మదర్ (మానవ) సేవయే మాధవ సేవ - దేవుని పూజ (థియరి), మానవ సేవ (ప్రాక్టికల్) - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,383,050; 104 తత్వాలు (Tatvaalu) and views 257,867.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఈ రోజు భీష్మ (జయ) ఏకాదశి. వాట్సాప్ స్టేటస్ లో మంచి వాక్యాలు అన్ని గమనిస్తున్నారు కదూ. వాట్సాప్ రీడ్ రిసీప్ట్ (చూసిన సంకేతము దాచటం) తీసి ఉంటే, ఉపయోగము లేదు, ఎటూ 2 గీతలు పడుతాయి. మీరు చూసింది కనపడితే, అప్పుడు మీకు ఎంత సాత్విక ఆలోచనలు వచ్చాయో తెలుస్తుంది.

మీరెన్ని చదివారు చూసారు అనే కన్న, మీరు ఎన్ని, మీ గురించి మంచి ఆచరణలు, మా లాంటి శిష్యుల కోసం, ధైర్యముగా స్వార్ధం లేకుండా, ఇతరుల బాగుకోసం, బయటకు చెప్పారు లేదా రాశారు అన్నదే, దేవునికి సాత్వికులకు ముఖ్యము.

మన వారు విన్నా వినకపోయినా, మంచి కోసం మనం మాటపడ్డా, కనీసం నోరు తెరచి మంచి విచక్షణ చెప్పకపోతే, చివరి రోజుల్లో, అలాగే మంచము మీద రోగాలతో, ఇబ్బందులు పడతాము అని భీష్ముని చివరి రోజుల సందేశం.

కానీ భీష్ముడు అద్రుష్టవంతుడు, చివరి క్షణములో నారాయణుడే, క్రిష్ణ రూపములో ఎదురు గా ఉన్నారు. ఉత్తరాయణము వచ్చే లోపునే, విష్ణు సహస్రనామలు కూడా చెప్పారు మనకు. యుద్దములో అర్జునుడితో పాటు గా, విశ్వరూపము భీష్ముడు కూడా చూసారు.

మొన్న 4 దేవుళ్ళ ఫోటోలు లింక్ లు పంపాను, అవి అన్ని ఇప్పుడు, గోడకు నిండుగా ఉన్నాయి.

ఈ రోజు నారాయణ అష్టోత్తరము తో పూజ గావించి, లక్ష్మీ నారాయణులను అలాగే మిగతా అందరు దేవుళ్ళను మన మంత్రాలతో ఇబ్బంది పెట్టి, 7 (75) ఏళ్ళ కూతురును తీసుకుని, ఏడాది రక్త పరీక్షకు, వెళ్ళాము. 2020 అసలు వెళ్ళ లేదు కరొనా భయముతో. ఏమీ తినకూడదు తను, అలాగే నేను తినకుండా వెళ్ళి, సూది పొడిచి రక్తము లాగుతుంటే, నారాయణా అని పాట పాడి, పిల్ల ను నవ్వించి బాధ తెలీకుండా, 9 కి ఇంటికి వచ్చిన తర్వాత పాలతో రొట్టె తిన్నాము.

అంటే, టిఫిన్ ఉపవాసము అయినట్లు, లేదంటే, 6 నుంచే వేపాకు కాకర రసము అన్ని బొజ్జ లో పడాలి కదా.

రాత్రి అంతా భయపడుతూ ఉంది కూతురు, నేను 8.30 దాకా ఆహారము లేకుండా ఎలా ఉంటాను బీపీ షుగర్ తో, నీరసం వచ్చి, పడి పోతాను బిళ్ళలు లేకపోతే అని, ధైర్యము చెప్పాను, హనుమతుడి లాగా నీ శక్తి నీకు తెలీదు, ఉండగలవు చూడు అని.

మదర్ (మన అమ్మ) సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. దేవుని పూజతో (థియరి) ఆగకూడదు, మానవ భౌతిక పూజ సేవ (ప్రాక్టికల్) కూడా కావాలి, త్రికరణ శుద్దిగా ధ్యాన సాధనతో, ఏదైనా నష్టపోతూ కూడా, ఏమీ ఆశించకుండా. అప్పుడే, పరమాత్మ ద్రుష్టిలో, మనకు ఇసుక రేణువు లో, అణువంత గుర్తింపు ఉండవచ్చేమో.

ఒకనాడు అందరూ ఎగతాళి చేసారు నవ్వారు, తాగవు తినవు చూడవు తిరగవు అనుభవించవు, సంపాదించి ఏ చేస్తావు, అంతకాడికి ఇంత దూరం ఇక్కడకు ఉద్యోగానికి వచ్చింది ఎందుకు, ఆస్వాదన ఆనందము లేని జీవితము ఉండి ఉపయోగం ఏముంది, భూమికి భారం తప్ప, నీళ్ళు లేని తొట్టి లో దూకక పోయావా, అని ఉడికించేవారు, తాము భౌతిక భ్రమలలో తేలుతూ, 14 ఏళ్ళు పైగా.

అన్ని విని నవ్వుతూ నవ్వుకుంటూ, నాదేముంది నిమిత్త మాత్రుడిని, నాకే తెలీదు ఎందుకు వచ్చానో, ఈ భూమితో బంధమేమిటో, ఎందుకు ఇలా గమ్ముగా అదుపులో ఉంటున్నానో, ఎవరు ఎందుకు ఉంచుతున్నారో, వారి భవిష్యత్ ఆలోచనలు ఏమిటో, ఆయనదే భారం అని అనుకుంటూ, అందరూ పార్టీలో ఉన్నా కూడా, 9-10 కల్లా పక్క గదిలో చాపమీద నిద్రపొయే వాడిని.

దానికి సమాధానం దేవుడు 14 ఏళ్ళ తర్వాత, అమ్మ రూపములో చూపించాడు, నేను నోరు ఎత్తకుండానే ఆయనే, ఓరి వెర్రి భ్రమల నాయనలారా, అంతా క్షణిక మాయ అని తెలిసి మీరేల ఇలా, వాడిని నేను, వాళ్ళ అమ్మ వైద్యానికి ముందు మెట్టు గా మాత్రమే అక్కడకు పంపాను.

ఆ గడ్డ (భూమి) వ్యాపకాలు సౌకర్యాలు వికారాలు తో వాడికి పనిలేదు, ఏ పిచ్చి వ్రుధా పనులు చేయకుండా, అన్ని మూట గట్టి ఉంచాను, ఇప్పుడు ఆ తల్లికి 7 ఏళ్ళు గా, రక్షణ ఇస్తున్నాను, ఆదాయము లేకపోయినా.

ప్రపంచ అనుభవం కోసం, నా దేవాలయ ప్రచారం కోసం, ఊళ్ళెమ్మట తిరగమని దేశమంతా తిప్పుతూ కూడా, రక్షణ గా ఉన్నాను, మితము ఖర్చుతో.

కాబట్టి, దైవం పేరుతో జరిగే పనులు, ఒకనాడు మూర్ఖము గా పిచ్చి తిక్కగా అందరికీ కనపడినా, గేళి చేసినా, వాటికి సమాధానం ఖచ్చితము గా భవిష్యత్ లో కనపడుతుంది. నేటి ఉపవాసాలు, వేప కాకర అల్లం వెల్లుల్లి రసాలు, 71 వారాల 108 ప్రదక్షణలు, నేల నిద్ర, శాఖాహారము, వీటికి కూడా భవిష్యత్ ఉపయోగము ఉంటుంది. ఏవీ వ్రుధా పోవు.

అలాగే మనము ఇప్పుడు రాక్షస ప్రవ్రుత్తి తో చెలిరేగిపోయినా, అహంకారము ఐశ్వర్యముతో కన్ను మిన్ను కానకపోయినా, దానికి ఫలితము భవిష్యత్ లో తప్పదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,383,050; 104 తత్వాలు (Tatvaalu) and views 257,867
Dt : 23-Feb-2021, Upd Dt : 23-Feb-2021, Category : General
Views : 1010 ( + More Social Media views ), Id : 986 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mother , human , service , madhava , worship , god , theory , practical
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content