర్గాలు అయినా, అందరిదీ ఒకటే మాట, మా కుటుంబం మాత్రమే పెట్టి పుట్టింది ఈ పదవికి, ఇంకెవరినీ కొత్తవారిని రానీయము మా వర్గాలలో కూడా అని.

100 ఏళ్ళ తర్వాత, మన బుర్ర తక్కువ బానిస మనవళ్ళు, మన గతించిన నాయకుల లిస్ట్ చూసి, మా తాతలు ముత్తాతలు ఇంత మూర్ఖులా ఎందుకు 2 కుటుంబాలకే వారసులకే పాద దాసులు అయ్యారు మనల్ని బలిచేసారు అని అనలేక ఒప్పుకోలేక, భారత రాజ్యాంగం అలా చెప్పిందా వారసులకే అధికారం అని, ఇది అన్యాయం అక్రమం అని మూర్ఖత్వము తో ప్రశ్నిస్తారు.

ప్రాంతానికి, కులానికి, వర్గానికి ఒక రాజ్యాంగం తెస్తారు, మరలా కసాయి ఆంగ్లేయులు ఔరంగజేబు లాంటి వారి చేతిలో చిక్కుతారు. వేదం లో చెప్పిన వ్యవస్థ బలమైనది. దేశం కోసం, ప్రాణ త్యాగం చేసే క్షత్రియులు ఆనాడు ఉన్నారు. మరి ఈనాడు ఎవరు ఉన్నారు?

అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం, అందరికీ సమాన హక్కు ఇచ్చింది. అలాగే వాల్మీకి వ్యాసుడు లాంటి వారు రాసిన/ చెప్పిన, వేదోపనిషత్తులు మరియు భగవద్గీత, కూడా అందరికీ సమాన అవకాశం ఇచ్చింది, కానీ మనం కులం ధనం అవకాశం అవసరం కు అమ్ముడుబోయిన నిక్రుష్టులం అని ఒప్పుకోలేరు కదా, మన రాబోయే మనవళ్ళు?

అసలు సనాతన ధర్మం ప్రకారం, పుట్టుకతో అందరు శూద్రులే. వీరే బలమైన వర్ణం, వర్గం. దేవుని పాదాలతో పోల్చబడింది. మనము, దేవుని పాదాలే మొదట పట్టుకుని శరణు వేడుతాము, చేతులు మొఖము కాదు కదా? మరి పాదాలు తక్కువ ఎలా? ఎప్పుడైతే బద్దకము తో దురాశ తో అరిషడ్వర్గాలకు బానిసలము అవుతామో, అప్పుడు విలువ కోలోతాము.

ఇప్పుడైనా ప్రజాస్వామ్యములో, పాదాలు అయిన ఓటర్లు, అంతే కదా? తమకు విలువైన ఓటు హక్కు ఉందని మరచి, నాయకుల ఉచిత తాయిలాలు కు, అవసర అవకాశాలకు, వర్గ కుల బేధాలకు దాసులు అయ్యారు. తప్పు ఓటరు ది కాదా? నాయకులది తప్పు ఎలా అవుతుంది?

మరి బలమైన గౌరవ శూద్రులము, మనము ఎందుకు విలువ పోగొట్టుకున్నాము? అరిషడ్వర్గాలకు లోనై, మన పిల్లలకు పాట మాట ఆట రామాయణము భారతము భగవద్గీత నేర్పలేక నే కదా? నోరు కూడా తిరగకుండా చేసింది మనమే. ఎమ్మెల్యె ఎంపీ ఎందుకు కాలేము, గుణమును చూసే గుణము మనకు లేదు కాబట్టి.

ముందుగా పుట్టుకతో అందరము శూద్రులలో పుట్టినా, మానసిక సంస్కారాలు చేయబడిన మరియు ఆచరించబడిన దానిని బట్టి మాత్రమే, శాస్త్రము లో చెప్పిన గుణ కర్మ వర్ణాలు వస్తాయి.

మనము బ్రాహ్మణులము కాకపోయినా, చిన్నప్పటి నుంచి, సూక్తాలు వినేటప్పుడు, ఒక విధమైన ఆలోచన ఆవేశం వచ్చేది, ఇవి మనము కూడా, రాగ యుక్తము ప్రయత్నము చేసి పాడితే ఎలా ఉంటుంది, మనకు నోటికి ఎందుకు తిరగవు అవి ప్రయత్నము చేస్తే అని. కాలేజీ రోజుల్లో నే, గుంటూరు మరియు పేట మధలో, ఓ ఊరి చివర గుడి దగ్గర సాయంత్రం ఓ అరగంట కూర్చుని వల్లె వేస్తూ ఉన్నాము, పురుష సూక్తం, మంత్రపుష్పం, లాంటివి.

ఊరి చివర వినాయక గుడిలో, దేవీ నవ రాత్రులకు, మనల్నే 9 రోజులు 9 మంది తో పూజ చేయమన్నారు. ఊళ్ళో పూజారు లందరినీ అడిగా, మీకు ఓకేనా అని. అందరూ, మీరు బాగానే చేస్తున్నారు, పర్లేదు చెయ్యండి అన్నారు. ఒక పూజారి పెద్దాయనను కూడా తోడు తెచ్చుకున్నాము, దంపతుల నమస్కారాలు మరియు దక్షిణ తీసుకోవడానికి మాత్రము.

అద్దెకు వైష్ణవుల ఇంట్లో ఉంటే, వారూ అందరికీ, మనల్ని మా వైష్ణవుల అబ్బాయి అని చెప్పేవారు, అదేమిటి అలా చెపుతారు అబద్దము కదా అంటే, పర్లేదు, నువ్వు బాగా పలుకుతున్నావు మంత్రాలు, ఎవరైనా అడిగితే, మంత్రపుష్పం నువ్వు చెపుదువు, ఎవరూ నోరు ఎత్తకుండా, అన్నారు నవ్వుతూ. మనకు, దొరికిన బ్రాహ్మణులు అందరూ, ప్రోత్సహించారు, పుస్తకాలు కూడా ఇచ్చి గౌరవించారు, గౌరవము గా చెయ్యమని చెప్పారు.

వారికీ చెప్పాము, ఇది కేవలం దైవం మీద భక్తి, ఇతరులకు ఆసక్తి కలిగించడానికి కోసమే, ధన సంపాదనకు కాదు అని.

Mantra Sukta, some flaws in your reading but clearly from the navel. Vedas read by Shudras? How to hold? Encouraged by Brahmin?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 26-Apr-2022, Upd Dt : 26-Apr-2022, Category : General
Views : 241 ( + More Social Media views ), Id : 1371 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mantra , sukta , flaws , reading , navel , vedas , shudras , brahmana , encouraged
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content