నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా, డుగు డగు, అందాల దునియానే చూపిస్తా పా, చిక్కు చిక్కు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1244 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1274 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కాల చక్రము తిరిగి తిరిగి, మరలా అక్కడికే వస్తుంది అంటే, ఇవేనేమో ఉదాహరణలు, అనుభవజ్ఞులు చెప్పగలరు.

కరోనా, ఎన్నో పాత సాంప్రదాయాలను, గుర్తు చేసింది.

అందుకే పెద్దల మాట సద్ది మూట, బామ్మ మాట బంగారు బాట అన్నారు, అంటే ఏనాటికైనా విలువైనది మరువలేనిది అని అర్థం.

ఒకనాడు పెళ్ళి చూపులు అంటే, అమ్మాయికి సాంప్రదాయ సంగీతము మరియు న్రుత్యము వచ్చునా, అని అడిగే వారు.

వీరు కూడా, ఆనందము గా ఓ పాట సొంతముగా పాడి, ఏదో ఒక డాన్స్ వేసే వారు. పెద్దలు కూడా ప్రొత్సాహము చేసే వారు, ప్రతి మనిషికి ఏదో ఒక కళ ఉండాలి అని.

అదీ కేవలము, తమ ఇరువైపుల తెలిసిన స్నేహితులు బంధువుల మధ్యలో, అంటే, కేవలము 10 మంది లో, ఇంటి లోపల జరిగే ప్రవేటు కార్యక్రమం, దానికే చాలా సిగ్గు పడుతూ ఇబ్బంది పడేవారు.

ఆ అడగడము లో అంతరార్ధం, ఇంటికి దీపము ఇల్లాలు అని, తన గుణము, మానసిక శారీరక స్థితి బాగుండాలి, సాత్వికత, గుర్తు పెట్టుకోవడము, వ్యాయామము, గొంతు మాధుర్యము, చలాకీతనము, నేర్చుకోవాలన్న అభిలాష, పెద్దల యందు గౌరవము, అన్ని కనపడేవి.

అవన్నీ బాగా ఉంటే, పిల్లల పెంపకం, ఇంటి గౌరవం, బాగుండేది అని ఆనాటి వారి అభిప్రాయం.

సినిమాలో అవన్నీ చూసాము. కొంతమంది అబ్బాయిని కూడా అడిగే వారు, సంగీతము లేదా పాటలైనా వచ్చా అని.

శంకరాభరణం సినిమాలో, ఇద్దరూ పాట పాడతారు కదా, చంద్రమోహన్ మరియు రాజ్యలక్ష్మి.

తర్వాత రోజుల్లో, చాదస్తము ఇది, మేమెందుకు పాట మరియు డాన్స్ నేర్చుకోవాలి, అర్ధము కాని చదువుల్లో అయోమయములో మునిగి తేలుతూ ఉంటే, అని పక్కన పెట్టారు.

మేము ఎందుకు, పది మంది ముందు డాన్స్ వెయ్యాలి అని, ఈ పద్దతి బాగోలెదు, మాకొద్దు అని, మొత్తము మానేసారు. ఆ తర్వాత, ఎవరూ అడగడం లేదు, ఎవరూ పాటలు పాడడం లేదు.

అంత ఓపిక కూడా, చాలా మందికి లేదు. కానీ సినిమా పాటలకు, ఇళ్ళలో డాన్సులు మాములు గా వేయడం, అందరికీ తెలుసు.

సాంప్రదాయాలను, గుణ గణాలను పక్కన పెట్టి, కేవలము ఆస్తి ఉద్యోగం హోదా మాత్రమే చూసి, పెళ్ళి చేసి చేతులు దులుపుకుని, నెత్తిన భారం వదిలించుకుని, బయటకు ఏదోలా పంపే, దగ్గరకు వచ్చాము.

తర్వాత వాళ్ళు ఎట్లన్న కొట్టుకోనీ, టీవీ స్టేషన్లు ఉన్నాయిలే భరించడానికి అని.

ఇంకొంత మంది, అసలు పెద్దలే వద్దు, మాకు మేమే ముద్దు, అని రిజిస్టర్ మారేజ్ లు.

పెళ్ళిళ్ళతో పాటుగా, లాయర్లకు కూడా, విపరీతమైన గిరాకీ పెంచాము. సరే అది వేరే విషయము, అప్రస్తుతము ఇక్కడ.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మరలా పాత రోజులకు పోతున్నామా, పెళ్ళి సమయములో, పాటలు డాన్సులు విషయంలో, అని అనిపిస్తుంది. ఈ పాట వినే ఉంటారు కదూ.

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా, డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా, చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు

అని ఇప్పుడు, పెళ్ళి కూతుళ్ళు, నడిరోడ్డు మీదనే, జనము అందరి ముందు, ఆనందము గా డాన్సులు వేస్తున్నారు, పిల్లాడికి భవిష్యత్తు ఇప్పుడే చూపిస్తున్నారు, తర్వాత అంతా నేనే చెప్పెది నువ్వే వినేది అని.

రోడ్ పై, ఎంతో మంది ఫోన్లు లో రికార్డు చేస్తున్నారు, అయినా పర్లేదు, విపరీతమైన పబ్లిసిటీ.



మరి ఇది సాంప్రదాయమా, మరి ఇంట్లోనే డాన్స్ వద్దు అన్న వారు, ఇప్పుడు ఇలా చేయడం కరెక్టేనా, అన్న విషయాలు పక్కన పెడితే, అందరూ ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, ప్రోత్సహిస్తున్నారు.

అబ్బాయి, కాస్త ఇబ్బంది పడి ఆశ్చర్యపోయి, తర్వాత తేరుకున్నాడు, జీవితములో తర్వాత భాగం అర్ధము అయ్యి.

సోషల్ మీడియాలో, కోట్ల మంది వీటిని చూసి, ఆదరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల లో ఇప్పుడు ఈ పాట వినని వారు లేరు, అంటే అతియోశక్తి కాదేమో.

ఇకపై కొత్త పెళ్ళి వారు కూడా, దీనికి ఇక ప్రత్యేక పెళ్ళి ముందు, సాధనా కార్యక్రమాలు పెడతారేమో మరి, ఫోటో మరియు వీడియో షూట్ ల మాదిరిగా.

ఒకరితో మొదలు పెట్టిన, ఈ నడి రోడ్డు నాట్యం ప్రభావం, ఆసుపత్రిలో నర్సులు కూడా, రోగుల ట్రీట్మెంట్ దగ్గర వేసే స్థాయికి వెళ్ళింది.

మరి ఇంకా ఎన్నెన్ని మార్పులు వస్తాయో చూడాలి. మరి సొంతముగా పాడటము కూడా నేర్చుకునే స్థాయి కూడా వస్తుందేమో చూడాలి.



ఇప్పుడు, దూరం గా బెంగుళూర్, లండన్, అమెరికాలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే, ఇక్కడ మన దేశం లో ఉండి, ఆన్లైన్ లో చూసి, దీవించి తలంబ్రాలు వేయడం భోజనాలు చేయడం కూడా, అంగీకరించేస్తున్నాము.

వద్దు అంటే, విని ఆగే వారూ లేరు, అలా పెంచే స్థితిలో మనమూ లేము, కాబట్టి ఏదోవిధంగా మమ అనిపించేస్తున్నారు.

ఇప్పుడు విడిపోవడం కూడా ఫ్రెండ్స్ మాదిరిగా, పెద్ద ఎత్తున పార్టీలు తో వైభవంగా కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది పెళ్ళి అప్పుడే, విడిపోయే పాకేజ్ కూడా రాసుకుని, సంతకాలు పెట్టుకుంటున్నారు, భవిష్యత్ గొడవలు లేకుండా, కోర్ట్ లాయర్లతో పని లేకుండా, ముందు చూపుతో.

గతములో బాల్య వివాహాలు మరియు సతీసహగమనాలు ఎందుకు చేసారో, చాలా మంది కి తెలీదు. కానీ ఇప్పుడు తాలిబన్ల పుణ్యమా అంటూ, వాటి విలువ చరిత్ర అవసరం, అక్కడ బాగా తెలుస్తుంది.

ముష్కరుల నుంచి తమ పిల్లలను కాపాడాలి అంటే, వయసుతో నిమిత్తము లేకుండా ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టి, తమ పిల్లలను కాపాడుకుంటున్నారు, ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. అలాగే భర్త లేని వారు, ముష్కరుల చేతిలో నరకము కన్న, చావే మేలు అనుకునే విధము గా ఉన్నది. చూసారు కదా, విమాన రెక్కలు పట్టుకుని మగవాళ్ళ పరుగులు. సరే అది అక్కడ పరిస్తితి ఇప్పుడు.

మరి ఇదంతా మంచికా, చెడుకా అన్నది కాలానికి వదిలేసి, మనమూ సంగీతాన్ని పాటలను డాన్సులను ఆస్వాదిస్తూ, కాల మార్పునూ అంగీకరించాలి మరి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1274 General Articles, 47 Tatvaalu
Dt : 05-Sep-2021, Upd Dt : 05-Sep-2021, Category : General
Views : 109 ( + More Social Media views ), Id : 1244 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bullett , bandi , vacchesta , andhala , duniyane-chupistha , marraige , pelli
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content