ప్రశాంతంగా మానసిక శాంతి, దైవ నామ స్మరణ తో ఉంచగలరు. ఎంత ధనమైనా ఇస్తే? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1113 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

ఏవండీ, 75 ఏళ్ల అమ్మ ని, 7 ఏళ్లుగా దగ్గర ఉంచి, ఇంటి వైద్యం, రోజూ నడక, శని గుడి ప్రదక్షిణలు, అంతా వింతగా ఆశ్చర్యం గా ఉంది. మాకు ఆస్తి కి లోటు లేదు, కానీ ఇంత బాగా చూసే, ఓపిక సహనం నేర్పు లేవు.

మా దగ్గర చూసినా, బయట దగ్గర ధనముతో పెట్టిన, రోజులు గడుస్తాయే గాని, పురాణాలు చెప్తూ ఇంత బాగా చూడటం కష్టం.

వారిని నాకన్నా, మీలాంటి వారే, మంచి గా ప్రశాంతంగా మానసిక శాంతితో, చివర రోజుల లో దైవ నామ స్మరణ తో ఉంచగలరు పంపగలరు. మీకు ఎంత ధనమైనా ఇస్తే, ఏమైనా?

జవాబు, ధన్యవాదాలు మనసు విప్పి, వాస్తవం ఒప్పుకున్నందుకు, మీ గురించి.

చాలా మంది, తమకు ఓపిక లేదు, వల్ల కాదు, ఇంట్లో తంతారు, ఆత్మ ను కట్నం ఉద్యోగం అందం కు అమ్ముకున్నాం తలవంచాము, అనే వాస్తవం ఒప్పుకోకుండా, భాగస్వామి మీద పడి ఏడుస్తూ ఉంటారు.

లేదా తల్లి దండ్రులు మీద నెపం వేసి, వారు రారు రాలేరు, ఇక్కడ అక్కడ నచ్చదు లేదు, కరోనా తో పోకుండా ఇంకా మిగిలి మా నెత్తిన పడదామని వారు ఉంటే, వచ్చే సంవత్సరం తెస్తాము అని ప్లాన్ చేస్తున్నాం, అని నోటికి వచ్చిన అబద్ధాలు, కన్నవారిమీదే ఆత్మ సాక్షి గా చెపుతారు.

మీరు ముందు చూపుతో, వారికి ఉత్తమ ఆరోగ్య మానసిక రక్షణ, ఆనందం ప్రశాంతత ఇవ్వాలని భావించడం, చాలా గొప్ప విషయం. కానీ ధనమెంతైనా అన్నారు చూసారా, అదే కొంచెం ఇబ్బంది గా ఉంది.

ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా, రెండు ఆస్తులు కు వారి ధనానికి, రెండు పదవులు కు, రెండు వంశాలకు, రెండు గొప్పలకు చేస్తున్నారు, కానీ రెండు మనసు లకు, రెండు గుణాలకు, రెండు సంస్కారాలకు, రెండు అలవాట్లు కు అభిరుచులకు, పోల్చి చేయడం లేదు.

అందుకే పెళ్ళిళ్ళ సంఖ్య కు ధీటుగా, విడాకుల సంఖ్య కూడా సమానంగా ఉంది, సంవత్సరం లోపే, లాయర్లు పోలీసులు టీవీ పత్రికల పంట పండుతూ, రెండు కుటుంబాలను బజారు కు ఈడుస్తూ ఏడుస్తూ ఏడిపిస్తూ, ముందుకు సాగిపోతున్నాము.

వాళ్ళిద్దరూ మాతో ఉండి, తినే తిండి కి పెద్ద ఖర్చు కాదు. కానీ వాళ్ళు, మన క్రమశిక్షణ కు ఆరోగ్య పద్దతులు కు, అణుగుణంగా సర్దుబాటు చేసుకోగలరా? అది ముందు అడిగారా వాళ్ళను వివరముగా చెప్పి, వారు అంగీకరించారా?

కాబట్టి మొదలు వారిని అడగండి ఇవన్నీ చెప్పండి, ఉదయం 5 కి లెగవడం, చెంబు నీళ్లు తాగడం, వేపాకు పొడి తినడం, కాకర అల్లం వెల్లుల్లి పచ్చి రసం తాగగలరా, చక్కెర వేపుళ్ళు అలాగే మాంసం కు దూరంగా ఉండగలరా, అర మైలు అయినా నడవగలరా, శనివారం గుడి, రోజూ అరపేజీ రామకోటి రాయగలరా. సాత్వికులకు, ప్రాపంచిక మొహము బయట ఉన్న వారికి, ఇవి చాలా తేలిక. కాని రాజస తామస గుణాల వారికి ఇది నరకము.

ఇవన్నీ పాటించాలి అంటే, వారికి ఇష్టం లేకపోతే, కష్టం గా ఉంటే, ఒక రోజులో పారిపోతారు, మమ్మల్ని శాపనార్థాలు పెట్టి, వామ్మో ప్రాణాలు తీస్తున్నారు అని. కాబట్టి వారికి ఇవన్నీ చెపితే, ఇక మన బజారు లోకి కూడా బహుశా రాకపోవచ్చు.

2014 లో , విదేశీ డాక్టర్, ఇక సంవత్సరం లోపు ఉంటే అమ్మ గొప్పే అని చెప్పారు, 400 షుగరు చూసి. పైన వన్నీ అమలు చేస్తూ, కూతురు లాగా ప్రేమగా చూసుకుంటూ, లక్షల ఖర్చు వెనకాడకుండా, ప్రభుత్వ ఉద్యోగం కూడా మానేసి, ఆరోగ్య నియమాలు కఠినంగా పాటింపచేస్తూ ఉండబట్టే, ఈరోజు న ఇంకా అమ్మ ఉంది. లేకపోతే, గతించి 5 ఏళ్ళు అయేది, 5 తద్దినాలు జరిగేవి.

ఇప్పుడు మీరు చెప్పండి, పెద్ద వాళ్ళను సొంత కూతురు కొడుకు లాగా, కృతజ్ఞతలు తో ప్రేమగా బాధ్యత గా చూడటం కూడా, ఓ కళ కాదా? చాలా కష్టం సుమీ. మీరేమంటారు?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1113 General Articles, 47 Tatvaalu
Dt : 01-Apr-2021, Upd Dt : 01-Apr-2021, Category : General
Views : 81 ( + More Social Media views ), Id : 1067 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old age , parents , mental peace , happy , purana , chant , divine name , caring , money
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content