పిల్లలకు తల్లి స్పర్శ ముఖ్యం, మరి ముదుసలి అమ్మ నాన్న కు? సజీవ గురు సేవ గా నేర్పామా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,645; 104 తత్వాలు (Tatvaalu) and views 225,926.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు, మనలో ముదుసలి తల్లి దండ్రుల పై ప్రేమ పెరిగి, దైవ మిచ్చిన మన సజీవ గురువులు గా, దగ్గర ఉంచి సేవ చేయడం తో నే, మొదలు కాదా? మరి పిల్లలకు నేర్పుతున్నామా, తాతా నాయనమ్మ ను దగ్గర ఉంచి అని మనము అందరము అనుకోవాలి సుమా.

అన్నా, ఏదో ఒకటి, ఏ ఆర్టికల్ / కధనం అయినా, అసలు ముక్కు మొఖం తెలీని వారు, 217 (పోనీ 100 అనుకో) మంది లైక్ తో చదివి అర్థం చేసుకుని ఇష్టపడ్డారు అంటే,

అసలు చదవకుండా లేదా చూసి చదివి గమ్ముగా చేతులు వేళ్ళు మనసు కళ్ళు కదలలేని దౌర్భాగ్య స్థితి లో, 3 ఏళ్లుగా, మా లాగా మొఖం తిప్పుకుని వెళ్ళినవారు, కనీసం ఓ 100 మంది అయినా అదనముగా అందులో ఉంటారు.

ఎందుకు అంటే, మంచికి వీరి మనసు స్పందించదు. ఇంకా చెప్పాలి అంటే, వీరు ఇంటి మనుషుల మంచికే పనికి రారు, అవకాశం అవసరం ఉంటే తప్ప.

మేము నిజాయితీ గా క్రుతజ్ఞల తో, తెలుగు లో సొంతం గా రాసి లేదా మాట్లాడి, మా బిడ్డలు ను, మీలాగా తెలిసిన ఓ పదిమంది ని, కేవలం తల్లి దండ్రల పెంపక సంస్కారం గుణం తో, దైవ అరిషడ్ వర్గాల సాధనతో, ఒప్పించేదెప్పుడు?

మమ్మల్ని మేము, మా మోక్షం కోసం, దైవం వైపు తిప్పుకునేది ఇంకా ఎప్పుడు, సగం వయస్సు అయిపోయింది?

రూపాయి ఖర్చు లేని, తరగని స్ధిరమైన గుణాలతో గతం గుర్తు ఉంచుకుని, విశ్వసనీయత కృతజ్ఞతలు ఆధ్యాత్మికత పెద్దలయెడ భక్తి గౌరవం సజీవ గురువు సేవతో, నేల నిద్ర, శాఖాహారం తో 135 వారాల 108 ప్రదక్షిణలు? ఆ ఆయుర్వేదం ఏమిటి, వేపాకు కరేపాకు కాకరకాయ ఏమిటో, అమ్మ కు భయపడి కరోనా దూరం ఏమిటో? శ్లోకాలు పద్యాలు సూక్తాలు అసలు మా ఇంట్లో ఎవరికీ నోరు కూడా తిరగవు. ఇంకా ఎన్నో. అన్ని విచిత్రాలే.

అసలు ఆదాయం లేకుండా 3 ఏళ్ళు పైన, అలాగే అప్పు లేకుండా, చేయి చాచకుండా, సౌకర్యాలు తగ్గకుండా, మధ్య తరగతి మనుషులు కు ఎలా సాధ్యం? ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నా. ఖచ్చితము గా దైవ లీల, అండ.

అదీ అందరితో ధైర్యంగా చెబుతున్నారు, దాచకుండా కూడా. ఇతరులు ఆదాయం లేకపోయినా, అబ్బో మాకు చాలా వస్తుంది అని అబద్దాలు చెపుతారు, ఎంతో అప్పులు ఉన్నా, వాటి విషయం చెప్పరు.

మా బంధువులు, ఒక్క నెలకే ఆదాయం లేకపోతే ఖర్చు భరించలేక , భార్య ను పుట్టింటికి పంపారు.

ఇవన్నీ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నాయి, అందరూ చేయగలిగేవే. కానీ మేము చేయలేం, బద్దకం, నిర్లక్ష్యం అంతే, మా వలన కాదు. సిగ్గు విడిచి ధైర్యంగా చెబుతున్నా. ఎందుకంటే కపటం నటన వద్దు, రాక్షసులు గా అయినా నిజాయితీగా ఉందాం అన్నావు.

ఆ మాట నచ్చింది, రాక్షసులు కన్నా ఎందుకు దిగజారాలి? అంత ఖర్మ ఏం వచ్చింది, మనకు, ఇంకా ఎందుకు దిగజారాలి, ఈ వయస్సు లో? మన ఆత్మను మనమే ఎందుకు మోసం చేసుకోవాలి? మా పేరెంట్స్ కు అవమానం.

ఇంకా దిగజారితే, వయస్సు ఉడిగిన తర్వాత, పిల్లల చేతిలో, ఫలితాలు ముప్ప తిప్పలు ఎటూ తప్పవు. ఇంట్లో ఎటూ 100 సమస్యలు. ఇక నుంచి, నిజమే మాట్లాడుతా. 2 నాల్కలు నాటకం ఉండవు.

అలా ఇప్పుడైనా బుద్ది తెచ్చుకుని చేయలేకపోతే, మా పిల్లల కు సంస్కారం నేర్పామని 10 ఏళ్లు పై గా, బల్లగుద్ది ఎలా చెప్పగలం?

మరి ఇన్నాళ్ళ మా పై పై చిత్తశుద్దిలేని నటన పూజలు అలంకారాలు ఆడంబరాలు ఖర్చు ప్రయాణం అన్ని, బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే మా బుద్దులు తప్పులు అహంకారాలు వ్యామోహం లు ఇంచె కూడా, ఇన్నాళ్లు గా ఆచరణలో మారలేదు.

అందుకే కదా మా పిల్లలు, మమ్మల్ని వృద్ధులు ఆశ్రమం లో లేదా దూరంగా ఇంట్లో విడిచిపెడుతుంది, మొఖాన పది రూపాయలు పడేసి. మాట వినేవారు, అమ్మా అయ్యా అని లాలించేవారు ఒక్కరూ లేరు, వారి అవసరాలు తప్ప. చేసుకున్న వారికి చేసుకున్నంత.

పసిపిల్లలకు తల్లి చేతి స్పర్శ ఎంత ముఖ్య మో, ఎంత ధైర్య మో, ఎంత ఆప్యాయత నో, ఎంత ప్రేమనో, 60 పైబడిన మన ముదుసలి అమ్మ నాన్న కు, తమ పిల్లల చేతి స్పర్శ రోజూ, అలాగే ఉండాలి, అదే కొండంత ధైర్యం ఆరోగ్యం శ్రీ రామ రక్షణ, అని మా బండ పిల్లలకు అర్ధము అయ్యేలా చెప్పలేని దౌర్భాగ్యులము. అదే సజీవ గురు సేవ అని, మేము చేసి కూడా చూపలేదు, నేర్పలేదు.

ఇది తెలీని అభినవ నటనా మూర్ఖులు, తమ పెద్దలు ను గాలికి దూరంగా వదలి, పరాయి భాషల బాబాయి ల వెంట పడి, విగ్రహాల కాళ్ళు గడ్డాలు పట్టుకుని, యాత్రలు అంటూ, రోజూ నటిస్తున్నారు.

ప్రాపంచిక మోహం, అరిషడ్ వర్గాల బానిసత్వం, మేము వీడము ను గాక వీడము. మీరు మోహం నుంచి మమ్మల్ని బయటవేయడం కు ప్రయత్నం, మానరు గాక మానరు. మా బతుకులింతే మా పతనమింతే, మీ బతుకులంతే మీ సాధన అంతే.

మీరు నిండా మునిగిన కష్టం లో కూడా, ఉచితంగా మమ్మల్ని వదలకుండా, తట్టి లేపుతూ నే ఉన్నారు.

అమ్మ అదృష్టవంతురాలు, కన్నతండ్రి లా చేతులు పట్టినడిపే బిడ్డ, ఈ విషయంలో ఈర్ష్య గా ఉంది.

కానీ తన ఇన్నాళ్లు నిజాయితీ కి సంస్కార పెంపకం కు, మంచితనం కు ఫలితం దక్కింది.

దైవం అండగా నిలచింది, సత్యం నిలిచింది గెలిచింది, మన పుణ్యం మనకు తిరిగి వస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం, మా ఎదురు గా ఉంది, ఈ తూలిపడే 76 ఏళ్ల వయస్సు లో, ఇన్ని అనారోగ్య సమస్యలు తో కూడా, 8 సంవత్సరాలు గా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,645; 104 తత్వాలు (Tatvaalu) and views 225,926
Dt : 23-May-2022, Upd Dt : 23-May-2022, Category : General
Views : 535 ( + More Social Media views ), Id : 1402 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mother , mom , touch , kids , older , dad , parents , teach , living , guru , seva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content