అనంతపురం కు చంద్రుడి లాగా, గంధపు వాసనల ప్రజా పనులతో - మొదటి డిపార్ట్మెంట్ సోషల్ మీడియా - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,588,025; 97 తత్వాలు (Tatvaalu) and views 199,694.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీ జిల్లా లో కూడా, ఇంత బాగా ప్రజల కోసం పనిచేసే, జిల్లా అధికారులు ఉన్నారేమో చూసుకుని, వారిని కూడా ఇలాగే సోషల్ మీడియా సమాచారం పెట్టమని, ఈ విషయములో అనంతపురం తో పోటీ పడమని చెప్పగలరు.

అనంతపురం జిల్లా, రాయలసీమలో కర్ణాటకకు ఆనుకుని ఉన్న, వెనుకబడిన జిల్లా. అనంతసాగరం అన్న పేరు నుంచి వచ్చింది అంటారు. కోస్తా లాగా, కావలసినంత నీరు దొరకదు అంటారు. పనుల కోసము, ఇతర జిల్లాలు లేదా ఎక్కువ దగ్గరలోని కర్ణాటకకు వెళుతారు.

1882 లో బళ్ళారి నుంచి విడదీసి ఈ జిల్లాను ప్రకటించారు, తర్వాత మరలా కడప మరియు బళ్ళారి నుంచి ఇంకొన్ని కలిపారు. జిల్లాను 63 రెవెన్యూ మండలాలతో కూడిన 5 రెవెన్యూ విభాగాలుగా విభజించారు (అనంతపురం -19, ధర్మవరం -8, పెనుకొండ -13, కళ్యాణదుర్గ్ -11, కదిరి -12).

ఆ జిల్లాకు, ఆకాశములో చల్లని నవ్వుల మనసున్న చంద్రుడిలాగా, సుగంధపు సువాసనలు వెదజల్లే ఉత్తమ ప్రజా పనులతో, కష్టపడి పనిచేస్తూ, ఇంటర్నెట్ టెక్నాలజీని సోషల్ మీడియా ని వాడుతూ, ఇతర జిల్లా అధికారులను కలుపుకుంటూ మార్గదర్శకం గా ఉంటూ, ప్రజలతో మమేకమై, జగనన్న పధకాల అమలునూ నిరంతరమూ, జాగ్రత్తతో పరిశీలించేందుకు, దేవుడు పంపిన వరం, ఆ జిల్లా కలెక్టర్, శ్రీ గంధం చంద్రుడు ఐయేఎస్ గారు.

కోవిడ్ సమయములో కూడా, నిరంతరము ప్రజలకు తగు సలహాలు ఇస్తూ, ప్రభుత్వ మరియు తన సొంత సోషల్ మీడియాలో కూడా, సమాచారము ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో, 2020 లో కూడా సమాచారం చెప్పని కలెక్టర్ లు ఉన్న ఆంధ్రాలో, చంద్రుడు గారు ఒక అడుగు ముందుకు వేసి ముందుగా, జిల్లా స్థాయి ఇతర అధికారులతో అంటే పంచాయితీ, రెవెన్యూ, మునిసిపల్, విద్య, ప్లానింగ్, డీఆర్డీయే, హార్టీకల్చర్, ఆరోగ్య, జిల్లాపరిషద్ అధికారులతో కూడా, సోషల్ మీడియా పేజీలు తెరిపించారు.

ప్రజలకు అధికారులను అందుబాటులో ఉంచారు, జిల్లా వ్యవస్థ పై తన సొంత బాణీ మరియు
పట్టును నిరూపించారు, కింద టేబుల్ లో చూడండి.

మీరు మీ జిల్లా అధికారుల, సోషల్ మీడియా అక్కౌంట్ లను లైక్ మరియు షేర్ చేసి, వారిని ప్రోత్సహించి, మీ జిల్లా ప్రజలకు తెలియ చేయ ప్రార్ధన. అలాగే, మీకేమైనా సమస్యలు ఉంటే, మీ జిల్లా అధికారులతో మాట్లాడవచ్చు, వారు ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా సోషల్ అక్కౌంట్ తో.

వేరే ఆంధ్రా కలెక్టర్లు ఇలాగే డిపార్ట్మెంట్ ప్రకారము, సోషల్ మీడియా పేజీలు తయారు చేసి ఉంటే, దయచేసి చెప్పగలరు. మా గూగుల్ వెతుకులాటలో కనపడలేదు.

ఇతర జిల్లా కలెక్టర్ లకు, మార్గదర్శకము అయ్యారు. సోషల్ మీడియాలో, చిత్తూర్ కలెక్టర్ గారికి పోటీలో ఉన్నారు, టాప్ 5 పొజిషన్ ల లో.

కొన్ని సోషల్ మీడియా ఇంప్రూవ్ చేసే సూచనలు :

1. జిల్లా స్థాయి ఇతర అధికారులతో సొంతముగా కూడా పోస్టులు పెట్టించాలి. అంటే, రెవెన్యూ అధికారుల మీటింగ్ మరియు వారి చర్యలు, సూచనలు. అలా ప్రతి డిపార్ట్మెంట్ వారు సొంతగా వివరాలు పెట్టాలి. ఇప్పుడు కేవలము, కలెక్టర్ గారి పోస్ట్ లనే, లైక్ షేర్ చేస్తున్నారు ఎక్కువగా.

2. జిల్లా లో మండల పట్టణ గ్రామ స్థాయిలలో కూడా సోషల్ మీడియా విస్తరించాలి. ఆర్డీవో, ఎమ్మార్వో, పంచాయితీ సెక్రెటరి, ఎంపీడీవో, మున్సిపల్ కమీషనర్, ఆరోగ్య, విద్య, డీయెస్పీ, సీఐ లో తో కూడా సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టించాలి.ఆల్రెడీ కనీసం ఒక ఊరుకు అయినా ఇవి ఉంటే, దయచేసి లింకు లు ఇవ్వగలరు, పదిమంది కి తెలియచేస్తాము.

3. తమ కలెక్టర్ల సంఘము సమావేశము లేదా గ్రూప్ లో, సోషల్ మీడియాతో ఎలా ప్రజలకు దగ్గర అవ్వాలో, ప్రభుత్వ పధకాల అమలు తీరును, ఎలా ప్రజల అరచేతి ఫోన్ లో ఉంచాలో వివరముగా చెప్పి, మిగతా అందరూ కలెక్టర్లు కు అవగాహన కలిగించాలి.

4. మన జిల్లా లో వివిధ శాఖల అధికారుల ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తున్నారు గాని, ట్విట్టర్ ఎకౌంటు లో మాత్రం అప్డేట్ చేయడం లేదు. అన్ని ఎకౌంటు లు, జూన్ లో ఆగిపోయాయి చివరసారి. గమనించగలరు, సంబంధిత శాఖల వారికి పంపగలరు.

చూడండి కొన్ని విజయాలు మరియు మానసిక వికాసం గురించి తమ ప్రజలకు చెప్పినవి -

* కోవిడ్-19 కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా, ఆంధ్రా ప్రభుత్వం, మహమ్మారిని ఎంతవరకు పరిష్కరిస్తుందనే, దాని ఆధారంగా జిల్లాల ర్యాంకింగ్ యొక్క ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకువచ్చింది. అనంతపురం, ప్రారంభమైనప్పటి నుండి మొదటి ర్యాంకును దక్కించుకుంది. సెప్టెంబర్ 29, 2020.

వసతులు, మానవ వనరులు తక్కువ ఉన్నా రికవరీ రేటు, యాక్టివ్ కేసుల రేటు, అలాగే మరణాల శాతాన్ని తగ్గించంలోనూ ఇలా 19 అంశాలపై నిర్వహించిన సర్వేలో అనంతపురం అగ్రస్థానంలో నిలిచింది - గ్రేట్ కలెక్టర్ గారు, శభాష్ అంటున్న జనం

* మీ సొంత కథను ఓ పుస్తకంలో చదివితే మీకు ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంటుంది కదా? బొజ్జా తారకం రాసిన పంచతంత్రం పుస్తకం చదివినప్పుడు నాకు అలానే అనిపించింది. ఇది సామాజిక అసమానతలతో పోరాడుతున్న గ్రామీణ నేపథ్యానికి చెందిన ఓ బాలుడి కథ. నాదే కాదు మీ జీవితంలో కూడా ఇలా అనేక మంది సామాజిక అసమానతలపై పోరాటం చేసి, వాటికి వ్యతిరేకంగా గెలిచిన వాళ్లు ఖచ్చితంగా ఉంటారు - సామాజిక సృహ ఉంది అనడానికి గుర్తు

* కొవిడ్‌ నియంత్రణలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి, వైద్యచికిత్సలు అందించడంతో రాష్ట్రంలోనే జిల్లాకు గుర్తింపు వచ్చిందని కలెక్టర్ తెలిపారు - తన సిబ్బంది త్యాగాల ని మెచ్చుకోలు

* కుల మతాలు గీచుకున్న గీతల చొచ్చి, పంజరాన కట్టు పడను నేను, నిఖిలలోకమెట్లు నిర్ణయించిన, నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను - కవిత్వం ఆయన గుండె లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి తరతరాల దుఃఖాన్ని, కన్నీటిగాథను వ్యక్తపరుస్తుంది.. ఆయనే మహాకవి గుర్రం జాషువా, 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి.

ధన్యవాదాలు, అనంతపురం కలెక్టర్ గారు. శిరస్సు వంచి నమస్కారములు.
Anantapur District Deptwise Social Media Links
SNoDeptName/ HeadSocial Media/ WebSite
నవీకరిస్తోంది (Latest Updated)
1Collector GovtSri Gandham Chandrudu IAS
2Collector SelfSri Gandham Chandrudu IAS
3Health-
4Education-
5DRDA-
6Revenue-
7Horticulture-
8Zillaparishad-
9Panchayatraj-
10Municipal-
11Planning-
12DWMA and NREGS-
13Agriculture-
If you find the dept head name and also other departments with social media links, please let us know. So that we will add to this list, which is usuful to other district collectors/ officers.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,025; 97 తత్వాలు (Tatvaalu) and views 199,694
Dt : 01-Oct-2020, Upd Dt : 01-Oct-2020, Category : Request
Views : 813 ( + More Social Media views ), Id : 731 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : moon , anantapur , public , works , sandalwood scents , first , dept , social media , collector , gandham chandrudu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content