Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. తెలుగు భాషే రమ్యం, తెలుగు వారి సేవే గమ్యం అనే అందమైన పదాలు, సంస్థ అధ్యక్షుల మరియు కార్యవర్గ సభ్యుల, చేతలలో నడవడికలో రాతలో వ్యక్తిత్వము లో, ఉన్నాయా? వారు సాగిస్తున్న నాన్ ప్రాఫిట్ సేవలలో నిజము గా ప్రతిబింబిస్తాయా?
గత ఏడాది, తానా ఎన్నికలు చూసాము, ఏకగ్రీవ బానిసత్వ సంకెళ్ళు తెంపుకుని, ప్రజాస్వామ్య పద్దతిలో దానిని గౌరవిస్తూ, 3 అభ్యర్ధులు ధైర్యముగా అధ్యక్షులు గా నిలబడి, దేశమంతా కోవిడ్ సమయం లో తిరిగి, తప్పులు ఒప్పులు వివరించి పోరాడి, తమ వంతు క్రుషి చేసారు. కొంతమంది మనసును అభిప్రాయాలను తెలుసుకో గలిగాము.
ఓడినా, గెలచినా - తమ వ్యక్తిత్వాన్ని ఘనముగా చాటుకున్నారు ఆత్మాభిమానం గల మనుషులుగా, సంస్థ పేరు నిలబెట్టారు.
తానా మాత్రమే కొత్త ఒరవడి స్రుష్టించగలదు, అలాగే కొత్త సంఘాలకు మూలం గా నిలబడగలదు అని ఎన్నోసార్లు నిరూపించింది. ఆ అభ్యర్ధులకు కూడా, మన 20 ప్రశ్నలు పంపాము. Please see article
link.
మరి కొన్ని సంస్కరణలు తో అయినా, మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ, అవినీతి ఆశ్రిత పక్షపాతం రాజకీయ అనుబంధాన్ని తగ్గించి, సోషల్ మీడియాలో తెలుగు చదవడం రాయడం వచ్చిన, అలాగే తమ ముదుసలి కన్న తల్లి దండ్రులను ఇంట్లో పెట్టుకుని సౌకర్యాలు కల్పించి సేవ చేస్తున్న, అమెరికన్ పౌరసత్వం ఉన్న నాయకులను ఎన్నుకునే, అమెరికాలో స్థిరపడిన వారికి సేవ చేసే, విధముగా బైలాలో స్పష్టము గా మార్చి, ప్రగతికి అడుగులు పడతాయని ఆశిస్తున్నాము.
ఎందుకంటే, ఈ లక్షణాలు లేకుండా, సొంత భాషకు సొంత వారికి సేవ చేయకుండా, ఇతరులకు సేవ చేస్తామని అబద్దాలతో ఆర్భాటాలతో, మన తెలుగు రాష్ట్రాల ఎన్నికలను తలపిస్తున్నారు, తప్పుడు పద్దతులు మెంబర్షిప్ మోసము బాలెట్ కలెక్షన్ లాగా వీలైనన్ని పక్క దోవలలో, నీతి నియమాలను దిగజార్చి.
ఇప్పుడు ఇంకొక గొప్ప సంస్థ కూడా, తమ ఎన్నికల సంబరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి వీరు కూడా మన 20 ప్రశ్నలు చదివి, ఎన్నికల పద్దతిలో కొన్ని మార్పులు అయినా చేసి, తమకు చిత్తశుద్ది ఉంది, ఇక నుంచి అయినా, మంచి సాంప్రదాయాన్ని పాటిస్తాము అని జవాబు ఇస్తారు అని ఆశిస్తున్నాము.
వీరి గురించి ఒక గొప్ప చెప్పుకోవాలి - తానా మరియు అటా కు ఉన్న రాజకీయ అత్మీయ చాటు బంధాలు, అంత పెద్దగా నాట్స్ వారికి లేవని, జనము అంటున్నారు. మరి అది నిజమైతే, తమను తాము సంస్కరించుకోవడానికి వెనుకాడరు. మీకు సభ్యులు తెలిసి ఉంటే, వారికి ఇవి పంపి, చైతన్య వంతులను చేసి, మంచి త్రికరణ శుద్ది ఉన్న నాయకులను ఎన్నుకునే ఆలోచనలు ఇవ్వగలరు.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) లో రెండేళ్ల కాలవ్యవధి, 2022-2024 కి సేవ చేయడానికి ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి, సంయుక్త కోశాధికారి, 8 జోనల్ మండల ఉపాధ్యక్షులు మరియు జాతీయ సమన్వయకర్తలు (President, Vice-Presidents, Secretary, Treasurer, Joint Secretary, Joint Treasurer, 8 Zonal Vice Presidents and National Coordinators) గా అభ్యర్ధులను ఆహ్వానిస్తుంది.
1* చిత్తశుద్ధి, నైతిక బాధ్యత కలిగి ఉండాలి (ఇంట్లో అందరికి తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి, అమెరికా పౌరసత్వం ఉండాలి, తెలుగు రాజకీయ బంధం లేదు అని అఫిడవిట్, ముదుసలి తల్లి దండ్రులు ఉంటే ఎన్ని ఏళ్ళు గా అమెరికాలో ఉంచారో కూడా అర్హత గా ఉంచాలి)
2* ఇమేజ్‌కి అనుగుణంగా వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలి. మొదటి దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం స్పష్టం గా ఉంటుంది కదా?
3* అతని/ఆమె నియామకానికి ముందు 2 లేదా 4 సంవత్సరాలు స్థిరంగా పనిచేసి ఉండాలి ( ఈ బానిసత్వం అవసరం లేకుండా ఉండాలి - ట్రంప్ ఎంటీయార్ లేదా ఇతర తెలుగు నాయకులు నేరుగా ఎన్నిక అయ్యారు ఎటువంటి అనుభవం బానిసత్వం గూడుపుఠాని లేకుండా)
4* అన్ని దరఖాస్తులను 5 మే 2022 లోపు పంపితే, సెలక్షన్ కమిటీ 15 మే 2022 నాటికి NATS బోర్డుకి సిఫార్సు.
సభ్యులు అంతా 20 ప్రశ్నలు చదివి, కనీసం కొన్ని మార్పులు అయినా తెచ్చి, పోటీ తత్వం ఉన్న అభ్యర్ధులనే నిలబెట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిద్దాము.
మీకు ఏమైనా సమాచారము తెలిసిన, మాకు పంపగలరు.
ఎందుకంటే, ఎప్పటి లాగనే, తెలుగు రాష్ట్రా ప్రధాన పార్టీ అధిష్టానం నాయకులతో పంచుకోవడం జరుగుతుంది, మంచి కోసం మాత్రమే సుమా.
NATS 2022 Service Interest Integrity Candidates Election Celebration - With New Trend as Ideal Telugu Elections?
Sreedhar Appasani, Immediate Past Chairman. Vijay Sekhar Anne, President.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,491; 104 తత్వాలు (Tatvaalu) and views 254,487 Dt : 27-Apr-2022, Upd Dt : 27-Apr-2022, Category : News
Views : 1107
( + More Social Media views ), Id : 1373 , Country : USA
Tags :
nats ,
candidates ,
usa ,
telugu ,
elections ,
Anne ,
Appasani ,
tana ,
ata ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments