Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. యజ్ఞం, దానం, తపస్సు ఉంటే చాలు, మనసు ప్రశాంతత కు, దేవుని చూడటానికి మార్గం తేలికగా దొరుకుతుంది. లక్షల ఖర్చు తో హోమం లేదా అడవి కి వెళ్లి తపస్సు లేదా కోట్లు దానం చేయాలి అనుకుంటారు చాలామంది, అసలు విషయం తెలీక. అర్థం చేసుకుంటే చాలా తేలిక, మనం మనంతట మన స్ధలం లో, రోజూ వీటిని ఆచరించవచ్చు.
ఉదాహరణకు తేలికైన, ఇంట్లో అమ్మ సేవతో మొదలు పెడదాము. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆదాయం పోయి రోడ్డు న ఉన్నా, కన్న తల్లి తండ్రి ని రోడ్డు న లేదా ఇంట్లో ఒంటరిగా వదలను. మనకు, భార్య/ భర్త మరియు మన పిల్లల కు అందే ప్రతి సౌకర్యం గౌరవం, మన తల్లి దండ్రుల కు అందిస్తాను, అని మనసు తో మనస్పూర్తిగా చేయడమే ఒక మహా యజ్ఞం, అలా నిరంతరము ఆలోచన చేయడమే ఆచరణలో పెట్టడమే ఓ తపస్సు, దానికి వెచ్చించే శ్రమ సమయమే, సమయ దానం, శ్రమ దానం.
బీదవారైనా మధ్యతరగతి వారైనా, ఇంట్లోపెట్టుకుని తాము తినే ముద్ద పెట్టగలరు, ఎవరైనా చేయగలరు ఇవి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే, అంతా కష్టమే. అలాగే భార్య/ భర్త, తన సంతానం ను వదలను ఎటువంటి పరిస్థితి లో నైనా, ఇదీ ఒక యజ్ఞమే. మనకు చిత్తశుద్ది నిబద్ధత లేదా కనీసం వ్యామోహం కూడా లేనప్పుడు, ఒంటరిగా ఉండుటయే మేలు అంటారు పెద్దలు. భగవంతుడు ఏదో ఒక దోవ చూపుతారు, బతకడానికి లేదా మంచి మనసులను కదిలిస్తారు, తగిన సహాయం చేయడానికి.
ఈ పనులు చేస్తూనే, దేవుని నిరంతరం లేదా కనీసం 24 గంటల లో, 24 సార్లు అయినా తలవడమే, తపస్సు. ఈ 3 వచ్చిన వి కదా మన ఇంటి పనులలోనే? కోట్లు కావాలా, యాగం చేయాలా, అడవి కి వెళ్ళాలా? అవసరం లేదు కదా.
ఒక ఉద్యోగి లేదా ఎమ్మెల్యే లేదా ఎంపీ ని తీసుకోండి. తన కర్తవ్యాన్ని అంటే రాగద్వేషాలు లేకుండా, నీతి నియమాలతో, నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు అంటే, అది యజ్ఞం. ఆ వచ్చిన సాత్విక ధర్మ ఆదాయంలో, కొంత మంచి కార్యక్రమంలో ఉపయోగించడమే ధర్మం దానం. ఆ కర్తవ్యం ను, దేవుని స్మరిస్తూ చేయడమే, తపస్సు.
అలా కాకుండా, తన కర్తవ్యం ను నిబద్ధతతో చేయకుండా, పరుల లేదా ప్రభుత్వ సొమ్ము దోచి, లక్షల తో యాగాలు దానం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, ఫలితాలు శూన్యం కదా. వారి సంతానం భవిష్యత్తు, అంధకారంలో పడుతుంది. మన కళ్లు ఎదురు గా, వంద ఉదాహరణలు ఉన్నాయి. ఆలోచన చేయండి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,305; 104 తత్వాలు (Tatvaalu) and views 221,511 Dt : 06-Oct-2020, Upd Dt : 06-Oct-2020, Category : General
Views : 837
( + More Social Media views ), Id : 739 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
people ,
meaning ,
yajna ,
dana ,
tapas Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments