జనం సొమ్ము పధకాల నాయకుల పేర్లు - అపార్ట్ మెంట్ లో పేరు కోసం వాచ్మెన్ కుటుంబ ఆవేదన - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1396 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1428 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒక వాచ్మెన్ అంటే కాపలాదారు ప్రశ్న - మా నాన్న, నేను, బంధువులు అందరం, ఈ అపార్ట్ మెంట్ కు మనుషులకు కాపలాగా ఉన్నాం, ఎన్నో ఏళ్లుగా.

మోదీ, చంద్రన్న, జగనన్న కూడా చౌకీదారులే ఈ దేశ రాష్ట్రాలకు, మోదీ స్వయంగా చెప్పారు. అందరూ దానిని ఒప్పుకున్నట్లే, వ్యతిరేకించలేదు. అందరూ కేవలం ప్రజా సేవకులే కదా? ఎక్కడైనా సేవకుడు, తన పేరు పెడతారా పధకాలు కు? అంటే అబద్ధాలు చెపుతున్నారా? నటిస్తున్నారా?

మరి చంద్రన్న జగనన్న, మన రాష్ట్రం కు, కాపలాదారులైనప్పుడు ఓ 5 ఏళ్ళు, ప్రజా పన్నుల ధనం తో పధకాలు కు, వాళ్ళ పేర్లు పెట్టడం కరెక్టు అయితే, మరి ఈ అపార్ట్ మెంట్ భవనం కు, ఏళ్లుగా కాపలాగా ఉండి, ఇంతమందికి జనానికి సేవచేస్తున్న కాపలాకాస్తున్న, మా పేర్లు కూడా పెట్టాలి కదా?

భవనం మొత్తానికి, మా నాన్న పేరు రంగన్న భవనం అని, బేస్మెంట్ కు నా పేరు సుబ్బయ్య బేస్మెంట్ అని, ఒకటో ఫ్లోర్ కు మా బాబాయి పేరు నారాయణ ఫ్లోర్ అని, రెండో ఫ్లోర్ కు మా అబ్బాయి పేరు నరసింహ ఫ్లోర్ అని పెట్టమంటే, తప్పా? మోటారు కు మా ఆవిడ పేరు, లక్ష్మీ మోటర్ అని , లిఫ్ట్ కు ఇంకో బాబాయి పేరు సూర్య లిఫ్ట్ అని పెట్టమని అడగడం తప్పా? నీటి పధకం, చెత్త పధకం, బజారు పధకం, శుభ్రత పధకాలు అన్నిటికి, ఫ్లెక్సీ లోఅ ఫోటోలు తో, ప్రతి ఫ్లోర్ కి మా కుటుంబ పేర్లు పెట్టవద్దా?

అపార్ట్మెంట్ వాళ్ళు, మమ్మల్ని సిగ్గు లేదా ఇంగితజ్ఞానం లేదా, మేము 20 మందిమి కష్టార్జితముతో కట్టుకుని లేదా కొనుక్కున్నది, జీతం ఇచ్చి సహాయం చేస్తావు, మా క్షేమం కోరతావని కొంతకాలం నమ్మి పెట్టుకుంటే, ఇంత కక్కుర్తి స్వార్థం తో మోహం వ్యామోహం లో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతూ, నీ క్షేమం నీ ప్రచారం నీ ఫోటోలు నీ గుర్తు లు కావాలంటావా? నీ పేరు పెడతానికి, నీ జేబు నుంచి చిల్లిగవ్వ ఉందా? ఎందుకు పెట్టాలి మీ పేర్లు అంటున్నారు. పోయి, మీ ఇంటికి పెట్టుకో అంటున్నారు.

చంద్రన్న తోఫా, జగనన్న విద్య, ఎన్టీఆర్ రాజన్న ఆరోగ్య శ్రీ, పేర్లు తప్పు కానప్పుడు, ఐయేయెస్ అధికార్లు ఒప్పుకున్నప్పుడు, మా కోరిక తప్పా?

న్యాయం మీరే చెప్పండి, తెలుగు రాష్ట్రాల నాయకులు కు ఒక న్యాయం, మాలాంటి సామాన్య వాచ్మెన్ లకు, ఒక న్యాయమా? మా చిన్న కోరిక తప్పా? తెలుగు నాయకులే మోదీ గారిని, ఫాలో కానప్పుడు, మేమూ మా అభిమాన తెలుగు నాయకుల, పేర్లు, ప్రచారం ను ఫాలో కాకూడదా?

తెలుగు నాయకులు కేవలం, వాళ్ళు పేర్లు, తండ్రి లేదా మామ పేర్లు అడిగారు స్వార్థం తో. నేను నిస్వార్థంగా మా బాబాయి లు, ఆవిడ, పిల్లల పేర్లు కూడా అడిగా, మొత్తము కుటుంబం గురించి. అంటే కనీసం 5 మంది పైగా పేర్లు అడిగా? 2 పేర్లు తో వెళ్ళే నాయకులు ది తప్పా, 5 పేర్లు అందరికోసం అడిగే నాది తప్పా, అధ్యక్షా?

జవాబు, ఏవండీ న్యాయం ధర్మం వేరు, మన స్ధానిక ధర్మం వేరు. మోదీ గారి లాగా ఆదర్శంగా ఉండి, ఛీఛీ మేము చౌకీదారులం మాత్రమే, మా పేర్లు వద్దు అనుకుంటే నిస్వార్థంగా, ఇక సీబీఐ ఎంక్వైరీలు ఉండవు, అందరూ నిజాయితీగా చేస్తే.

కాబట్టి, మీ స్ధానిక నగర తెదేపా మరియు వైకాపా పార్టీ నాయకులు దగ్గరకు వెళితే, తగిన న్యాయం చేస్తారు. బహుశా, మీరు చెప్పింది కరెక్టే అని అపార్ట్మెంట్ ఓనర్ తో చెప్పి ఒప్పిస్తారో లేక తమ పార్టీ నాయకులు కు చెప్పి, సరిచేస్తారో వారి విజ్ఞతకే, వదిలేయి. వారు పెద్దలు కాబట్టి, వారి మాటే వినాలి.

ఇప్పుడు అయినా, నాయకులు, మోదీ లాగా ఆదర్శంగా ఉండి , ఉత్తమ పన్ను దారుల పేర్లు పెడుతూ , పన్నులు కట్టే జనాన్ని పెంచి ప్రోత్సాహం చేస్తూ, వారికి రావల్సిన పుణ్యం, పేరు ప్రతిష్టలు, పెంచుతారని ఆశిద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1428 General Articles, 48 Tatvaalu
Dt : 11-Oct-2020, Upd Dt : 11-Oct-2020, Category : Politics
Views : 515 ( + More Social Media views ), Id : 749 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaders name , public money , schemes , watchmen , family name , apartment , complex , floor
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content